Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెంటాడే కథ… ఓ భర్త, ఓ భార్య… ఒకరికే బతికే చాన్స్… టైమ్ గడిచిపోతోంది…

October 21, 2024 by M S R

.

ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు.
ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది.
అందరూ లైఫ్ బోట్ లోకి వెళ్తున్నారు…..
ఆ లైఫ్ బోట్లో ఇక ఒక్కరికే స్థానం ఉంది,
జంట మాత్రమే ఇక ఓడలో మిగిలింది,
భార్య భర్త.. ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు.

ఇద్దరూ ఆలోచిస్తున్నారు,
ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేసాడు.
వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది.

Ads

తరగతిలో పిల్లలకి ఈ కధ చెప్తున్న ఉపాధ్యాయురాలు కధ చెప్పటం ఇక్కడ ఆపేసింది….

పిల్లలూ, ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లలని ప్రశ్నించింది, టీచర్…

పిల్లలు ఒకేసారి చెప్పారు, ఇంత మోసమా, నిన్ను గుడ్డిగా నమ్మాను, అని ఉండచ్చు టీచర్ అన్నారు.

ఒక బాబు మౌనంగా కూర్చుని ఉన్నాడు, టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేమి చెబుతావు అని.

ఆ బాబు చెప్పాడు, మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి, అని చెప్పి ఉంటుంది అన్నాడు.

టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం, నీకు ఈ కధ ముందే తెలుసా అని అడిగింది.

బాబు తల అడ్డంగా ఊపాడు, లేదు, నాకు ఈ కధ తెలీదు, మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది, మన బాబు జాగ్రత్త అని.. అన్నాడు.

ఈసారి టీచర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఈ కధలో భార్య కూడా ఇదే చెప్పింది, నీ సమాధానం సరయినది అని చెప్పింది టీచర్…. కధ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ, బాగా చదివించి, పెళ్ళి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఒక రోజు కన్ను మూసాడు.

తండ్రి వస్తువులని ఒకచోట చేర్చి పక్కన పెట్టేయాలి అని కూతురు తండ్రి వస్తువులు సర్దుతోంది.

తండ్రి డైరీ కనపడింది, అందులో రాసుకున్నాడు, భార్యకు చెప్పుకుంటున్నట్టు….

నీతోపాటే ఓడలో ఉండి మునిగిపోయి నీళ్ళ కిందే నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలి అనిపించింది, కానీ మనమ్మాయిని ఎవరు చూసుకుంటారు, నిన్ను బతికిద్దామనుకుంటే, నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్ లో ఉంది, ఎలాగూ నువ్వు మరణం అంచుల్లో ఉన్నావు…

మరి మనమ్మాయికి ఎవరు తోడు… అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీనపడిపోతానేమో అనిపించి లైఫ్ బోట్లోకి దూకేసాను. మనసులో ఎంత ఏడ్చానో నీకు తప్ప ఇంకెవరికి అర్ధం అవుతుంది.., అని డైరీలో భార్యకి చెప్పుకున్నాడు.

***************
పైపైన ఏదో చూసి ఎప్పుడూ ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు, ఎవరు ఏంటీ అని, మనకి తెలియని లోతులు చాలా ఉండచ్చు వారి జీవితాల్లో. ఎప్పుడూ తొందరపడి ఏ మనిషినీ నిందించకూడదు, అనుమానించకూడదు, అవమానించకూడదు……

ఇదీ ఓ పోస్టు… చాన్నాళ్లుగా వైరల్ అవుతోంది… కానీ ఒక ప్రశ్న… సమాధానం చెప్పండి… వాళ్లకు పిల్లల్లేరు… భార్యాభర్తల్లో ఎవరో ఒకరికే బతికే చాన్స్… భర్త, భార్య… ఏం డిసైడ్ చేసుకుంటారు..? జీవన పరిణామ క్రమం ఏం చెబుతుంది..? ఆ జంట ఏం నిర్ణయించింది..?!

రాంగోపాల్ వర్మ భాషలోకి వెళ్దాం… వీడు కాకపోతే మరొకడు అనుకుని భార్య తనను వదిలేస్తుందా..? బోలెడు మంది దొరుకుతారులే అని భర్త వదిలేస్తాడా..? మీరేమంటారు..? మనిషిని మించిన క్రూరజంతువు మరేమీ లేదు, పెళ్లాన్ని ముంచేస్తాడా..? నో, నో, మనిషి కారుణ్యజంతువు, తను మునిగిపోతాడా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంబుబాచీ మేళా… కామాఖ్య గుడి తలుపులు తెరుచుకున్నయ్…
  • నీడనూ నమ్మలేనితనం… క్షణక్షణమూ అభయం కాదు, ఆ భయమే..!!
  • రోదసి ప్రయాణికుడు శుభాంశు శుక్లా సరే… మరి ఈ ప్రశాంత్ నాయర్..?!
  • ఆంధ్రా ఆలోచనపరులూ చెబుతున్నారు… బనకచర్ల ఓ గుదిబండ అని..!!
  • ‘‘ఓ పనిచేయండి, మీ పాత బడికి వెళ్లి మీ టెన్త్ క్లాస్ రిజిష్టర్ అడిగి తీసుకొండి…’’
  • వద్దన్నా వరదలా డబ్బు..! సినిమాల్లో తప్ప ఇంకెక్కడా కుదరదు…!!
  • ఈ కోకిలకూ ఓ విషాద ప్రేమగాథ… ఆ రాజావారు తొక్కిపడేశారు…
  • వంటలే కదా, అదెంత పని… పెంట పెంట చేసేస్తారు ఈ జాతిరత్నాలు…
  • ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమే.., అప్పట్లో తప్పలేదుట, తప్పూ కాదుట…
  • రెండేళ్లలో డజను పెళ్లిళ్లు అట… ఆమె నిందితురాలా..? బాధితురాలా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions