నితా అంబానీ… ముఖేష్ అంబానీ భార్య… శాస్త్రీయ నృత్యకారిణి… ఆమె డాన్స్ చూసే ముఖేష్ ఇష్టపడ్డాడు అంటారు… పెళ్లి తరువాత ఆమె మళ్లీ ఎక్కడా డాన్స్ చేసినట్టు పెద్దగా తెలియదు… కొడుకు ప్రివెడ్ సెలబ్రేషన్స్‌లో ఆమె స్వయంగా డాన్స్ చేసింది… ఆహుతులకు కన్నులపండుగ… మళ్లీ పాత నితా కనిపించింది…
ఆమె డాన్స్ బిట్ ఈ రీల్లో చూడొచ్చు… https://www.facebook.com/reel/4132973036929641
ఇదే కాదు, సంగీత్ కోసం ముఖేష్, ఆమె కలిసి ఓ సాంగ్ చేయాలి… దానికోసం రిహార్సల్స్ చేస్తున్న సీన్లను కూడా ఇషా అంబానీ పరిమళ్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది… అవేకాదు, ఈ ప్రివెడ్, వెడ్ రిలేటెడ్ ప్రోగ్రాములన్నీ వీడియో తీసి పెట్టింది… అన్నట్టు అవన్నీ చూడాలంటే ఇదుగో ఇదీ ఆమె ఇన్‌స్టా హ్యాండ్లింగ్… https://www.instagram.com/_ishaambanipiramal/?utm_source=ig_embed&ig_rid=aef7cd75-5875-48d9-8a21-5e2b63e3d00c
Ads
ప్యార్ హువా, ఎకరార్ హువా అనే ఓ పాత పాపులర్ హిందీ సాంగ్‌లో ముఖేష్, నితాల అభినయం చిత్రంగా, బాగుంది… 1200 కోట్ల ఖర్చు… తన సంపదలో 0.01 శాతం… అంతకుముందు పెళ్లిళ్లకు ఇంత హడావుడి కనిపించలేదు… అనంత్ అంబానీ పెళ్లికి మాత్రం తన సంపద, రేంజ్ ఏమిటో ప్రదర్శిస్తున్నాడు…
ప్రదర్శనకన్నా తన ఈ ఈవెంట్‌ను సంపూర్ణంగా ఆనందిస్తున్నాడు… విదేశీ పాప్ సింగర్ రెహన్నాను తీసుకొచ్చి, అమెరికన్ సింగర్ అకాన్ను పట్టుకొచ్చి, కోట్లు పెట్టాడు… బాలీవుడ్ మొత్తం ప్రివెడ్ ఫంక్షన్లోనే… ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా… సచిన్ వంటి క్రీడాకారుల సంగతి చెప్పనక్కర్లేదు… హిందీ టాప్ స్టార్లు ముగ్గురు ఖాన్లు రాంచరణ్‌తో కూడా నాటునాటు అంటూ డాన్స్ చేశారు కలిసి… చేస్తారు, మరి అంబానీ ఇంట పెళ్లి ఫంక్షన్ అంటే మజాకా..?
బ్యూరోక్రాట్స్, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ముఖ్యులే కాదు… దేశవిదేశాల నుంచి జుకర్ బర్గ్ వంటి ముఖ్య అతిథులూ ఈసారి విశేషం… అంబానీ అంటే ఇదీ అని ఆవిష్కరిస్తున్నాడు… ఈ మొత్తంలో తమ్ముడి జాడ, పాత్ర పెద్దగా కనిపించడం లేదు ఏమిటో మరి… రెండు బ్యాగులు మోసుకుంటూ అందరు అతిథుల్లో ఒకడిగా నడిచి వస్తున్న ఫోటో మాత్రం కనిపించింది… ఈ మొత్తం అంగరంగ వైభోగంలో ఒకటి మాత్రం జనానికి బాగా కనెక్టయింది… అది ముఖేష్ కంట నీళ్లు…
అనంత్ అంబానీ మాట్లాడుతూ… తన ఆరోగ్యం గురించి ప్రస్తావించి, తన పేరెంట్స్ పెట్టిన శ్రద్ధను చెబుతున్నప్పుడు ముఖేష్ ఉద్వేగానికి గురయ్యాడు… సహజం… కుబేరుడైనా సరే కుమారులు ఉంటారు… ఆ కుమారుల అవస్థల పట్ల తండ్రుల కళ్లల్లో నీళ్లూ ఉంటాయి… ముఖేష్ అతీతుడు ఏమీ కాదు కదా..!!
Share this Article