.
వైల్డ్ ఫైర్ చల్ల బడింది… వాళ్లకు కావలసినంత (రావలసినంత) మూడు నాలుగు రోజుల్లో సంపాదించారు. సో… All is well..!!
పవిత్ర భారతదేశంలో పుట్టినందుకు ప్రేక్షక భక్తులు వారి వారి స్టార్ దేవుళ్ళకు, పూజ టికెట్ రేట్ ఎంతున్నా అర్చన చేయించాల్సిందే.
Ads
ఇష్టం ఉన్నా లేకున్నా ప్రభుత్వం ఒక ఆలయ కమిటీలా రేటు పెంచి వసూలు చేయిస్తుంది. మీడియా సోషల్ మీడియాలో పూజారులు ఎలాగూ భక్తులకు దేవుళ్ళకూ మధ్య అనుసంధానంగా మారి, అర్చన చేయించే వరకు, బలవంతంగా పుణ్యం తెప్పించే వరకు వదలరు.
మన భక్తి పారవశ్యం, వాళ్లకు వ్యాపారం. సినిమా ఎప్పుడైనా వ్యాపారమే. కాకపోతే ఇప్పుడు అది బడా కార్పొరేట్ గ్లోబల్ వ్యాపారం. అన్ని వందల కోట్లు పెట్టి అసలు ఎందుకు తియ్యాలి, మళ్ళీ భక్తుల ముక్కు పిండి ఎందుకు వసూలు చెయ్యాలి అన్న ప్రశ్నలు అస్సలు వద్దు!
ఎందుకంటే ఆ బడ్జెట్ లో సగ భాగం, అంటే ఒక వందో రెండొందల కోట్లో, మన అభిమాన స్టార్ దేవుళ్ళ జేబులలోకే చేరుతాయి. పైగా వాళ్ళ వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు. సో… మనకే బోలెడంత పుణ్యం.
తరవాతి భాగం కోసం మళ్ళీ ఇప్పట్నుంచే దాచుకోవడం మొదలెట్టాలి. వాళ్లకు ఈ రూపంలో మంచి బిజినెస్ మోడల్ దొరికింది. ఒకప్పుడు సినిమా అనేది రిక్షా తొక్కేవాడి నుంచి రిచ్ వాడి వరకు అందరికీ సమానంగా అందుబాటులో ఉండే ఒక సులువైన వినోద సాధనం.
ఇప్పుడు రోజులు మారి, ప్రత్యేక దర్శనం కావాలంటే… మన దేవుళ్ళు, పాలక మండలి అడిగినంత సమర్పించుకోవలసిందే. ఆర్జిత సేవలు.
ఇక ధర్మ దర్శనం కావాలంటే కొన్ని వారాలో, లేదా OTT లో వచ్చే దాకానో వెయిట్ చెయ్యాలి. తప్పదు. పుణ్యం ఎంత వేగంగా కావాలో అది మన చేతుల్లోనే, sorry… జేబుల్లోనే ఉంది.
మొన్నెప్పుడో ఎవరో అన్నారు.. “అంతంత పెట్టి క్రికెట్ మ్యాచ్ చూడట్లేదా!?” అని. అది లైవ్ గా స్టేడియంలో చూసే కొన్ని వేల మంది. మిగతా కోట్ల మంది అదే ఆటను ఇంట్లో టీవీఃలో చూస్తారు అతి తక్కువ ఖర్చుతో. నేను కూడా హామిల్టన్, చికాగో లాంటి థియేటర్ షోలు $100- 200 పెట్టి చూసాను. బ్రాడ్వే థియేటర్ కు, సినిమా థియేటర్ కు తేడా లేదూ!? ఆపిల్స్ ను ఆరంజ్ లను పోలిస్తే ఎలా? …… (– గోమఠం శ్రీకుమార్ )
వైల్డ్ ఫైర్ ఎలా చల్లబడిందో వివరాలు కావాలా..?
- తెలుగులో 43 కోట్ల నుంచి సోమవారం 14 కోట్లకు పడిపోయింది… మంగళవారం కూడా పూర్ రెస్పాన్స్…
- హిందీలో 85 కోట్ల నుంచి 46 కోట్లకు పడిపోయింది… కాకపోతే ఈ మార్కెటే కాస్త బెటర్ ఇప్పటికీ…
- తమిళంలో 9.5 కోట్ల నుంచి మరీ 3 కోట్లకు పడిపోయింది… ఇక్కడ వసూళ్ల కథ ముగిసినట్టే ఇక…
- కన్నడంలో మరీ ఘోరం, సోమవారం వసూళ్లు జస్ట్ 50 లక్షలు… కన్నడంలో సూపర్ ఫ్లాప్…
- బన్నీకి ఆదరణ ఉంటుందీ అనుకున్న మలయాళంలో కూడా సోమవారం జస్ట్ 60 లక్షలు… అయిపాయె…
- నైజాం, సీడెడ్ బెటరే… కానీ అడ్డగోలు రేట్లకు కొన్న ఏపీ బయ్యర్ల పరిస్థితి ఫుల్ టెన్షన్, బీపీ…
Share this Article