మూడో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక్కొక్కరూ బయటపడుతున్నారు!
West Bengal కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదురీ.
ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ ఆర్విందర్ సింగ్ లవ్లీ!
*******
ముందుగా వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదురి ఏమన్నాడు అంటే…: వెస్ట్ బెంగాల్ ఓటర్లకి నా విజ్ఞప్తి ఏమిటంటే మీరు బిజేపికి ఓటు వేయండి. TMC కి కాంగ్రెస్ కి ఓటువేయొద్దని కోరుతున్నాను అని…
కాంగ్రెస్ లో ఉన్న తికమకకి నిదర్శనం ఇది! ఎంత కన్ఫ్యూజన్ ఉంటే అదీర్ రంజన్ ఇలా మాట్లాడతాడు? అధీర్ రంజన్ చౌధురీ ఎవరు? వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్! లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు!
Ads
వెస్ట్ బెంగాల్ లోని బెరహంపూర్ నియోజక వర్గం నుండి లోక్ సభకి వరుసగా ఎన్నిక అవుతూ వస్తున్నాడు. వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమయిన నాయకుడు. బేరహంపూర్ లో ఎన్నికల ప్రచారానికి సోనియా, రాహుల్ ప్రచారం చేయకపోయినా స్వంతంగా ప్రచారం చేసుకొని గెలుస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా సోనియాకి రైట్ హాండ్!
అలాంటి ఆదీర్ రంజన్ చౌదురీ ఎందుకు తిరగబడ్డాడు? INDI కూటమిలో TMC ఉండడం అధీర్ రంజన్ కి ఇష్టం లేదు. మోదటి నుండీ మమతను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు! కాంగ్రెస్ కూటమిలో TMC ఉండటానికి ప్రయత్నించినపుడు సోనియా దగ్గర మొత్తుకున్నాడు పొత్తు కోసం చర్చలు జరపవద్దు అని. కానీ సోనియా మాత్రం రాహుల్ దగ్గరికి వెళ్లి చెప్పుకోవాలని తప్పుకుంది.
అదీర్ రంజన్ కి తెలుసు రాహుల్ దగ్గరికి వెళితే ఏమవుతుందో ! నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తీరా పోలింగ్ దగ్గర పడే సమయంలో నోరు విప్పాడు! అదీర్ రంజన్ ఆలోచన ఏమిటంటే… బెంగాల్ లో కాంగ్రెస్ గెలిచే రెండు సీట్ల వల్ల లోక్ సభలో ఒరిగేది ఏమీ ఉండదు. అటువంటప్పుడు డబ్బు ఖర్చు పెట్టీ గెలవడం దేనికోసం?
అదేదో బిజేపికి మరో రెండు సీట్లు అదనంగా వస్తే మమతను ఒక ఆట ఆడుకుంటుంది! ఇదీ అధేర్ రంజన్ ఆలోచన! ఉన్నది 4% ఓట్లే అయినా అవి చీలి TMC కి పడకుండా బిజేపికి మళ్లించడమే అధీర్ రంజన్ ఆలోచన! అదీర్ రంజన్ ప్రకటనతో కాంగ్రెస్ కార్యకర్తలలో గందరగోళం నెలకొంది అన్నది వాస్తవం!
,********
TMC కి కూడా బిజేపి వైరస్ సోకింది! మొన్న TMC జెనరల్ సెక్రటరీ అయిన కుణాల్ ఘోష్ ను సస్పెండ్ చేసింది మమత! ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న కునాల్ ఘోష్ తన అనుచరులతో మాట్లాడుతూ ఉత్తర బెంగాల్ లోక్ సభ బిజేపి అభ్యర్థి అయిన తపస్ రాయ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు కునాల్ ఘోష్!
వార్త మమత చెవిన పడింది. అంతే! కునాల్ ఘోష్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది! So! వెస్ట్ బెంగాల్ లో బిజేపి లీడింగ్ లో ఉంది అన్నది సత్యం! మమత నిరంకుశ పాలన కింద ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు అన్నది స్వంత పార్టీ వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నది. ఇదేదో జర్నలిస్టులు చెప్తున్నది కాదు!
బీజేపీ గెలిచిన తరువాత తమకి రక్షణ ఇస్తుంది అనే భరోసా కనుక ఇస్తే 30 సీట్లలో గెలుపుని ఇస్తారు వెస్ట్ బెంగాల్ ఓటర్లు! బిజెపి నాయకత్వం ఆ భరోసా గట్టిగా ఇస్తే బెంగాల్ లో క్లీన్ స్వీప్ చేయగలదు బీజేపీ!
*********
ఢిల్లీ కాంగ్రెస్ – అర్విందర్ సింగ్ లవ్లీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే! ఆర్వీందర్ కి AAP తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేకనే రాజీనామా చేశాడు. పైకి ఒక మామూలు కార్యకర్తగా పని చేస్తాను అని అంటున్నా బిజేపి లోకి చేరతాడు అని వార్తలు వస్తున్నాయి.
అఫ్కోర్స్! కాంగ్రెస్ కి ఢిల్లీలో పట్టు పోయి చాలాకాలం అయ్యింది. ఇక AAP కి దిశా నిర్దేశం చేసేవాళ్ళు లేరు! సునీత కేజ్రీవాల్ కాంగ్రెస్ మీద ఆధారపడి పనిచేస్తున్నారు తప్పితే సరయిన వ్యూహం లేదు. ఢిల్లీలో కూడా బిజేపి క్లీన్ స్వీప్ చేస్తుంది! ED మొదటిసారి సమన్లు ఇచ్చినప్పుడు కేజ్రీవాల్ హాజరయ్యి ఉంటే ఈపాటికి కొంచెం క్లారిటీ ఉండేది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు జైల్లో ఉండాల్సి వచ్చింది! ( Article By పొట్లూరి పార్థసారథి )
Share this Article