Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పాత బిగ్‌బాస్ అల్లర్లు రిపీటయితే… ఈసారి అన్నపూర్ణ స్టూడియోస్‌పైనే యాక్షన్..!!

August 25, 2024 by M S R

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఇతర తలనొప్పులతో బహుశా నాగార్జున బిగ్‌బాస్ హోస్టింగ్ ఆలస్యం అవుతుందేమో… ఏమో, చెప్పలేం… అదీ ప్రధాన ఆదాయవనరు కాబట్టి (స్టూడియో లీజ్, హోస్టింగ్ ఫీజ్) వెంటనే రెడీ అవుతాడేమో కూడా…

నిజానికి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, ఒప్పందాలు పూర్తయి ఉండాలి… ఐతే గతంలోలాగా వివరాలు లీక్ గాకుండా జాగ్రత్తపడుతున్నారు… ఈసారి ఎవరెవరు అనే ఆసక్తి, థ్రిల్ లాంచింగ్ నాటికి అలాగే ఉండేందుకేమో… ఈలోపు యూట్యూబర్లు, సైట్లు అన్నీ కలిసి దాదాపు రెండొందల మందిని ఎంపిక చేశాయి… సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచించకుండా…

రీసెంటుగా బలంగా వినిపించే పేర్లు… బేబక్క, ఇంద్రనీల్, పవిత్ర, యాదమరాజు, సాకేత్, సీత, యష్మి, సన, అంజలి, బబ్లూ, సౌమ్యారావు, ఓమ్ ఆదిత్య, రీతూ చౌదరి, నిఖిల్, సుబ్బు, తేజస్వి, అభీరాం పేర్లు వినిపిస్తున్నాయి… చాలామంది టీవీ షోలలో, సీరియళ్లలో కనిపించేవాళ్లే… (కొన్ని మారవచ్చు)

Ads

కామన్ మ్యాన్ అనే ప్రయోగం బెడిసికొట్టి… మరీ పల్లవి ప్రశాంత్ వంటివాళ్లను ఎంపిక చేస్తే, శివాజీ వంటి ఓవరాక్షన్ నటుడి మద్దతుతో చివరకు స్టూడియో బయట వాహనాల ధ్వంసం, అల్లర్లు, అసాంఘిక ధోరణులతో కంపు, పెంట అయిపోయింది… ఈసారి గనుక అలాంటివి మళ్లీ చోటుచేసుకుంటే, ఈసారి కేసులు పెట్టడంతో సరిపోదు, అన్నపూర్ణ స్టూడియోనే మూసివేయించే ప్రమాదం ఉంది… ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనుభవమే ఉదాహరణ…

ఐనా గతంలో భిన్న వృత్తులు, భిన్న ప్రవృత్తులు, భిన్న రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఎంపిక చేసేవాళ్లు, షో పై కాస్త ఆసక్తి ఉండేది జనానికి కూడా… కానీ క్రమేపీ దాన్ని నానా అవలక్షణాల్ని నింపి డర్టీ హోమ్ చేసేశారు… పైన వినిపించే పేర్లలో కొందరు సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారట…

biggboss

అంటే ఇకపై టీవీ యాక్టర్లు, యాంకర్లు, యూట్యూబర్లదే బిగ్ బాస్‌లో హవా అన్నమాట… జస్ట్, వాళ్లలోవాళ్లు తన్నుకోవడం, జనానికి వినోదం పేరిట పంచడం… వీరిలో సాకేత్ సింగర్… మ్యూజిక్ రియాలిటీ షోలలో కనిపించేవాడే… తేజస్వి బెటర్ కంటెస్టెంట్ అవుతుంది… టీవీ నటుడు, మొన్నటి బిగ్‌బాస్‌లో శివాజీ గ్యాంగుకు దీటైన సవాల్ విసిరి నిలబడిన అమరదీప్ భార్య ఆమె… నిఖిల్ టీవీ నటుడే, కావ్య అనే టీవీనటితో ఎక్కువగా పేరు వినిపిస్తూ ఉంటుంది…

రీతూ చౌదరి కూడా టీవీ నటే… యాంకర్ కూడా… సౌమ్యారావు కొన్నాళ్లు జబర్దస్త్ షోకు యాంకర్… ఎందుకో హఠాత్తుగా వదిలేసింది… అప్పుడప్పుడూ టీవీ షోలలో కనిపిస్తూ ఉంటుంది… సన వెటరన్ సినిమా నటి, అందరికీ తెలిసిన కేరక్టరే… యష్మి కూడా టీవీ నటే… ఓమ్ ఆదిత్య ఎప్పుడో ఫేడవుట్ నటుడు… యాదమరాజు, పవిత్ర జబర్దస్త్ కమెడియన్లు… ఇంద్రనీల్ టీవీ నటుడే… సో, అప్పుడప్పుడూ పండుగ స్పెషల్ షోలలో టీవీ కేరక్టర్లందరూ కలిసి ఒక్కచోట పర్‌ఫామ్ చేస్తుంటారుగా… సేమ్, అలాగే బిగ్‌బాస్ హౌజ్‌లో కొన్నాళ్లపాటు షో చేస్తారన్నమాట..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions