Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్లాక్ బస్టర్..! అన్నీ తానై దాసరి అక్కినేనికి చేసిన కనకాభిషేకం..!

January 31, 2025 by M S R

.
Subramanyam Dogiparthi ……… రికార్డుల సునామీ . డబ్బుల వర్షం . ఎయన్నార్- దాసరి కాంబినేషన్లో 1981 ఫిబ్రవరిలో వచ్చిన ఈ ప్రేమాభిషేకం తెలుగు సినిమా రంగంలో ఓ చరిత్ర సృష్టించింది .

దేవదాసు , ప్రేమనగర్ , దసరా బుల్లోడు సినిమాల్లాగా ఒక ఊపు ఊపేసిన సినిమా . ఈ కధను నేసిన దాసరిని ముందుగా మెచ్చుకోవాలి . దేవదాసు నుండి చంద్రముఖిని పట్టుకొచ్చాడు . దేవదాసు , ప్రేమనగర్ సినిమాల నుండి హీరోని తెచ్చాడు . వెరశి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ని ఎయన్నార్ , అన్నపూర్ణ స్టూడియోలకు అందించాడు .

ఈ సినిమా సూపర్ సక్సెసుకి మరో ప్రధాన కారణం చక్రవర్తి సంగీతం , దాసరి పాటలు . పాటలన్నీ ఈరోజుకీ సూపరే సూపర్ . ఈ సినిమాలో పాటలన్నీ దాసరి పేరిటే ఉండటం విశేషం . పాటలు , మాటలు , కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం అన్నీ ఆయనే . ఇంత గొప్ప మల్టీ టాస్కర్ తెలుగు సినిమా రంగంలో మరొకరు లేరనే చెప్పవచ్చు .

Ads

57/58 సంవత్సరాల వయసులో కూడా ఎయన్నార్ తన డాన్సులు , స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు . హేట్సాఫ్ . జనం ప్రేమనగర్ని గుర్తుకు తెచ్చుకున్నారు . తనకు కేన్సర్ అని ప్రియురాలికి తెలియకుండా ఉండాలని , తన మీద విసుగు , విరక్తి కలిగి మరొకరిని వివాహం చేసుకునేలా చేయాలనే ప్రక్రియలో ఎయన్నార్ నటన అద్భుతం .

ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే అనుకోండి . ఈ సినిమాలో ప్రేక్షకులు మరువలేనిది జయసుధ పాత్ర . దేవదాసులో పార్వతిని , దేవదాసులను గుర్తుంచుకునే ప్రతీ ఒక్కరు చంద్రముఖిని గుర్తుంచుకోవలసిందే . అలాగే ఈ సినిమాలో జయసుధ పాత్ర . తినేసింది . ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతుంది .

శ్రీదేవి- జయసుధల మధ్య డైలాగుల యుధ్ధాన్ని దాసరి చాలా గొప్పగా పండించారు . శ్రీదేవి ఉక్రోశం , జయసుధ సంయమనం దర్శకుడు ఎఫెక్టివుగా చూపారు . జయసుధ పాత్ర హీరోయిన్ పాత్రకన్నా తక్కువ నిడివే . అయినా ప్రేక్షకుల మనసును తట్టే పాత్ర జయసుధదే .

పాటల్లో మా కోటప్పకొండని కూడా పెట్టారు దాసరి . కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా పాటలో శ్రీదేవి ఉక్రోశం చూడాల్సిందే . నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని , ఒక దేవుని గుడిలో ఒక దేవత , దేవీ మౌనమా శ్రీదేవీ , తారలు దిగి వచ్చిన వేళ పాటలు రికార్డులను బద్దలు కొట్టాయి . ఎంతగా అంటే గోల్డెన్ డిస్క్ దాకా .

ఒక దేవుని గుడిలో పాటలో ఐసు గడ్డలు భలే గమ్మత్తుగా అనిపించేది అప్పట్లో . అప్పుడప్పుడు దాసరి , రాఘవేంద్రరావులు ఒకేలా ఆలోచిస్తూ ఉంటారేమో అని అనిపిస్తుంది .

మరో రెండు గొప్ప పాటలు ఉన్నాయి . ఒకటి ఆగదూ ఆగదు ఏ నిమిషము నీకోసము ఆగితే సాగదు ఈలోకమూ . దాసరి మార్క్ drama-filled lyrics . గొప్ప వేదాంతాన్ని చొప్పించాడు దాసరి ఈ పాటలో . నిజమే కదా ! ఎవరి కోసం ఆగుతుందీ లోకం . తొక్కేసుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది . మరో పాట వందనం అభివందనం నీ అందమే ఒక నందనం . ఎయన్నార్ నటన సూపర్బ్ .

బాలసుబ్రమణ్యానికి ఉత్తమ నేపధ్య గాయకునిగా , జయసుధకు ఉత్తమ నటిగా నంది అవార్డులు వచ్చాయి . తెలుగులో ఇంత సునామీ సృష్టించిన ఈ సినిమా ఇతర భాషల్లో ఇంత గొప్పగా ఆడలేదు . తమిళంలో కమల్ హసనుతో రీమేక్ చేసారు . మళయాళంలోకి డబ్ చేసారు . హిందీలో దాసరే జితేంద్ర , రేఖ , రీనారాయ్‌లతో నిర్మించారు.

ఎయన్నార్ , శ్రీదేవి , జయసుధలతో పాటు మోహన్ బాబు , మురళీమోహన్ , గుమ్మడి , ప్రభాకరరెడ్డి , మాడా , కవిత ప్రభృతులు నటించారు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . మాతరంలో చూడనివారు ఉండే ప్రసక్తే లేదు . ఇప్పటి తరంలో ఒకరూ అరా ఉంటే వెంటనే చూసేయండి . చూసినవారు కూడా చూడొచ్చు . ఎన్నిసార్లయినా చూడొచ్చు .

ఆరోజుల్లోనే థియేటర్లలోనే నేను ఓ అయిదారు సార్లు చూసి ఉంటానేమో . టివిలో అయితే లెక్కే లేదు . A great entertaining , action-filled , emotional , sentimental movie . మసాలా క్లాసిక్ . మసాలా కళాఖండం . Hats off to Dasari , ANR , Chakravarthy , Jayasudha . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎన్టీయార్ విగ్రహం..! బీఆర్ఎస్ పెడితే గొప్పట..! రేవంత్ పెడితే తప్పట..!!
  • ఇరకాటంలో పాకిస్థాన్..! అసలు ఏమిటీ ఈ అబ్రహాం ఒప్పందాలు..?
  • ఆ ఎడారుల్లో కొత్త చమురు నిక్షేపాలు… ఇండియాకు ఇంధన వరం…
  • మన వ్యవస్థల డొల్లతనాన్ని బరిబాతల చూపించే ఓ వాస్తవ కథనం..!
  • అన్నీ అనుకున్నట్టు జరిగితే… నిజమైన ‘మహిళా సాధికారత’… రేవంత్‌కు బలం…
  • చోటా భీమ్ ఒంటి చేత్తో ‘హైదరాబాద్‌’ను ఎలిమినేట్ చేశాడు…
  • తుపాకీ పడితే ‘రికార్డే’… భేష్, హైదరాబాదీ సంచలనం ఈషా సింగ్..!
  • అసలు వంశీ సినిమాలో మోహన్‌బాబు ఎలా ఫిట్టయ్యాడనేదే ప్రశ్న..!
  • True Pilot … ఆకాశం నుంచి కూలిపోతున్నప్పుడు కూడా… అదే నిబ్బరం…
  • బహుముఖ ప్రజ్ఞ… తేజస్వినీ మనోజ్ఞ…! వావ్, మన తెలుగు తేజం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions