పెళ్లికి కాదు మహాప్రభో… 3 రోజులపాటు జరిపే ప్రివెడ్డింగ్ ఫంక్షన్‌కే అతిరథ మహారథులు వస్తున్నారట… అదేనండీ, కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ప్రోగ్రామ్… ఇక పెళ్లి ఏ రేంజులో ఉండబోతోందో ఊహించుకోవాల్సిందే… అన్నట్టు, ప్రపంచ ముఖ్యులు ఎవరొస్తున్నారంటే..? కొందరు గ్లోబల్ రిచ్ పర్సనాలిటీల జాబితా ఇది…
- Meta CEO Mark Zuckerberg
- Morgan Stanley CEO Ted Pick
- Microsoft founder Bill Gates
- Disney CEO Bob Iger
- BlackRock CEO Larry Fink
- Adnoc CEO Sultan Ahmed Al Jaber
- EL Rothschild chair Lynn Forester de Rothschild
- Bank of America chairman Brian Thomas Moynihan
- Blackstone chairman Stephen Schwarzman
- Qatar Premier Mohammed bin Abdulrahman bin Jassim Al Thani
- Adobe CEO Shantanu Narayen
- Lupa Systems CEO James Murdoch
- Hillhouse Capital founder Zhang Lei
- BP chief executive Murray Auchincloss
- Exor CEO John Elkann
- Brookfield Asset Management CEO Bruce Flatt
జుకర్ బర్గ్, బిల్ గేట్స్, మిలిందా గేట్స్, ఇవాంకా ట్రంప్ ఎట్సెట్రా… వాళ్లూ కుబేరులే… అంబానీ సమస్థాయి… కానీ ఒక్కటి గుర్తుంచుకొండి, ప్రపంచ నాయకులు ఎవరూ రారు, వీళ్లు పిలవరు, పిలిచినా రారు… వ్యాపారులు మాత్రమే వస్తున్నారు… వాళ్లే వస్తారు… ఇక్కడ మళ్లీ రెండంశాలు…
Ads
మన సమాజంలో ఆనవాయితీ ఏమిటంటే..? పెళ్లిని తమ సామాజిక, ఆర్థిక హోదాను చాటడానికి వేదికగా ఉపయోగిస్తాం… ఇదీ అంతే… రెండు ముఖ్యులతో ‘మర్యాదపూర్వక సంబంధాల’ కోసం వాడతాం… ప్రపంచ కుబేరులకు ఆతిథ్యం, ఆహ్వానం అంటే దానర్థం అదే… ఏమో, రేప్పొద్దున ప్రపంచాన్ని శాసించే రంగాల్లోకి కూడా అంబానీ డైవర్సిఫై కాబోతున్నాడేమో…
డబ్బున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది… కానీ ఆ పటాటోపాన్ని, అట్టహాసాన్ని, ఆడంబరాన్ని ఎంతోకొంత పూసుకోవాలనుకునే మధ్యతరగతి వాడేమో అప్పులపాలవుతాడు… లోకం కోసం..! అందుకని నిరాడంబర వివాహాల్నే ఆహ్వానిద్దాం… అలాగని అంబానీ ఇంట్లో ఫంక్షన్‌ను వ్యతిరేకించడం కాదు సుమా… వాళ్లింట్లో శుభకార్యం, ఎలా చేయాలో వాళ్లిష్టం… వాళ్ల ఖర్చు…
ఇక్కడ చెప్పుకోవాల్సింది నిజానికి ఇది కాదు… మామూలుగా నిశ్చితార్థం అయ్యాక ఏ రెండు మూడు నెలలకో పెళ్లి కూడా జరిపించేయడం మన తెలుగిళ్లలో ఉన్న సంప్రదాయం… కానీ ఈ అనంత్ అంబానీ -రాధిక మర్చెంట్ల నిశ్చితార్థం జరిగి 13 నెలలు… ఇంతకాలం ఎందుకు ఆగిందో తెలియదు…
నిశ్చితార్థం నాటి ఆ ఫోటోలన్నీ చూస్తుంటే… ఇప్పటికీ మీడియాలో కనిపిస్తున్న ఫోటోలు చూస్తుంటే… ఒక జీవితసత్యం మాత్రం బోధపడుతుంది… శుభకార్యంవేళ ఈ ప్రస్తావన క్షమార్హం కాదేమో కానీ చెప్పుకోవచ్చు… రాధిక మర్చెంట్ సన్నగా తీగెలా కనిపిస్తుంటే పక్కన అనంతుడు ఆడ్‌గా కనిపిస్తున్నాడు… మ్యాచ్ మిస్ మ్యాచ్… నిజానికి 208 కిలోలున్న అనంతుడు 18 నెలల్లో 108 కిలోలు తగ్గిన వైనం అప్పట్లో వైరల్…
రోజూ ఏడెనిమిది కిలోమీటర్ల నడక, కీటో డైట్, ప్రత్యేకంగా శిక్షకులు, పళ్లరసాలు, ప్రొటీన్ ఫుడ్, నో కార్బ్స్, లెక్క ప్రకారం రోజూ 1000 కిలోకాలరీలు దాటని ఆహారం… కానీ ఏమైంది..? మళ్లీ మొదటికి వచ్చింది… మునుపటి అనంతుడే కనిపిస్తున్నాడు… ఏవో పద్ధతుల్లో కష్టపడి, బరువు తగ్గడం కాదు, దాన్నలాగే మెయింటెయిన్ చేయడమే ఇంకా కష్టమనే నిజాన్ని అనంతుడి రూపం మనకు చెబుతుంది…
నా కొడుక్కి ఆస్త్మా, హైడోస్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రభావం ఉంది, అవి మావాడికి పడటం లేదు అని చెబుతుంది నీతూ… సరే, అది కాకపోతే మరో అనారోగ్యం కావచ్చుగాక… ప్రపంచంలో ఏ మూల ఎన్ని కోట్ల ఫీజు ఇచ్చయినా సరే, తీసుకొచ్చి చికిత్స చేయించగల కుబేరుడు అంబానీకి, వరల్డ్ టాప్ టెన్ ధనికుల్లో ఒకడైన అంబానీకి, నిలబెట్టి ప్రభుత్వాలను కొనేయగలిగిన అంబానీకి… కొడుకు రూపం ఓ సవాల్… ఏమీ చేయలేడు, చేయలేకపోయాడు… దాన్నే విధి అంటారు…! డబ్బుతో, పలుకుబడితో, హోదాతోనే ఈలోకంలో అన్నీ సాధ్యం కావు… కావు…!! డెస్టినీ డిసైడ్స్ ఎవరీ థింగ్..!!
ఇంతకీ ఈ రాధిక మర్చెంట్ ఎవరనేదే కదా మీ ప్రశ్న… గుజరాతీయే… ముంబైలో పెరిగింది, న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుకుంది… తండ్రి పెద్ద వ్యాపారే… కాబోయే అత్త నీతూ అంబానీలాగే రాధిక కూడా ట్రెయిన్డ్ డాన్సర్…
Share this Article