.
Ashok Kumar Vemulapalli……… ఈ సె – సైకోని ఏమి చేయాలి ? మస్తాన్ సాయి అరాచకం ఇది…
ఆడపిల్లల తల్లిదండ్రులు గజగజా వణికిపోయే ఘటన ఇది .. ఒక్కడు … ఒకే ఒక్కడు .. వందలమంది అమ్మాయిలను చెరబట్టాడు .. ప్రేమ పేరుతో కొంతమందిని , డ్రగ్స్ కి అడిక్ట్ చేసి మరి కొంతమందిని డబ్బుల ఆశచూపి ఇంకొంతమందిని లోబర్చుకున్నాడు ..
Ads
నమ్మి వచ్చిన అమ్మాయిలతో సె- చేస్తూ బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరాతో షూట్ చేశాడు .. ఇంకొంతమంది అమ్మాయిలను వీడియో కాల్స్ చేసి నగ్న వీడియోలు రికార్డ్ చేసి, అన్ని వీడియోలు హార్డ్ డిస్క్ లో సేవ్ చేశాడు ..
ఒక్కరు కాదు ఇద్దరు కాదు .. వందలాది అమ్మాయిలు .. ఎలా ట్రాప్ చేస్తాడో తెలీదు ..ఆ అమ్మాయిలు ఎలా లొంగుతారో తెలీదు .. వాళ్ళని సె- కి ఎలా ఒప్పిస్తాడో తెలీదు .. రికార్డ్ చేసిన వీడియోలు చూపించి ఆ అమ్మాయిలను వేధిస్తాడు.. అవసరమైతే ఆ వీడియోలు బ్లూ సైట్స్ కి అమ్మేస్తాడు .. ఇదంతా మస్తాన్ సాయి సైకోయిజానికి ఉదాహరణ మాత్రమే ..
గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి .. గతంలో .. హీరో రాజ్ తరుణ్ , లావణ్య వ్యవహారంలో తెరమీదికి వచ్చాడు ..అంతకుముందు వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్లో డ్రగ్స్ అమ్మిన కేసులో అరెస్ట్ అయ్యాడు .. ఆ తర్వాత గుంటూరు సుభాని హోటల్ యజమాని కొడుకులకు డ్రగ్స్ అమ్ముతూ మరోసారి అరెస్ట్ అయ్యాడు ..
అంతకుముందు లావణ్య పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు .. అయినా మారలేదు .. ఇలా జైలుకి వెళ్లి అలా బయటకు వచ్చేస్తాడు .. అసలు ఇలాంటి ఉన్మాదులకి బెయిల్ ఎలా దొరుకుతుందో అర్ధం కాదు ..
తాజాగా మరోసారి నార్సింగి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు .. అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేసి పోలీసులకి దొరికిపోయాడు.. నిజానికి ఆ హార్డ్ డిస్క్ లో తన వీడియోలు డిలీట్ చేయడానికి లావణ్య అతని నుంచి ఆ గార్డ్ డిస్క్ కాజేసింది ..
అలా డిలీట్ చేసే క్రమంలో అందులో వందలమంది అమ్మాయిల బ్లూ వీడియోలు చూసి పోలీసులకి ఆ హార్డ్ డిస్క్ ని అప్పగించింది .. దీంతో ఇతగాడు అసలు వ్యవహారం బయటపడింది .. నిజానికి ఆ వీడియోల్లో అమ్మాయిలంతా వాళ్ళ సంపూర్ణ అంగీకారంతోనే సె- చేస్తున్నారు .. బ్లూ వీడియో కాల్స్ లో సహకరిస్తున్నారు .. కానీ వారికి అతను ఆ వీడియోలని రికార్డ్ చేస్తున్నాడని తెలీదు .. అతను తన దగ్గర వీడియో ఉందని అతను చెప్పాక నరకం అనుభవిస్తున్నారు.
ఆ వీడియోలతో పాటు ఆ అమ్మాయిలతో మాట్లాడిన కాల్స్ ని సైతం రికార్డ్ చేసి గార్డ్ డిస్క్ లో స్టోర్ చేశాడు .. ఆ ఆడియోలో అమ్మాయిలు చాలా దీనంగా వేడుకుంటూ తమ వీడియోలు బయట పెట్టొద్దని ఏడుస్తూ బతిమాలుకుంటున్నారు .. వారితో ఆ రాక్షసుడు మాట్లాడుతున్న విధానం వింటే .. వీడి మానవ పుట్టుకే పుట్టాడా ? అనిపిస్తుంది …
ఇక్కడ అమ్మాయిల తప్పు కూడా ఉంది కదా అనుకోవచ్చు .. అవును కచ్చితంగా ఉంది .. ఆటగాడి మాటలకు పడిపోయి , డ్రగ్స్ కి అలవాటుపడి , డబ్బుకు లొంగిపోయి .. ఇలా చాలా కారణాలతో వాళ్ళు ఆ కామ పిశాచికి లొంగిపోతున్నారు .. కాదు అతన్ని నమ్ముతున్నారు ..
అమ్మాయిలు బీకేర్ ఫుల్ .. మస్తాన్ సాయి లాంటి సైకోలు అడుగడుగునా ఉన్నారు .. జాగ్రత్త .. ఇలాంటి మాయగాళ్ల వల్లో పడితే మీ జీవితం .. ఇలాంటి హార్డ్ డిస్క్ లో బందీ అయిపోతుంది .. మీరు ఏడ్చినా .. కన్నీటి వరద పాటించినా ప్రయోజనం ఉండదు ..
పోలీసులు అరెస్ట్ చేశాక మస్తాన్ సాయి మీడియాతో మాట్లాడుతూ .. ఆ వీడియోలన్నీ నా భార్య , నా ప్రియురాలివి.. వాళ్ళ అంగీకారంతోనే ఆ వీడియోలు రికార్డ్ చేసాను అంటున్నాడు.. నిజంగా అతని భార్య అయితే మాత్రం అలా వీడియోలు తీయడానికి ఒప్పుకుంటుందా ?
ఇలాంటి సైకోలకి ఈ సమాజంలో బతికే అర్హత లేదు .. చట్టాల్లోని లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని ఇలాంటి వాళ్లు బయటికి వస్తున్నారు .. మళ్లీ కొత్త ప్లాన్ తో మళ్లీ వేరే అమ్మాయిలకు వల్లో వేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు .. ఎల్లవేళలా తల్లిదండ్రులు ఆడపిల్లలను కాపాడుకోలేరు..
కానీ ఇలాంటి సైకోలని మన చట్టాలు ఏమీ చేయలేవు .. ఈ సొసైటీల్లో కొంతమంది .. ఇలాంటి కామాంధులని కవచాలుగా నిలబడి కాపాడుకుంటారు .. ఇలాంటప్పుడు మార్పు రావాల్సింది ఆడపిల్లల్లోనే.. కాస్తంత అప్రమత్తత .. కొద్దిగా మెచ్యూర్డ్ గా ఆలోచించడం ..
ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని స్థితిలో ఇవాళ్టి ఆడపిల్లలు లేరు .. అన్నీ వాళ్ళకి తెలుసు .. కానీ కొన్ని బలహీన క్షణాల్లో ఇలాంటి దుర్మార్గులని నమ్ముతారు .. పెళ్లికాకముందే సె- , ఇలాంటి బ్లూ వీడియో కాల్స్ , ప్రేమించాడని మగాడిని నమ్మేసి వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లడం, ఇవే అమ్మాయిలు చేసే తప్పు ..
అలాంటి సందర్భాల్లో నేను ఆడపిల్లని అన్న విషయం గుర్తు పెట్టుకుంటే చాలు .. ఆ హార్డ్ డిస్క్ లో అమ్మాయిలు ఏడుస్తూ మాట్లాడిన ఆడియో కాల్స్ నేను స్వయంగా విని .. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకు భయమేసి.. ఇలాంటి సైకోల మధ్య ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలో.. అర్ధం కానీ స్థితిలో ఈ ఆర్టికల్ రాశాను .. అశోక్ వేములపల్లి
Share this Article