ఒకాయన… టాలీవుడ్ దర్శకుడు… ఏదో ఓ హిట్ తన ఖాతాలో పడే ఉంటుంది… పేరు హరీష్ శంకర్… బహుశా ధర్మపురి బ్రాహ్మణ అగ్రహారంలో పుట్టుక అనుకుంటాను… మిరపకాయ్, గబ్బర్ సింగ్ , దువ్వాడ జగన్నాథం ఎట్సెట్రా పేర్లు తన ఖాతాలో వికీపీడియాలో కనిపిస్తున్నయ్…
గుడ్, ఓ తెలంగాణ దర్శకుడు… వంగా సందీప్‌రెడ్డి, సంకల్ప్‌రెడ్డి తదితరుల జాబితాలో తనూ చేరాడు, గుడ్… అసలే ఆంధ్రా డామినేషన్ ఉన్న ఇండస్ట్రీ అది… వేరే ప్రాంతీయులు ఎదిగితే అడుగంటా తొక్కేసే బ్యాచుల నడుమ రెండో మూడో హిట్లు ఇచ్చాడు సంతోషం…
కానీ విపరీతమైన అసహనం, ఓర్పురాహిత్యం… హఠాత్తుగా రివ్యూయర్లపై విరుచుకుపడతాడు… మళ్లీ తనకు వ్యతిరేకంగా ఏదైనా ఆర్టికల్ వస్తే రాసినవాళ్లపై పడతాడు… చాన్నాళ్లుగా సినిమాల్లేవు… అదేదో పవన్ కల్యాణ్ సినిమా ఇంకా లైన్‌లో ఉందో లేదో తెలియదు, రవితేజ మిస్టర్ బచ్చన్ మాత్రం పట్టాల మీద ఉంది…
Ads
హఠాత్తుగా ఓ ట్వీట్… ఓ ముసలినక్క ఏం పోస్టు చేసినా భయపడి తగ్గుతాడు అనుకుంటోంది, నా జోలికొస్తోంది, అలాంటి అపోహలు వద్దు, నాజోలికొస్తే రిలీజ్ అయినా వదలను అంటున్నాడు… అసలు ఎవరు ఆ గ్రేట్ ముసలి నక్క..? జర్నలిస్టా..? ఎవరైనా నిర్మాతా..?
జర్నలిస్టే అనుకుందాం… జోలికొస్తే తాట తీస్తాను అంటున్న ఈ సాహసి ఆ నక్క పేరు చెప్పడానికి ఏం భయం..? ఆ ప్రముఖ సైట్ అంటే భయమా..? పోనీ, సైట్ కాదు, ట్యూబ్ చానెలా..? ఫైనాన్షియరా..? మరెవరు..? సరే, వెబ్ జర్నలిస్టే అనుకుందాం, ఆ సైట్ ఆ ముసలి జర్నలిస్టు అంటే ఎందుకు భయపడుతోంది మరి..? చెప్పొచ్చుగా హరీష్ శంకర్… అనవసరంగా జర్నలిస్టులు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు…
ఎస్, కొంతకాలంగా ముగ్గురు నలుగురు జర్నలిస్టులు మరీ మూర్ఖపు ప్రశ్నలు అడుగుతూ ప్రెస్ మీట్లు పెట్టే సినిమా వాళ్లను ఇరిటేట్ చేస్తున్నారు… వాటి వీడియోలు చూస్తున్నవాళ్లకు కూడా చిర్రెక్కుతోంది… వీళ్లేం జర్నలిస్టులురా అని..! సరే, వాళ్ల స్థాయిని బట్టి తోటి జర్నలిస్టులు ఏమీ అనలేక, ఆ సైటుతో ఎందుకొచ్చిన గోకుడు అనుకుని సినిమా వాళ్లు రాజీపడుతున్నారు అనుకుందాం… (సైటా, యూట్యూబరా, మెయిన్ స్ట్రీమ్ టీవీయా, పత్రికా..?)
ఎలాగూ నువ్వు తెగించి ట్వీటుతున్నావు కదా… ముసుగులో గుద్దులాట దేనికి..? ఎవరో చెప్పెయ్… ఆ ముసలినక్క తెచ్చిపెట్టుకున్న కొత్త యవ్వనంతో నీపై ఏం పోరాటానికి వస్తుందో చూద్దాం… ఏమంటావ్ హరీషుడూ..!! నువ్వు మొదలుపెడితే… ఏమో, ఇతర బాధిత సెలబ్రిటీలు కూడా పోరాటానికి నీకు సంఘీభావం ప్రకటిస్తారేమో… ఇతర జర్నలిస్టులూ మద్దతుగా వస్తారేమో… సో, క్లారిటీ ప్లీజ్..!!
Share this Article