మీకేమైనా పిచ్చా..? అన్నింటినీ వేణుస్వామితో ముడిపెడితే ఎలా..? ఆయనేదో చెప్పాడు… తప్పో ఒప్పో… దొరికిండు కదాని ఆడుకుంటున్నది మీడియా, సోషల్ మీడియా, నాస్తిక మీడియా… ప్రత్యేకించి కాబోయే టీటీడీ చైర్మన్ (అనగాా బాబు మార్క్ ఆస్తికుడు అని మీరర్థం చేసుకోవాలి, గ్రేట్ చంద్రబాబు మార్క్ ఆస్తికుడు… ఉద్దరించేది ఏమీ లేదు, చంద్రబాబు ఆబ్లిగేషన్ తప్ప…) ఛానెల్‌లో ఓ ప్రముఖ గోగినేని మూర్తి గారి బాబు గారు మరీనూ… తనెవరో అయిదో చానెల్ సినిమా జర్నలిస్టు అట… నువ్వు సూపరెస్టు బ్రో… మూర్తిని మించిన మూర్తిమత్వం నీది…
తన డ్యూటీలు ఏమిటో తెలియని ఒకావిడ ఫాఫం, వేణుస్వామికి నోటీసులు ఇచ్చిందట, త్వరలో తనను అరెస్టు చేస్తారని యెల్లో మీడియా ఒకటే కూతలు, మోతలు… అసలు ఫిలిమ్ జర్నలిస్టులు అంటేనే వాళ్ల ఇమేజీ వేరు… దానికి డిజిటల్ మీడియా జతకలిసిందట… వుమెన్ కమిషన్‌ను కలిశారట… ఆమె ఎవరో గానీ, రేవంత్ రెడ్డి కీర్తికిరీటంలా ఉంది ఫాఫం…
ఎవరో నార్త్ ఇండియన్ అస్ట్రాలజిస్టు అట… నో, నో, శోభిత, నాగచైతన్య సంసారం దివ్యంగా యావత్ ప్రపంచానికే దేదీప్యమానంగా ఉండబోతోంది అన్నాడట… సరే, పండిట్ జగన్నాథ్ గురూజీ అని బాలీవుడ్ సిద్ధాంతి ఎవరో ఉన్నారట… శోభిత అక్కినేని కుటుంబంతో కలిసిపోయి, కలివిడిగా వ్యవహరిస్తూ, ఓవరాల్ స్థూలమొత్తంగా అక్కినేని కుటుంబ పరువు ప్రతిష్ఠను (?) గగనానికి చేరుస్తుందట… మధ్యలో ఈ వేణు జగన్నాథ స్వామి ఎవరూ అనడక్కండి… అసలు మనం వేరే విషయం చెప్పుకోబోతున్నాం…
Ads
అబ్బే, మనూభాకర్, నీరజ్ చోప్రా గాసిప్‌సహిత పెళ్లాయణం గురించి కాదు… హార్డిక్ పాండ్యా కొత్త లవర్, లవ్ ట్రాకు గురించి కూడా కాదు… వాటిని ఏ జ్యోతిష్కుడూ చెప్పలేదు పాపం… నాగచైతన్య మాజీ భార్య సమంత ఉంది కదా… ఆమె ఒంటరిగా ఉండలేక ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమాయణంలో ఉందట, ఆ వెబ్ సీరీస్ నుంచే టచ్‌లో ఉందట, ఆ టచ్చే నాగచైతన్యను కట్ చేసిందట… ఇప్పుడామె సదరు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంటుందట…
అబ్బే, చాలామంది రాస్తున్నారు… మీడియా, ట్యూబ్ మీడియా, వెబ్ మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోకాల్డ్ ఫిలిమ్ మీడియా మాత్రమే కాదు… నేషనల్ మీడియా కూడా రాసి పడేస్తోంది… ఆలూ లేదు, చూలూ లేదు… ఈరోజుకు ఎవడో దొరకాలి, పెళ్లి చేయాలి, పెటాకులు చేయాలి, బురద జల్లాలి, సమంత అయితేనేం, చైతూ అయితేనేం… మీరు కుమ్మేయండ్రా భయ్… మీకు అడ్డేముంది..? వుమెన్ కమిషన్ దాకా రూట్స్ ఉన్నయ్ మీకు… ఫాఫం రేవంత్ రెడ్డి…
అసలు ఎవరు ఈ రాజ్ నిడిమోరు..? తెలుగు వాడే… రాయలసీమ కావచ్చు బహుశా… ఫ్యామిలీ మ్యాన్ మాత్రమే కాదు, ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సీరీస్ ఉంది కదా… దానికి తెలుగులో దర్శకత్వం వహిస్తున్నాడట… అదెప్పుడు వస్తుందీ అనడక్కండి, ఆమె ఫీలవుతుంది… అవునూ, ఇవన్నీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడటం కాదా లేడీ యువరానర్..? మస్తు దేశోద్ధారక జర్నలిస్టులు (?) ఈ అన్ని విషయాల్లోనూ రేవంత్ మార్క్ వుమెన్ కమిషన్ దగ్గరకు ఎందుకు పోవడం లేదు మరి..?! అవునూ, అరెస్టు చేయించారా సదరు జ్యోతిష్కుడిని ఫాఫం..!!
Share this Article