Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాల్కనైజేషన్..! అంటే పెద్ద దేశాల్ని ముక్కలుచెక్కలు చేయడం…!!

December 24, 2024 by M S R

.

.   (పొట్లూరి పార్థసారథి ) ..          … బాల్కనైజేషన్ – పార్ట్ 1

బాల్కనైజేషన్ అఫ్ సిరియా, బాల్కనైజేషన్ అఫ్ టర్కీ, బాల్కనైజేషన్ అఫ్ సోవియట్ యూనియన్ , బాల్కనైజేషన్ అఫ్ ఇండియా, బాల్కనైజేషన్ బర్మా, బాల్కనైజేషన్ అఫ్ చైనా, బాల్కనైజేషన్ అఫ్ పాకిస్తాన్.

Ads

భారత్ తేరే తుకడే తుకడే కరెంగే.. భారత్ ని ముక్కలు ముక్కలు చేస్తాం…

ఇదేమి కోపంతోనో, చేతకానితనంతోనో చేస్తున్న నినాదాలు కావు. దీని వెనుక పెద్ద అజెండా ఉంది. అది ఇప్పటికిప్పుడు అమలు కాకపోవచ్చు! కానీ ముందస్తుగా ఒక నినాదాన్ని వెలుగులోకి తెస్తారు! అవకాశాన్ని బట్టి ఒక పదేళ్లకో లేదా 20 ఏళ్ళకో అది కాకపొతే 30 ఏళ్ళకో అమలవుతుంది!

ముందు బాల్కనైజేషన్ అంటే ఏమిటో తెలిస్తే పైన పేర్కొన్న దేశాలలో బాల్కనైజేషన్ అనేది ఎలా అమలవుతుంది అన్నది అర్ధమవుతుంది!

యుగొస్లావయ – Yugoslavia!

బాల్కన్ దేశంగా పిలవబడ్డ యుగొస్లావయ ఒకప్పుడు ఓట్టోమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.

బాల్కన్ అనేది ఫార్శి పదం అయిన బాల్కనే నుండి వచ్చింది. కానీ తుర్కి (Turkish ) పదంగా చెలామణిలో ఉంది . బాల్కన్ అంటే ఎత్తయిన పర్వతం అని అర్ధం. బాల్కన్ పర్వతాలు చుట్టూ ఉన్న ప్రాంతాలని బాల్కన్ రీజియన్ అని పిలిచేవారు. యుగొస్లోవయాని బాల్కన్ దేశం అని పిలిచేవారు.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఓట్టొమాన్ సామ్రాజ్య పతనం తరువాత యుగొస్లావయ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

రెండవ ప్రపంచ యుద్ధం సందర్బంగా యువోస్లావయ జర్మన్ల అధీనంలోకి వెళ్ళిపోయింది.

జాసిప్ బ్రోజ్ టిటో ( Josip Broz Tito )!

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జోసిప్ బ్రోజ్ టిటో తన సైన్యంతో జెర్మన్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కున్నాడు యూరోపులో!

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1945 నుండి 1963 వరకూ యుగొస్లోవయ ప్రధాన మంత్రిగా పని చేశాడు. 1963 నుండి 1980 వరకూ అంటే టిటో చనిపోయేవరకు అధ్యక్షుడిగా పనిచేసాడు!

యుగోస్లావయ మన దేశంలాగానే భిన్నమైన జాతులు, భాషలు, సంస్కృతులతో కూడి ఉండేది.

జోసిప్ బ్రోజ్ టిటో తన జాతీయవాదంతో దేశ ప్రజలందరిని ఒక్క తాటిపై పాలించాడు.

1980 లో టిటో మరణించిన తరువాత యుగొస్లోవయ దేశం ముక్కలు చెక్కలయింది!

టిటో ఉన్నంత వరకూ అందరూ కలిసిమెలసి ఉన్న వాళ్ళు కాస్తా టిటోలాంటి జాతీయవాద నాయకుడు ఎవరూ లేకపోవడం వలన జాతుల మధ్య వైరం ప్రబలి దేశం ముక్కలయ్యింది!

ప్రస్తుతం బాల్కన్ కంట్రీస్ గా పిలవబడుతున్న దేశాలు 1980 వరకూ యుగొస్లావయగా పిలవబడ్డ దేశంలోనివే!

1. స్లోవేనియా ( Slovenia )

2.క్రోయేషియా ( Croatia )

3.బోస్నియా మరియు హెర్జెగోవినా ( Bosnia and Herzegovina )

4.మంటేనేగ్రో ( Montenegro )

5.సెర్బియా ( Serbia )

6. కోసావో ( Kosovo )

7.అల్బేనియా ( Albania )

8. నార్త్ మెసేడోనియా (North Macedonia )

9.గ్రీస్ ( Greece )

10. బల్గేరియా ( Bulgaria )

*********

1981 లో ఎవరికి వారు తమకి స్వంతంత్ర దేశం కావాలని పట్టుపట్టడంతో మొదలైన చిన్న చిన్న ఉద్యమాలు చివరికి భీకర యుద్ధాల తరువాత చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది యుగొస్లావయ.

కొన్ని గ్రూపులకి అమెరికా, జెర్మనీ ఆయుధాలు అందిస్తే కొన్ని గ్రూపులకి సోవియట్ యూనియన్, చైనాలు ఆయుధాలు ఇచ్చాయి.

అక్కడ కమ్యూనిజం ఉండకూడదు అని అమెరికా కుట్రలు పన్నింది.అమెరికన్ డీప్ స్టేట్ ప్రభావంతో అక్కడి జాతుల మధ్య జరిగిన యుద్దాల మీద తప్పుడు వార్తలు ప్రచురించింది ప్రింట్ మీడియా!

నిజంగా జాతుల మధ్య పోరాటమేనా?

ఒకసారి యుగొస్లావయని పరిశీలిస్తే అక్కడ మూడు మతాలు ఉన్నాయి. ఆర్ధడాక్స్ క్రైస్తవులు ( సోవియట్ యూనియన్ తరువాత రష్యాలో ఇప్పటికి ఆర్ధడాక్స్ క్రైస్తవం పాటిస్తారు ప్రజలు ), కాథలిక్ క్రైస్తవం, ఇస్లాం మతాలు ఉన్నాయి.

ఒక్క రొమేనియాలో మాత్రమే జిప్సీ ప్రజలు ఎక్కువగా ఉన్నారు, వీళ్ళు దేశ దిమ్మరురులు కానీ 10 వ శతాబ్దంలో భారత్ నుండి యూరోపుకి వలస వెళ్లిన హిందువులు. కొందరి జిప్సీలు ఇప్పటికి హైందవాన్ని పాటిస్తున్నారు అక్కడ. కానీ జిప్సీలని యూరోపు ఇప్పటికి స్వీకరించలేదు.

సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం ప్రస్థావించాల్సిన అవసరం ఉంది. ప్రతి నాలుగేళ్ళకి ఒకసారి మహారాష్ట్రలోని నాగపూర్ దగ్గర ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుండి జీప్సీలు వచ్చి అయిదు రోజుల పాటు సమావేశం అవుతారు! జీప్సీ ఫెస్టివల్ పేరుతో ప్రతీ సంవత్సరం స్లోవేకీయలోని బ్రటిస్లావా ( Bratislava ) లో పండుగ చేసుకుంటారు. మన దేశం నుండి కూడా ప్రతినిధులు వెళతారు.

So! ఘర్షణ పడడానికి మతం కారణం కాదు. అక్కడ చిచ్చుపెట్టడానికి పనికి వచ్చింది భాష, సంస్కృతి!

టిటో బ్రతికి ఉన్నంత కాలం ఎవరి కుట్రలు, వ్యూహాలు పనిచేయలేదు. టిటో మరణం తరువాత 10 ఏళ్ళకి ఆ దేశం పూర్తిగా ముక్కలు చెక్కలు అయిపొయింది!

ఎవరికి లాభం?

టిటో మరణించే వరకూ యుగోస్లావయ 6.7% వృద్ధి రేటుతో యూరోపులో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం గా ఉండేది .జెర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సరసన ఉండేది.

కానీ యుగొస్లోవయ కమ్యూనిస్ట్ దేశం. టిటో చిన్నతనంలో అస్ట్రీయ – హంగరి దేశ సైన్యంలో సార్జెంట్ మేజర్ గా పనిచేసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో సోవియట్ సైన్యానికి చిక్కి మాస్కోకి తరలించబడి, అక్కడ కమ్యూనిజంకి ఆకర్షంచబడి, తరువాత యువోస్లోవయ చేరుకొని 1918 లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యుగోస్లొవయలో చేరాడు. 1980 లో మరణించే వరకూ తన కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి కట్టుబడి పాలన చేశాడు.
యూరోపులో కమ్యూనిస్ట్ దేశం 6.7% వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతూ పొతే ఎలా!

ముక్కలు చెక్కలు చేశారు!

ఒక దేశం 10 దేశాలుగా విభజించబడితే బ్యాంకింగ్, మిలిటరీలు విడిగా కావాలి. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది రోత్స్చైల్డ్ కుటుంబం చేతిలో ఉంది ప్రపంచవ్యాప్తంగా! మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ ల ద్వారా లాభపడేది వీళ్ళే! మన డబ్బులు బాంకులో దాచుకుంటే కూడా సేవలు అందిస్తున్నందుకు మన దగ్గర ఫీజు రూపంలో వసూలు చేసే విధానం మొదలు పెట్టింది వీళ్ళే!

అప్పు కావాలి అంటే శిబిల్ స్కోర్ ఉండాలి. శిబిల్ స్కోర్ కావాలి అంటే ముందు అప్పు చేసి సక్రమంగా వడ్డీ కట్టి మంచి మార్కులు తెచ్చుకోవాలి!

నువ్వు అసలు అప్పు చేయకపోతే సిబిల్ స్కోర్ ఉండదు కాబట్టి అప్పు ఇవ్వరు!

ఇక అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ కూడా లాభపడుతుంది. ఒక్కో దేశానికి వేరు వేరుగా ఆయుధాలు కావాలి అవి అమెరికా అమ్ముతుంది!

ఇవన్నీ కాక సోవియట్, చైనా ఆయుధాల సామర్ధ్యం ఎలాంటిదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ప్రతీ 20 ఏళ్ళకి ఒకసారి ఆయుధాల జెనరేషన్ మారుతూ ఉంటుంది. పరీక్షించాలి అంటే రియల్ టైం రియల్ టార్గెట్ కావాలి.

నాటో దళాలు యుగోస్లొవయ మీద దాడులు చేశాయి. ముఖ్యంగా సెర్భియా మీద!

US AIR FORCE F – 117 NIGHTHAWK!

F – 117 నైట్ హాక్ అనేది అమెరికన్ స్టెల్త్ బాంబార్! F-117 కి కాల్ సైన్ వేగా 31. కాల్ సైన్ అంటే F117 పైలట్ కంట్రోల్ కమాండ్ సెంటర్ తో మాట్లాడేటప్పుడు వేగా 31 అని చెప్తాడు కానీ F 117 అని చెప్పడు.

మార్చి 27, 1999 రోజున సెర్బీయా రాజధాని బెల్గ్రేడ్ కి సమీపంలో బాంబింగ్ చేయడానికి వచ్చిన F 117 నైట్ హాక్ స్టెల్త్ బాంబర్ ని సెర్బీయన్ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసింది!

అప్పట్లో సెర్బీయా దగ్గర సోవియట్ తయారీ అయిన S-125 నెవ (Neva ) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అది 1961 లో తయారైనది. అత్యంత ఆధునికమైన స్టెల్త్ బాంబర్ ని ఎలా కూల్చగలిగింది అనేది ఇప్పటివరకు అసలు నిజం ఏమిటో బయటికి రాలేదు.

2008 వరకూ అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ పరిశోధనలు చేసి చివరికి F 117 నైట్ హాక్ ని సర్వీస్ నుండి తొలగించింది!

విచిత్రం ఏమిటంటే సోవియట్ S-125 ఎయిర్ డిఫెన్స్ అనేది మొదటి జెనరేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ అమెరికా దాడులలో దాని రాడార్ దెబ్బతింటే చైనా రాడార్ ని మార్పులు చేసి S-125 తో అనుసంధానం చేశారు సెర్బీయన్లు. అంటే S-125 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో అనుసంధానం చేసిన రాడార్ ఒరిజినల్ కాదు!

యుగొస్లావయ విషయంలో అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ చాలా విలువైన విషయాలు నేర్చుకుంది!

డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో చూడండి!

1981 నుండి మొదలయ్యి 1991 కి వచ్చే సరికి యుగొస్లావయ దేశం ముక్కలు చెక్కలయింది యూరోపులో! 1991 లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయిపోయింది!

యుగొస్లావయ ఆర్ధికంగా, సైనికపరంగా బలంగా ఉంది కాబట్టి భాష, సంస్కృతి అనేవి ట్రిగ్గర్ పాయింట్లుగా పనిచేసాయి.

అదే సోవియట్ యూనియన్ కి వచ్చే సరికి ఆర్ధికంగా బలహీన పడడం, మతం ట్రిగ్గర్ పాయింట్స్ అయ్యాయి. ఉబ్జెకిస్థాన్, తజకిస్థాన్, ఖజకిస్థాన్ రిపబ్లిక్కులు ముస్లిం మెజారిటీ ప్రాంతాలు అప్పటి సోవియట్ యూనియన్ లో!

బాల్కనైజేషన్ అనే పదం ఒక దేశాన్ని ముక్కలు చేయడానికి పర్యాయపదంగా వాడతారు!

మన దేశం యుగొస్లావయకి భిన్నంగా ఉందా?

బాల్కనైజేషన్ బర్మా
బాల్కనైజేషన్ సిరియా మోదలయ్యింది ఇప్పటికే!

Contnd.. Part 2

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • అప్పట్లో జోసెఫ్ విజయ్ మహా సిగ్గరి… చిన్న కళ్లు, బక్కగా, నల్లగా… కానీ..?
  • బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!
  • తుమ్మిడిహెట్టి… రేవంత్ సీరియస్ టోన్… ఫడ్నవీస్ వింటున్నావా..?
  • తెలంగాణపైకి వలసవాదం ముంచుకొస్తోంది అనడమే పెద్ద వంచకభాష..!
  • The Scape Goat… అదే ఆ పాత కథే… అనేక భాషలు… వందల సినిమాలు…
  • షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?
  • blood money … క్లౌడ్ ఫండింగ్‌తో ఒక ప్రాణం నిలబడింది …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions