Nationalist Narasinga Rao…. లోకసభ ఎన్నికలకు సుమారు నాలుగు ఐదు నెలల ముందు నుండి ( 2024 జనవరి) ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు ఇచ్చిన అన్ని రకాల సర్వేలు ఫాలో అయ్యా…
కేవలం ఈ సర్వేల మీదనే మాత్రమే ఆధార పడకుండా…. 15 రాష్ట్రాల్లో (ఒక్కొక్క రాష్ట్రమ్ లో పది మందికి తక్కువ కాకుండా ) నాకు ప్రత్యక్ష పరిచయం ఉన్న ఫ్రెండ్స్ / కొలీగ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు… వీళ్ళతో ఈ 5 నెలలలో ప్రతి పదిహేను రోజులకు … కొంతమందితో ప్రతి ఆదివారం మాట్లాడాను… ఇందులో యూపి వాళ్ళు ఎక్కువ, అక్కడ సీట్లు ఎక్కువే (80)…
ఓవరాల్ గా జూన్ నాలుగున రాబోయే ఎన్నికల ఫలితాల్లో బిజెపి 325 సీట్ల వరకూ వస్తాయి అనేది నా అంచనా…. జనవరి నుండి నా అంచనా ఇదే.. మార్పు లేదు… NDA లో ఇతర పక్షాలకు 40- 50 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉంది, వెరసి 360 పైన ఉంటుంది …. (నారపరాజు నరసింగరావు)
Ads
(కార్టూనిస్టు సుభానీ సౌజన్యంతో)
(రాజకీయాలపై, ఎన్నికల ఫలితాలపై అందరికీ ఆసక్తే… కాకపోతే చాలామంది ఎగ్జిట్ పోల్స్ మీద, ఒపీనియన్ పోల్స్ మీద, మీడియా వార్తల మీద ఆధారపడి ఓ అంచనాకు వచ్చేస్తుంటారు ఫలితాల మీద… చివరకు సట్టా బజార్, స్టాక్ మార్కెట్ మూమెంట్స్, పొలిటికల్ పార్టీల టైమ్లీ ప్రకటనలు వంటి చాలా అంశాలు ఓ అంచనాను కలుగజేస్తుంటాయి… కొన్నిసార్లు ఓ ముఖ్య పార్టీ నేతను అధికారులు ఫలితాలకు ముందే కలుస్తున్నారూ అనేది కూడా ఓ ఇండికేషనే… (రాష్ట్రాలకు సంబంధించి)…
సరే, ఇవన్నీ ఎలా ఉన్నా, బోల్తాకొట్టొచ్చు, నిజం కావచ్చు… కానీ ఇంకొందరు ఆసక్తిపరులు ఇదుగో ఈ రేంజ్లో తమదైన స్టయిల్లో వివరాలు సమీకరించుకుంటూ, క్రోడీకరించుకుంటూ ఓ అంచనాకు వస్తుంటారు… ఇంట్రస్టింగు… అది చెప్పడం కోసమే ఈ పోస్టు…. ముచ్చట)
Share this Article