Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పులిహోర ఆటలు ఎక్కువైపోయి… అసలు ఆట బభ్రాజమానం భజగోవిందం…

October 29, 2024 by M S R

వీడి దుంపతెగ…బిగ్‌బాస్ షో ఎవడూ చూడటం లేదనే నిజాన్ని గ్రహించి, హౌజులో లవ్ ట్రాకులు పెట్టడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు ఫాఫం…

హరితేజ, ప్రేరణలకు పెళ్లయింది… అవినాష్ అంతే… రోహిణి, టేస్టీ తేజల జోలికి వెళ్లే సాహసం ఎవరూ చేయరు… నబీల్ దూరం దూరమే… ఇక విష్ణుప్రియకు పృథ్వి కావాలి… పృథ్వికి నయని పవని కావాలి… యష్మికి నిఖిల్ కావాలి… నిఖిల్ ఎమోషన్‌లెస్, ఫాఫం సోనియా వెళ్లి పోయాక ఫీలింగ్‌లెస్ అయిపోయాడు, మొహంలో నవ్వే మరిచిపోయాడు… పృథ్వి దొరికింది చాన్స్ అనుకుని ఒకరికి తెలియకుండా ఇంకొకరికి పులిహోర కలుపుతున్నాడు…

గౌతమ్‌కు యష్మి కావాలి… కానీ యష్మి ఫోరా అనేసింది… దాంతో అక్కా అని పిలుస్తున్నాడు వ్యంగ్యంగా… మొత్తంగా ఎవరిని ఎవరితో లింక్ చేయాలో బిగ్‌బాసోడికీ తెలియక, పులిహోర బ్యాచులకూ తెలియక మొత్తం బభ్రాజమానం, భజగోవిందం అయిపోతోంది… అంతా ఆట, హౌజు వరకు మాత్రమే నటన అని అందరికీ తెలుసు… ఐనా జీవించేస్తున్నారు…

Ads

గౌతమ్‌ది మరీ వింత లవ్వు… ఐతే చెలి, లేదంటే చెల్లి… నీళ్లను కాపాడుకునే పానీపట్టు టాస్కులో యష్మి వర్సెస్ నిఖిల్ గొడవ… సో, యష్మికి నిఖిల్ మీద పెరిగే లవ్వు హఠాత్తుగా భగ్నం అయిపోయి ఉంటుంది… ఎన్నడూ లేనిది, కూల్‌గా దూకుడుగా ఆడే నిఖిల్ మొదటిసారి టెంపర్ కోల్పోయాడు… ఆట వదిలేసి హౌజులోకి విసురుగా వెళ్లిపోయాడు…

ఈసారి సీజన్ విజేత అని పదే పదే ప్రచారం చేయబడుతున్న, నాగార్జున ప్రియ కంటెస్టెంట్ విష్ణుప్రియ మళ్లీ ఈ టాస్కుల్లో పూర్ పర్‌ఫార్మర్… తనకు సాయం చేసినవాళ్లనే నామినేట్ చేసి విపరీతంగా నెగెటివిటీ మూటగట్టుకున్న ఆమె ఈ పూర్ పర్‌ఫార్మెన్స్‌తో మరింత డీలా పడిపోయినట్టే…

ఈ క్లాన్ల వారీ ఆట ఏమిటో బిగ్‌బాస్ టీమ్‌కే అర్థం గాక, అయోమయంలోకి జారిపోయి, చివరకు రెండు క్లాన్లను రద్దు చేసి పారేసి, ఇకపై ఎవరి ఆట వాళ్లదే అని ప్రకటించేశాడు… స్టిల్, ఈరోజుకూ హౌజు నుంచి త్వరగా వెళ్లిపోవాల్సిన మెంటల్ కేసులు పృథ్వి, గౌతమ్… కుదురుగా ఆటలో కనిపిస్తున్నది నిఖిల్, ప్రేరణ, నబీల్… మిగతా వాళ్లు సోసో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కైసే కహూఁ కుచ్ కెహనా సకూఁ … మహేంద్రన్ సినిమాల తీరే వేరు !!
  • అయ్యా, నేతాజీ మునిమనవడు గారూ..! ప్రభాస్ గ్లింప్స్‌లో తప్పేం లేదు..!!
  • అసలు నీకు బుద్దుందా వాసూరావ్..? సాయిపల్లవిపై ఈ కూతలేంటి..?
  • నీటికి Expiry Date ఉందో లేదో మీకు తెలుసా..?
  • కొమ్మూరి యుగంధర్ – అప్పట్లో పాఠకుల్ని ఉర్రూతలూగించిన పేరు !!
  • రేవంత్ ప్రయత్నాలకు ఫడ్నవీస్ పాజిటివ్- ఇక కిషన్ రెడ్డి ఏం చేస్తాడో ..!?
  • మొద రాత్రి! ఇది కేయాస్ నేరేటివ్… అంటే గందరగోళమే కథ ముడిసరుకు!!
  • నల జిలుకర మొగ్గ – కాలంతోపాటు మారితేనే ఏ కళకైనా మనుగడ !!
  • వడివేలు వంద కోట్ల భవనం.. కుటుంబం కోసమా? సంపదకు భద్రతా?!
  • గజబ్ రాత్ ! కథ గజబ్… కథనమే గజిబిజి… అనేక మలుపుల చిక్కుముడి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions