.
వావ్… టీవీల్లో యాంకర్ ఉద్యోగానికి ఇప్పుడు అర్హతలు ఇలా మారిపోయాయా..? వాడెవడో దిక్కుమాలినోడు హిజ్రాయో, ఆడో తెలియని ఓ వేషం కట్టి, అఘోరి అని పిలిపించుకుని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు/ది కదా…
వాడికి ఈమె వల వేసిందా..? ఈమెకు వాడు వల వేశాడా..? తెలియదు..! అసలు వాడు వాడేనో, ఆడో తెలియదు… ఈ వర్షిణితో పెళ్లి లెస్బియన్ల పెళ్లి అనుకోవాలా..? ఏమనుకోవాలి..? వాడు ప్రత్యేక పూజల పేరిట వసూళ్లకు, బెదిరింపులకు దిగితే నిన్నో మొన్నో ఓ కేసు కూడా నమోదైంది…
Ads
నిన్న ఏదో సర్వే ఇండియాలో 32 ప్రామాణికాల్లో తెలంగాణ పోలీస్ ఫస్ట్ ప్లేసు, ఏపీ పోలీస్ సెకండ్ ప్లేసుల్లో నిలిచాయట కదా… ఫాఫం, సర్వే రాయుళ్లకు ఈ అఘోరి అనే ఆఫ్టరాల్ కేరక్టర్‌ను టాకిల్ చేయలేని అసమర్థత గురించి తెలిసి ఉండదు…
సరే, ఆ కథ కాస్త అటుంచితే… నంబర్ వన్ అని ఓ చానెల్ ఉంది తెలుగులో… యాజమాన్యం మారినట్టు సమాచారం… సదరు చానెల్ ఎండీ అట, తనే స్వయంగా ఈ వర్షిణికి తన చానెల్‌లో యాంకర్ కొలువు ఇచ్చాడు… ఎందుకయ్యా అంటే ఆమె జీవితం బాగుండాలి అని ఈ నిర్ణయం అట… PRESS అని ఓ ID కార్డు కూడా దయతో ప్రసాదించాడు…
అవునూ, ఆమె జీవితమే ఎందుకు బాగుండాలి..? ఆ దిక్కుమాలిన వేషగాడిని కట్టుకున్నందుకా..? ఇంతకీ ఆమె బాధితురాలా.,.? ఐతే ఎలా…? ఇద్దరిదీ ప్రేమ వివాహమట కదా… మరెందుకు ఈ చానెల్‌కు ఈ సానుభూతి..?
యాంకర్ కావాలంటే కాస్త చూడబుల్ మొహం, స్పష్టమైన ఉచ్చరణ, కాస్త జర్నలిజం మీద అవగాహన, వార్తల్ని భావస్పష్టతతో చదవడం గట్రా అవసరమని అంటారు కదా… అవేవీ అక్కర్లేదా..? ఏదో పిచ్చి పనితో వార్తల్లో ఉంటే సరిపోతుందా..? (అంటే, ప్రస్తుత యాంకర్లకు ఈ లక్షణాలున్నాయా అనడక్కండి…) ఆ దరిద్రం వేరు, సో, ఎవరైతేనేంలే అనుకున్నాడేమో చానెల్ బాధ్యుడు..
ఇన్నాళ్లు వందల మంది చానెళ్లు పెట్టారు, యూట్యూబ్ చానెళ్లకు లెక్కేలేదు… కానీ ఈ కొత్త అర్హతల్ని నిర్దేశించుకున్నది మాత్రం ఈ చానెలే… ఇప్పటికీ అర్థం కానిది ఏమిటంటే..? వాడి దగ్గర బోలెడు డబ్బుందట, ఇద్దరూ కావాలని పెళ్లి చేసుకున్నారు, ఎవరి నిర్బంధమూ లేదు… మరి అలాంటప్పుడు ఆమె జీవితంలో అర్జెంటుగా కళాకాంతులు నింపాలనే సామాజిక సేవా ఔదార్యం ఏమిటి..? హేమిటో,.. అస్సలు సమజే కాదు…
తమ జీవితాల్లో అనేక ఆటుపోట్లతో సతమతం అవుతున్న అర్హులైన యువతీయువకులు బోలెడు మంది మన సమాజంలో… బతుకు కష్టమైన వాళ్లు, కాసింత ఆసరా ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూసేవాళ్లు… వాళ్లు శ్రీవర్షిణులు కారు, అఘోరీలు అసలే కారు…!
కొంతమంది యాంకరిణులను చూస్తున్నాం కదా… టీవీ ప్రత్యేక షోలలో పాల్గొంటూ, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటూ యావత్ తెలుగు సమాజాన్ని అలరిస్తున్నారు… ఉద్దరిస్తున్నారు… సో, నాలుగు రోజులు ఆగండి, ఇదే వర్షిణి, అదే అఘోరీతో కలిసి ఏదో దిక్కుమాలిన చానెల్‌లో ‘ఉత్తమ జంట కంటెస్టు’లో కనిపిస్తారు..!!
Share this Article