.
Pardha Saradhi Potluri …. జంతర్ మంతర్ అనే ప్రదేశాన్ని నిరసన ప్రదర్శన చేసుకోవడానికి గతంలో అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం వలన ఇప్పటి వరకూ జంతర్ మంతర్ లో నిరసన తెలపడానికి వేదికగా ఉంటూ వచ్చింది!
డీనోటిఫికేషన్! జంతర్ మంతర్ ని ఢిల్లీ పోలీసులు డీనోటిఫై చేశారు!
అంటే ఇక నుండి నిరసన ప్రదర్శన చేయడానికి వీలు లేదు!
జంతర్ మంతర్ ని డీనోటిఫై చేసిన ప్రభుత్వం నిరసన ప్రదర్శనలు చేసుకోవడానికి మూడు ప్రాంతాలని సూచించింది అవి…
Ads
1.రామ్ లీలా మైదానం. సెంట్రల్ ఢిల్లీ లో ఉంది. పార్లమెంట్ భవనం నుండి, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి 4 నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. చారిత్రకంగా చూస్తే పెద్ద పెద్ద ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర ఉంది. ఈ మైదానాన్ని ఉపయోగించుకోవాలి అంటే ముందుగా ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవాలి!
2.బురారీ గ్రౌండ్… ఉత్తర ఢిల్లీ లోని అవుట్ స్కర్ట్స్ లో ఉంది కానీ అతి పెద్ద మైదానం ఇది. సెంట్రల్ ఢిల్లీ నుండి 15 నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది! ఉచితంగా ఆందోళన నిర్వహించుకోవచ్చు కానీ ముందుగా అనుమతి తీసుకోవాలి.
3.CBD Ground (Shahdara / East Delhi …. సెంట్రల్ ఢిల్లీ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రౌండ్ చుట్టూ కమర్షియల్, నివాస భవన సముదాయాలు ఉన్నాయి. ఉచితంగా వాడుకోవచ్చు కానీ ముందస్తుగా అనుమతి తీసుకోవాలి.
జంతర్ మంతర్ లో ఇక నుండి ఎలాంటి ఆందోళన నిర్వహించడానికి వీలు లేదు.
SOPs ( Standard Operating Procedure )… ఢిల్లీ పోలీసులు ప్రకటన చేస్తూ పైన పేర్కొన్న మూడు ప్రదేశాలకి వేరువేరుగా గైడ్ లైన్స్, అప్లికేషన్ ప్రాసెస్ లతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి.
ఈ మూడు ప్రదేశాలు కూడా ఇప్పటికే వివిధ కారణాలతో డిసెంబర్ నెల చివరి వరకూ బుక్ అయిపోయాయి!
ఒక్క రామ్ లీలా మైదానం మాత్రం డిసెంబర్ 29, 30, 31 తేదీలలో ఖాళీగా ఉంది!
సీజెపి మాత్రం మేము ఒప్పుకోము అంటూ జంతర్ మంతర్ గేటు ముందు ఉన్న పోలీస్ బారికేడ్స్ దూకి జంతర్ మంతర్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన అసుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లతో పాటు మరో పది మంది వాలంటీర్ల ని పోలీస్లు అదుపులోకి తీసుకున్నారు ఈ రోజు ఉదయం!

ఆదివారం రోజున సుప్రీం కోర్టు తలుపు తట్టి మెట్రో, ఇంటర్నెట్ యధావిధిగా పనిచేసేట్టుగా ఆదేశాలు ఇవ్వమని సీజెపి తరపున పిటిషన్ వేయించి కోర్టు ఆదేశాలు ఇచ్చేట్లుగా చేశారు. ప్రభుత్వం సెంట్రల్ ఢిల్లీ సున్నితమైన ప్రదేశం కాబట్టి జంతర్ మంతర్ ని ఆందోళన నిర్వహించుకునే ప్రదేశాల లిస్టు లో నుండి తీసివేసింది.
ఇక ముందు మెట్రో రైలుని ఆపడం లేదా ఇంటర్నెట్ ని ఆపడం చేయరు, ఎందుకంటే పైన పేర్కొన్న ప్రదేశాలు సున్నితమైన ప్రాంతాలలో లేవు కనుక. సీజెపి ప్లాన్ ఎలా ఉంది అంటే కూలి ఇచ్చి తన్నిచ్చుకున్నట్లుగా ఉంది…
Share this Article