Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణకు శ్రీదేవి మేనకోడలు… అప్పట్లో బాలనటి… దాసరి సహాయ దర్శకుడు…

April 2, 2024 by M S R

Subramanyam Dogiparthi…   అతిలోక సుందరి శ్రీదేవి బాలనటిగా నటించిన మొట్టమొదటి తెలుగు సినిమా 1970 లో వచ్చిన ఈ *మా నాన్న నిర్దోషి* సినిమా . కృష్ణ , విజయనిర్మలలకు మేనకోడలుగా నటించింది . పెద్దయ్యాక కృష్ణతో 31 సినిమాలు నటించింది . చిన్నప్పుడు ఆడుకోవటానికి కృష్ణ వాళ్ళింటికి వచ్చేదట . మద్రాసులో కృష్ణ పక్కింట్లో ఉండేవారట .

కె వి నందనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పిల్లలివే . కృష్ణ , విజయనిర్మలలకు కొడుకుగా బేబీ శశి , మేనకోడలుగా బేబీ శ్రీదేవి పాత్రలే ప్రధాన పాత్రలు . ఆ తర్వాత కృష్ణ , విజయనిర్మల , నాగభూషణం , సూరేకాంతం , గుమ్మడి , నాగయ్య , రాజబాబు , రమాప్రభ , విజయలలిత , మాస్టర్ విశ్వేశ్వరరావు , మిక్కిలినేని ప్రభృతులు నటించారు .
పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . బేబీ శ్రీదేవి , బేబీ శశిల పాటలు ఎంతెంత దూరం , రండీ అమ్మాయి గారు బాగుంటాయి . ఇద్దరు పాపల నటన అభినందనీయంగా ఉంటుంది . మిగిలిన పాటలు ఏమండీ అబ్బాయి గారు , అమ్మ దొంగా వగైరా థియేటర్లో బాగున్నా బయట హిట్ కాలేదు .
చేయని హత్యకు జైల్లో శిక్ష అనుభవిస్తున్న తండ్రిని నిర్దోషిగా రుజువు చేయటమే టూకీగా కధాంశం . కొడుకు , మేనకోడలు కలిసి ఈ కధను నడిపిస్తారు . సినిమా ఏవరేజ్ గా ఆడిందని గుర్తు . మా నరసరావుపేటలోనే చూసా . యూట్యూబులో ఉంది . శ్రీదేవి బాలనటిగా నటించిన మొట్టమొదటి సినిమా చూడకపోతే ఎలా ?
ఈ సినిమాకు ముందే ఒకటి రెండు తమిళ సినిమాల్లో నటించింది శ్రీదేవి , భక్త ప్రహ్లాదలో మొదటిసారిగా నటించిన రోజారమణి మంచి నటీమణులు . By the way , దాసరి నారాయణరావు ఈ సినిమాకు సహకార దర్శకుడు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…
  • ఇడుపు కాయితం! తెలంగాణ సెంటిమెంట్ రాజేసే పొలిటికల్ కుట్రలు!?
  • ముఖ్యమంత్రి సినిమా నిర్మాత… ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అయిపోయాడు!
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ – ఒక థ్రిల్లింగ్ ‘మెగా’ సీరియల్!
  • పల్స్ పోలియో! ఏటా ‘చుక్కల’ ప్రయాసకు కూడా పాకిస్థానే కారణం..!
  • అన్నీ వదిలేసి.., హిమాలయ సన్యాస జీవనం అంత సులభమా?
  • నిజమే – పాస్‌పోర్టు జాతీయతను నిర్ధారించదు! ఇదీ వాస్తవ స్థితి!
  • RAAKA – రష్మిక నెగెటివ్ షేడ్స్ – రొమాన్స్ కాదుట, ఘర్షణ !
  • BRS – నైరాశ్యం వీడని పార్టీ కేడర్! ఫాయిదా లేని KTR ప్రయాస!!
  • ఆశ్చర్యమేమీ లేదు- పాక్ క్రికెటర్లతో ఉగ్రవాదుల చెట్టాపట్టాల్!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions