పెద్దగా ఆలోచించడానికి ఏమీలేదు… జగన్ పాలనలో అత్యంత దరిద్రమైన పాలసీ మద్యం., దారుణం… మద్యపానాన్ని నిరుత్సాహపరుస్తాను అనే పిచ్చి సాకుతో, వాగ్దానంతో… దిక్కూమొక్కూలేని అస్మదీయుల కంపెనీల రంగుసారాకు నానా దిక్కుమాలిన బ్రాండ్ల పేర్లు పెట్టి మార్కెట్‌లోకి వదిలాడు…
బ్రాండెడ్ క్వాలిటీ దొరకదు… రుచి మరిగిన నాలుక వదలదు… ఆ దరిద్రపు కొత్త రంగుసారాను తాగీతాగీ లక్షల మంది కాలేయాల్ని కోల్పోెయారు… రియాలిటీ… ఒడలు గగుర్పొడిచే అరాచకం… వర్తమాన రాజకీయాలు, అధికారాలు సమాజానికి ఎంత నష్టదాయకంగా మారుతున్నాయో తెలిపే పర్‌ఫెక్ట్ ఉదాహరణ…
అవినీతి, అక్రమాలకు అనేక రూపాలు… మన వ్యవస్థలోని క్రాస్ చెక్ రూపాలకు అర్థం కావు, ఐనాసరే, పట్టించుకోవు… ఐనాసరే, అంతటి ఢిల్లీ మద్యం స్కామ్‌కే దిక్కూమొక్కూ లేకుండా పోతోంది… ఆఫ్టరాల్ ఏపీ రంగుసారా అక్రమాలను, నష్టాలను ఎవడు పట్టించుకున్నాడు గనుక… విధి ఉసురు తగులుతుంది బాధ్యుడికి అనుకోవడమే గానీ … అదీ మన న్యాయవ్యవస్థలాంటిదే కదా… గుడ్డిది… ఐనా ఫిలిప్పీన్స్, ఉత్తర కొరియా పాలకుల్లాంటి వాళ్లే ఇలాంటి ప్రపంచ స్థాయి తిక్క నిర్ణయాలు తీసుకోగలరు…
Ads
చంద్రబాబు మళ్లీ మంచి బ్రాండ్లు తెస్తాం అని ఎలా చెప్పాడో ఏమిటో ఇక్కడ చర్చ అనవసరం గానీ… ఆంధ్రప్రదేశ్ కొత్త లిక్కర్ పాలసి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక విధానం… (ధ్రువపడని ప్రచారం)… అది ఇలా…
ఈ కొత్త లిక్కర్ పాలసీతో ఆదాయంలో గోవా, కేరళ, పాండిచ్చేరిని మించిపోయేలా ఉంది ఏపీ…
1. Whiskey
2. Brandy
3. Vodka
4. Beer
5. Rum
(Brandy)
1. Mansion house : 180ml (120/-)
360ml (230/-)
750ml (460/-)
(Whiskey)
1. Imperial blue : 120/-,230/-,460/-
2. McDowell no.1 140/-, 280/-,580/-
3. Sterling Reserve
B7 ( 140/-,280/-,580/-)
B10 ( 160/-, 310/-, 640/-)
4. Blenders Pride
200/-,400/-,800/-
5. Royal stag
140/-,280/-,580/-
(Vodka)
1. Magic moments :
Green Apple ( 150/-,300/-,600/-)
Orange
(160/-,340/-650/-)
Strawberry (luno)
(200/-,400/-,800/-)
2. Absolute vodka (220/-,480/-,920/-)
3. Smrin off (220/-,480/-,920/-)
4. Bacardi lemon (240/-,520/-,1020/-)
(Beer)
1. Kingfisher ultra strong (130/-)
2. Knockout ultra strong (120/-)
3. Khajaraho ultra strong ( 120/-)
4. Budweiser ultra strong ( 160/-)
NEW LIQUOR POLICY MANDATE IMPLIMENTED FROM OCTOBER 1ST 2024….
నిజానిజాలు ఇంకా నిర్ధారణ కావాలి… కానీ కాలేయం దెబ్బతిన్న ఏపీకి కొంత చికిత్స, రెమెడీ, రిలీఫ్, ఉపశమనం మాత్రం అవసరం… జగన్ మార్క్ మద్యఅరాచకానికి తను ఎక్కడో ఓచోట, ఏదో రీతిలో ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే… సాయంత్రం కాగానే ఓ 90 వేస్తారు జనం అని ఎక్కడో తనే చెప్పినట్టు గుర్తు…
పైన చెప్పిన రేట్లు గనుక నిజమైతే ఏపీ మందుబాబులకు పండుగే… ఏపీ జనానికి ఇక కిక్కే కిక్కు… పక్కదోవ పట్టిన డబ్బు కూడా ఖజానాకు రావడం ఖాయం… కానీ తెలంగాణలో చాలా ఎక్కువే ఉన్నాయి మద్యం రేట్లు… ఇక తెలంగాణ నుంచి మద్యాన్ని దొంగచాటుగా పట్టుకుపోవాల్సిన పనే లేదు… రేవంత్ రెడ్డికి వేలకువేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏపీ నుంచే ఇప్పుడు రివర్సులో తెలంగాణకు స్మగ్లింగ్ చేసుకోవచ్చు ఎంచక్కా…
ఇది చాలదట… తెలంగాణలో రేవంతుడు ఇంకా పెంచుతాడట… మరి పెంచాలి కదా… అడ్డమైన… సారీ, అడ్డగోలు హామీల భారం ఖజానాపై పడుతోంది కదా… ఆదాయం కావాలి… మరి తన గురువు చంద్రబాబు నడిచిన పంథాలోనైనా నడవాలి కదా… అబ్బే, గురువెవడు, శిష్యుడెవడు అంటాడు… జాగ్రత్త..!!
Share this Article