Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Swatantrya Veer Savarkar… మరో ప్రాపగాండా మూవీ అట్టర్ ఫ్లాప్…

March 23, 2024 by M S R

నో డౌట్… స్వతంత్ర వీర సావర్కర్ అనే తాజా సినిమా ఖచ్చితంగా బీజేపీ భావజాల వ్యాప్తికి ఉద్దేశించిన సినిమా… పొలిటికల్ ప్రాపగాండా కోసమే… అందుకే సరిగ్గా ఎన్నికల ముందే ఇవి రిలీజ్ అవుతుంటయ్… ఐతే ఈ సినిమా డిజాస్టర్… జస్ట్, కోటి రూపాయలు వసూలు చేసింది రెండు రోజుల్లో…

ఒక రాజకీయ పార్టీ భావజాల వ్యాప్తికి సినిమాల్ని తీసి, జనంలోకి వదలడం సరైందేనా అనే చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు… ఇన్నాళ్లూ సావర్కర్‌ మీద యాంటీ -హిందూ సెక్షన్లు విపరీత విమర్శలు చేశాయి… తన త్యాగాన్ని, జైలు జీవితాన్ని కూడా అవి పరిగణనలోకి తీసుకోలేదు… ఎస్, సావర్కర్ హిందుత్వవాది… అఖండ్ భారత్ సమర్థకుడు… గాంధీ అనుసరించిన స్వతంత్ర పోరాట పంథాతో కూడా విభేదించేవాడు… సరే, ఇక్కడ ఆయన లైఫ్ మీద సమీక్ష కూడా ఇక్కడ అక్కర్లేదు… (ఒకసారి రాహుల్ గాంధీ ఏదో విమర్శ చేస్తే, మిత్రపక్షమైనా సరే శివసేన ఘాటుగా స్పందించింది… అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది…)

బీజేపీ ఆరాధించే వ్యక్తుల్లో సావర్కర్ పేరు కూడా ప్రముఖస్థానంలోనే ఉంటుంది… అలాంటప్పుడు ఆయన బయోపిక్ తీస్తున్నప్పుడు పూర్తిగా ఏకపక్షంగా తీయకుండా, సినిమా ఒకవైపే ఒరిగిపోకుండా… కాస్త వాస్తవ చరిత్ర చెబుతున్నట్టుగా ఉంటే, సినిమా కంటెంటుకు క్రెడిబులిటీ ఉండేది… అంతేకాదు, సినిమా కంటెంట్ ప్రజెంటేషన్ స్టయిల్ కూడా ఇంపార్టెంట్… ప్రస్తుతం వచ్చిన సావర్కర్ సినిమా అందులో ఫెయిలైంది…

Ads

ఈ సినిమాలో సావర్కర్ పాత్ర కోసం హీరో రణదీప్ హుడా గరిష్ట స్థాయిలో కసరత్తు చేశాడు, కష్టపడ్డాడు, బాగా బరువు తగ్గాడు, సావర్కర్ బాడీ లాంగ్వేజీని అనుకరించడానికి ప్రయత్నించాడు… రాత, తీత కూడా తనదే… అంటే స్క్రిప్టు, దర్శకత్వం కూడా తనే… నటుడిగా ఎంత పర్‌ఫామెన్స్ చూపించాడో దర్శకుడిగా అంతే ఫెయిలయ్యాడు… ఎక్కడా ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోయింది…

ఇక్కడ మరో విషయం చెప్పుకోవడం సబబు… 2001లో వీర్ సావర్కర్ పేరిట మరో సినిమా రిలీజైంది… ఇది డీవీడీ ఫార్మాట్‌లో రిలీజ్ చేశారు… అప్పటికి సీడీలు, డీవీడీలు ఇంకా ఉన్నాయి… దీన్ని సావర్కర్ దర్శన్ ప్రతిష్టాన్ విరాళాల ఆధారంగా (ప్రజావిరాళాలతో తొలి సినిమా..?) నిర్మించింది… సో, సహజంగానే సావర్కర్‌ను హైలైట్ చేస్తూ కథ సాగింది… దీని గుజరాతీ వెర్షన్‌ను 2012లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ రిలీజ్ చేశాడు…

కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, ఆర్టికల్ 370, యురి వంటివి హిట్టయ్యాయి… అంటే కంటెంటు ఏమిటనేది కాదు, దాన్ని ఎలా ప్రజెంట్ చేశారనేది ముఖ్యం… కానీ మై అటల్ హూ పెద్ద సక్సెస్ కాలేదు, బస్తర్ ది నక్సల్ స్టోరీ ఫ్లాప్… కారణం, రెండూ పూర్తిగా వన్ సైడెడ్, పూర్ ప్రజెంటేషన్… నిర్మాతలు వేర్వేరు కావచ్చుగాక,  బీజేపీ ఫండింగ్ ఉండకపోవచ్చుగాక, కానీ బీజేపీ కోసం ఉద్దేశించిన సినిమాలే… రజాకార్ సినిమా తెలంగాణలో పర్లేదు, నడుస్తోంది… చరిత్రను బీజేపీ కోణంలో కొంత వక్రీకరించినట్టు బలమైన ఆరోపణలున్నా, నిర్మాతకు కావల్సిన రీతిలో కొన్నిసీన్లను ఎఫెక్టివ్‌గా చిత్రీకరించారు…

అదే వ్యూహం దరిద్రమైన డిజాస్టర్… మరీ ఘోరంగా 27 లక్షల వసూళ్లు… ఆ దెబ్బకు శపథం అనే సీక్వెల్ అసలు థియేటర్లకే రాలేదు… కాస్త రాజధాని ఫైల్స్ నయం. అది కనీసం కోటి రూపాయలు వసూలు చేసింది… సో, పొలిటికల్ ప్రాపగాండా, అనగా ఒక పార్టీ భావజాల వ్యాప్తికి సినిమా మాధ్యమాన్ని ఎఫెక్టివ్‌గా వాడుకోవడం కూడా ఓ కళ… అందులో సావర్కర్ సినిమా ఫెయిల్…!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions