ఓ మిత్రుడు…. ‘సార్, చంద్రబాబు చాలా బెటర్ సార్, బాగా మారాడు, బీజేపీ మద్దతు కదా, గతంలో హిందుత్వ మీద అనురక్తి లేకపోయినా, ఏదో షో చేసేవాడు, ఇప్పుడు ముసలోడయ్యాడు కదా, దేవుడి దయ కోరుకుంటున్నాడు… అందుకే లడ్డూ పవిత్రత మీద ఈ పోరాటం, ఈ ఆరాటం అన్నాడు’… కొన్నాళ్ల ముందు…
ఫాఫం, చంద్రబాబును తక్కువ అంచనా వేశాడు అనుకున్నాను, జాలిపడ్డాను… ప్రపంచంలో ఎవరు మారినా చంద్రబాబు మారడు, నోరిప్పితే అబద్ధం, అడుగేస్తే అక్రమం… క్రెడిబులిటీ ఉండదు, మాట మీద నిలకడ ఉండదు… పొద్దున ఓ పంథా, రాత్రికి మరో పంథా… గంటల్లో యూటర్న్…
మతం లేదు, దేవుడు లేదు… మన్నూమశానం ఏమీ లేదు… అవసరమైతే, తిక్కలేస్తే తిరుమలను కూడా ప్రైవేటీకరించగలిగే తత్వం తనది… పేరుకు జగన్‌ను తిడతాడు… లడ్డూ, జంతుకొవ్వుల నెయ్యి, అవవిత్రం, డిక్లరేషన్ తొక్కాతోలూ అంటాడు… కానీ తనేమిటి..?
Ads
దేశంలోని స్వార్థపరుల్లోకెల్లా, అవకాశవాదుల్లోకెల్లా నంబర్ వన్… టీటీడీ ఛైర్మన్‌గా టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు అట… నవ్విపోతారు జనం… చంద్రబాబు మైక్ అతను… అదే అర్హత… అదేదో దిక్కుమాలిన హెయిర్ ఆయిల్ పేరిట అరచేతిలో వెంట్రుకలు మొలిపించిన అత్యద్భుత ఆధ్యాత్మిక వేత్త… (72 ఏళ్ల వయస్సు)…
మళ్లీ మాట్లాడితే… టీవీ5 భాషలోనే చెప్పాలంటే… పరమ ధార్మికవేత్త అట… ఈమధ్యే కదా తన కొడుకు మీద ఏవో విమర్శలు వచ్చాయి… ఐనా ఏముందిలే..? జగన్ టీటీడీ ఎయిర్‌బస్ పాలకమండలి, అధర్మారెడ్డి, అంతకుమించిన సుబ్బారెడ్డి, మరీ ముదురు భూమనలను మించి ఎన్నోరెట్లు దేశముదురు నాయుడు ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ అట…
తన సూపర్‌స్టార్ డిబేట్ ప్రజెంటర్లలో ఆ సాంబశివరావు పారిపోయాడు… మూర్తి ఉన్నాడు… గోగినేని తదితర నాస్తిక చక్రవర్తులకు రాయబారి… ఆ ఫిలిమ్ జర్నలిస్ట్ ఎవరో ఉన్నాడు… వేణుస్వామి వెంటపడ్డ బాపతు… మొత్తం ఆ టీవీ బ్యాచ్ అంతా చంద్రబాబు తరహా ఫుల్ క్రెడిబుల్ బాపతు…
అదే సమీకరణాలు… ఇందరు ఎమ్మెల్యేలు, ఇంతమంది కర్నాటక, ఇంతమంది తెలంగాణ… ఇదేం లెక్క చంద్రబాబూ… కాస్త ధర్మపరాయణులు ఒక్కరూ దొరకలేదా..? ఫాఫం, వెంకన్న మీద కక్షకట్టావా..? ఆఫ్టరాల్ అలిపిరినే గెలిచాను, ఇంకా నువ్వేం చేయగలవులే అంటూ దేవుడికి వెక్కిరింపా..?
మళ్లీ ఇందులో కులసమీకరణాలు… జనసేన కోటా, సొంత విధేయతలు… వీళ్లంతా రేప్పొద్దున తిరుమల లడ్డూలాగే ఆ దేవుడినీ ఉద్దరిస్తారు… ఎస్, చంద్రబాబు ఎప్పుడూ మారడు… ఏపీ ప్రజలు అమాయకులు… అలాగని నేనిక్కడ జగన్‌కు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు… తిరుమల విషయంలో జగన్ ఎప్పుడూ దోషే… దుష్టపాలనే… కానీ… చంద్రబాబు కూడా మినహాయింపు ఏమీ కాదు…
ఫాఫం తిరుమల వెంకన్న..!! చూస్తూ ఉండండి, తిరుమల లడ్డూ ఘుమఘుమలు, పవిత్ర కిరణాలు ప్రపంచవ్యాప్తం అవుతాయి..!! ఏపీ ప్రజలు… కాదు, కాదు… ఫాఫం బాలాజీ… తుచ్ఛ రాజకీయాల్లో బందీ అయిపోయి, దిక్కులు చూస్తున్నాడు…!! అవునూ, చంద్రబాబూ… నీ కులం, నీ మైక్ సరే… అశోకగజపతిరాజు వంటి నేతలు ఒక్కడూ కనిపించలేదా నీకు..? ఇక్కడ కూడా రోస్టర్ పాయింట్ ఎంపికలేనా..?!
చివరగా…. తిరుమల లడ్డూ మీద గాయిగత్తర చేశావు, దర్యాప్తు అన్నావు, ప్రత్యేక టీం అన్నావు… కొండను తవ్వలేదేం..? కనీసం ఎలుకనూ పట్టలేదేం..? మరీ చివరగా…. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (ఆస్తికుడో కాదో తెలియదు…) గానీ ఈనాడు కిరణ్‌ను గానీ ఎంపిక చేసుంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కావు…!!
Share this Article