.
కంబం ప్రేరణ… ఎస్, ఒక ప్రేరణ… నీకు నచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఈసీజన్‌లో ఉంటే… డెఫినిట్‌గా ఇలాంటి కంటెస్టెంట్లకు ప్రేరణ…
తొమ్మిదేళ్లుగా పోరాడుతూనే ఉంది ఇండస్ట్రీలో ఓ బ్రేక్ కోసం… తనే చెప్పినట్టు, ప్రతిసారీ ప్రశంసలు వస్తాయి, కానీ తదుపరి ప్రాజెక్టు కోసం తన్లాటే… పోరాటమే…
Ads
రష్మిక మంధాన ఒకప్పుడు ఈమె రూమ్మేట్… కలిసి స్టూడియోలకు తిరిగేవారు… డెస్టినీ ఏమిటంటే..? ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్… నేషనల్ క్రష్… యానిమల్, పుష్ప-2 ఆమెను ఎక్కడికో తీసుకుపోయాయి…
మరి కంబం ప్రేరణ… ఎక్కడేసిన గొంగడి అక్కడే… తెలుగులో కృష్ణా ముకుందా మురారీ… పాపులర్… ఈలోపు పెళ్లయింది… ప్రేమికుడు శ్రీపాదతోనే… బిగ్‌బాస్‌కు వచ్చింది… అదే బిగ్‌బాస్ తన జర్నీ చూపించినప్పుడు చేసిన వ్యాఖ్యే… పసిపిల్లలాగే అడుగుపెట్టింది…
ఎస్, ఆమె ఎమోషన్స్‌ను దాచుకోదు… కృత్రిమత్వం తనను అలుముకోనివ్వదు… ఏడుస్తుంది, నవ్వుతుంది, చిరాకు పడుతుంది, ఉడుక్కుంటుంది, అప్పుడే ఆనందంతో ఎగురుతుంది… వాట్ నాట్..? ఓ మాట దురుసుగా వదిలినా… మెగా చీఫ్ పేరిట నియంతతనం కనబర్చినా… ఆమెలో ఓ పసితనమే తప్ప ఓ కుట్రపూరిత, దురుద్దేశపూరిత తత్వం కనిపించదు…
అందుకే విష్ణుప్రియలు, రోహిణిలు, యష్మిలు గట్రా వెళ్లిపోయినా… ఏ ఆట ఇచ్చినా మొండిగా పట్టుదలగా ఆడే ఓ కసి ప్రేరణే నిలబడింది… ఆమె టాప్ ఫైవ్‌లో ఉంది… చివరకు నాలుగో స్థానమా, మూడో స్థానమా జానేదేవ్… ఇక్కడివరకూ వచ్చామా లేదా… అంతే…
ఒక నిఖిల్ రియల్లీ ఓ ఫైటర్… మొదటి నుంచీ… కానీ తనమీద కన్నడ అనీ, ఆడ కంటెస్టెంట్లను ఆటకు వాడుకున్నాడనీ ఓ సెక్షన్ విపరీతంగా క్యాంపెయిన్ చేసింది… చివరకు ఓ మెంటల్ కేసు గౌతమ్‌ను తెలుగు పేరిట మోసింది… బహుశా తనే విజేత అవుతాడేమో… అఫ్‌కోర్స్, ది బ్యాడ్ పల్లవి ప్రశాంతే గెలిచాడు, గౌతమ్ గెలిస్తే ఎంత..? ఓడితే ఎంత..?
ఆఫ్టరాల్ ఇదొక గేమ్ అనీ… ఇక్కడ ప్రాంత, కుల, భాషాభేదాలు వద్దనీ, ఆటను ఆటగా చూడాలనే సోయి ఎవరికీ లేదు… బట్ స్థూలంగా చూస్తే… వెళ్లిపోయినా సరే ఒక రోహిణి విన్నర్… ఇప్పుడు హౌజులో నిలబడిన ప్రేరణ విన్నర్…
తన జర్నీ చూపిస్తూ తనను అభినందిస్తుంటే… అందరిలాగా ఎగిరెగిరి గెంతులేస్తూ పొంగిపోలేదు ప్రేరణ… కన్నీళ్లు పెట్టుకుంది సంతోషంతో… వద్దు బిగ్‌బాస్, నన్నింకా ఏడిపించకండి అంటోంది… ఆమెలో ఇంకా మిగిలిన ప్యూర్‌నెస్ అది… ఓ ఎమోషన్… కదిలిపోయింది తను…
నిజానికి మరో విన్నర్ అవినాష్…
జనం మరీ తనను ఐదో స్థానంలో ఎందుకు ఉంచారో తెలియదు గానీ… ఈసారి సీజన్‌కు కాస్తో కూస్తో రేటింగ్స్ వచ్చి, జనం కొద్దిమందైనా చూశారంటే… ఈ అట్టర్ ఫ్లాప్ షోలో ఏమైనా కాస్త జీవం కనిపించిందీ అంటే అవినాష్ కారణం… సెకండ్ రోహిణి…
బట్, వాళ్లు గెలవరు… మన పిచ్చి జనానికి ఆవేశం, దూకుడు, పిచ్చి కూతలు, ఆడవాళ్లను అవమానించే కేరక్టర్లు కావాలి… అందుకే… ఈసారి బిగ్‌బాస్ అసలు విన్నర్ ప్రేరణ… ట్రోఫీ ఎవడు ఎత్తుకుంటేనేం..!!
Share this Article