.
తిరుమలలో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ మీడియాతో మాట్లాడాడు… ఏమంటున్నాడు అనేది తరువాత… తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కొండ దిగేలోపు కేసు పెడతామని ఆమధ్య టీటీడీ పాలకమండలి చెప్పినట్టు గుర్తు…
ఐనా, అక్కడ ఇంకా మీడియా గొట్టాలు ఎందుకు కొనసాగుతున్నట్టు..? శ్రీనివాస గౌడ్ ఎంత జాగ్రత్తగా మాట్లాడినా అవి వివాదాస్పద వ్యాఖ్యలే…
Ads
చైర్మన్ బీఆర్ నాయుడు వరుసగా హరీష్, శ్రీనివాసయాదవ్ తదితర బీఆర్ఎస్ మాజీ మంత్రులను కూడా కలిసి ఆశీస్సులు పొందాడు కాబట్టి ఈ మాజీ మంత్రికి కూడా సడలింపులు, మినహాయింపులు ఉండవచ్చునేమో… (ఈ శ్రీనివాస గౌడ్ ఆశీస్సులు పొందాడో లేదో తెలియదు)…
‘‘తెలంగాణకు ఏపీకి ఉన్న ఏకైక సంబంధం కేవలం తిరుపతి… (తెలంగాణలో ఉన్న లక్షలాది మంది సెటిలర్లు రెండు రాష్ట్రాల నడుమ సంధానం, సంబంధం కాదా..? )
తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలి… (ఇదేం సూత్రీకరణ..? ఇదేం కర్తవ్యబోధన..?)
గతంలో చంద్రబాబు, జగన్ ఉన్నప్పుడు దర్శనాలు బాగానే జరిగాయి… కానీ ఇప్పుడు డిఫరెంటుగా కనిపిస్తున్నాయి… (ఇప్పుడు ఉన్న సీఎం కూడా చంద్రబాబు నాయుడే…)
తిరుపతి దేవుడు అంటే ప్రపంచానికే దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రాన మాది అని దేవుని విషయంలో అనుకోవద్దు, అలా అనుకుంటే ఆ దేవునికి కూడా కోపం వస్తుంది…
గత 10 సంవత్సరాలలో హైదరాబాద్ లో కానీ, తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కానీ వ్యాపారస్తులను కానీ భేదాభిప్రాయాలు లేకుండా చూడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఆంధ్రా వ్యాపారస్తులే లాభపడ్డారు…
(గుడ్, గుడ్, తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆంధ్రా వ్యాపారులే బాగుపడ్డారనే నేరాంగీకార ప్రకటన బాగుంది… కానీ ఇన్నాళ్లూ బాగున్నాం మీతో కాబట్టి అలుసైపోయామా అని ధ్వనిస్తోంది…)
తెలంగాణలో టీటీడీకి కళ్యాణ మండపాల కొరకు స్థలాలిచ్చాం, ఇస్తున్నాం, కానీ రూమ్స్, దర్శనాలకు ఇబ్బందులు పడుతున్నాం… కొండ మీద కాటేజ్ నిర్మాణానికి తమిళనాడు, కర్నాటకలకు ఇచ్చినట్టే తెలంగాణకు స్థలం ఇవ్వాలి…
( అయ్యా, కరెక్టు… ఏపీలో ఉంది కాబట్టి ఏపీ దేవుడు అనుకోవడం సరికాదు, కానీ కొండ మీద రాజకీయ పెత్తనం ఏపీ ప్రభుత్వానిదే… తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆంధ్రా వ్యాపారులే బాగుపడ్డారు, మేం ఎవరి పట్లా వివక్ష చూపలేదు అనే వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వానికి, ఆంధ్రా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు సారూ…
తెలంగాణ సిఫార్సులకే ఇబ్బంది తప్ప మామూలు భక్తులకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అదే ప్రయాస… తెలంగాణ మాత్రమే కాదు, కర్నాటక, తమిళనాడు, కేరళ సిఫార్సులనూ ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు… వాళ్ల ప్రభుత్వం వాళ్లిష్టం, వాళ్లు మారరు… దేవుడికి కోపం వస్తుందని వాళ్లకు మాత్రం తెలియదా..? ఐనాసరే అంటారు వాళ్లు… భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ గుళ్లల్లో ఏపీ సిఫార్సులను లైట్ తీసుకొండి… వాళ్లేమైనా అడ్డుచెప్పారా..?)
Share this Article