Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ వక్రబాష్యాలు – పసలేని విమర్శలు

October 13, 2026 by M S R

.

విమర్శ హేతుబద్దంగా ఉండాలి… జనం నమ్మేలా ఉండాలి… నిర్మాణాత్మకంగా ఉండాలి… సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి… కానీ బీఆర్ఎస్ హరీష్‌రావు విమర్శలు రానురాను దిగజారిపోతున్నాయి… ప్రభుత్వం చేసిన ప్రతి పనికీ అభూతకల్పనలు జోడించి, అడ్డదిడ్డం బాష్యాలు జతచేసి, ఏదో ఒకటి మాట్లాడేస్తే సరి అన్నట్టు ఉంటున్నాయి…

రైతు డిస్కమ్ మీద తన విమర్శలు చదువుతుంటేనే ఓరకంగా నవ్వొచ్చింది కూడా… పాపం, ఇంత సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్, మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉండీ ఇలా మాట్లాడుతున్నాడేమిటి అనిపించింది… ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, రైతు మెడకు ఊరేసేందుకేనా రైతు డిస్కమ్ కుట్ర అంటున్నాడు… నిరంకుశ, దుర్మార్గ చర్య అంటున్నాడు… కానీ..?

Ads

సిస్టంలో రెగ్యులేటరీ కమిషన్ ఉంటుందనీ, అది అందరి వాదనలు విన్నాకే ఈ డిస్కమ్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందనీ మరిచిపోయాడు… ఈ డిస్కమ్ ఏర్పాటు చేస్తే ఉచిత విద్యుత్తు ఎందుకు రద్దు అవుతుందో తనకే తెలియాలి… ఇప్పటిదాకా సదరన్, నార్తరన్ డిస్కమ్స్‌కు రైతుల ఉచిత విద్యుత్తు సబ్సిడీని ప్రభుత్వం ఎలా ఇస్తున్నదో, ఇక రైతు డిస్కమ్‌కు ఇస్తుంది, అంతే తేడా…

రైతుల మోటార్లకు మీటర్లు పెడతారు, ఉచిత విద్యుత్తు తీసేస్తారు అని ఆమధ్య గాయిగత్తర చేసింది బీఆర్ఎస్… రేవంత్ రెడ్డి దాన్ని సవాల్ చేసేసరికి మళ్లీ ఇప్పటికి దానిపై కిక్కుమనలేదు, ఇప్పుడు ఇది స్టార్ట్ చేసింది… ప్రభుత్వం సబ్సిడీలు చెల్లించే అన్నిరకాల కనెక్షన్లను ఈ కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకొచ్చారు…

రైతు డిస్కమ్

మొత్తంగా 30,62,853 కనెక్షన్లు రైతు డిస్కమ్‌కి బదిలీ చేశారు… బకాయిలు, అప్పుల్ని సర్దుబాటు చేశారు… జెన్‌కోతోపాటు 87 సంస్థల నుంచి విద్యుత్తు కేటాయించారు… సిబ్బందినీ ఇచ్చారు… ఎల్టీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చారు… ఇందులోకి వ్యవసాయ కనెక్షన్లతోపాటు లిఫ్టులు, మిషన్ భగీరథ, వాటర్ బోర్డు తదితరాలన్నీ చేర్చారు… తద్వారా నార్తరన్, సదరన్ డిస్కమ్‌లను కమర్షియల్‌గా వయబుల్ చేసే ప్రయత్నం… రుణసేకరణకు వీలు…

tgrpdcl

థర్మల్ 25%, సోలార్ 58%, హైడల్ మొత్తంగా 100% రైతు డిస్కమ్ కు కేటాయించారు కాబట్టి పగటిపూట మాత్రమే సోలార్ కదా, మరి రాత్రి మాటేమిటి..? 3, 4 నెలలే జలవిద్యుత్తు ఉంటుంది కదా, మరి మిగతా రోజుల మాటేమిటి అంటాడు హరీష్ రావు… తనకు పవర్ సబ్జెక్టు మీద అవగాహన లేదని అర్థమవుతూనే ఉంది…

ఏ డిస్కమైనా తన అవసరాలను బట్టి… థర్మల్, సోలార్, విండ్, హైడల్ తదితర విద్యుత్తులను వాడుకుంటూ, అవసరమైతే కొనుగోళ్లు చేస్తూ… సరఫరాను క్రమబద్ధం చేసుకుంటుంది… ఆ పని విద్యుత్తు నిపుణులు చూసుకుంటారు… అంతేతప్ప రాజకీయ నాయకులు కాదు…

పైగా అప్పులు, బకాయిలు ఈ డిస్కమ్ నెత్తిన మోపారు, చివరకు అవన్నీ రైతులపై పడేస్తారు, ఉచిత విద్యుత్తు కొనసాగింపుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలీ అంటున్నాడు… హేమిటో, కేసీయార్ భాషలోనే చెప్పాలంటే, అంతా బభ్రాజమానం భజగోవిందం టైపు విమర్శలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ వక్రబాష్యాలు – పసలేని విమర్శలు
  • అసలే గతితప్పిన సంసారి… పైగా సమాజానికి బోడి ఉచిత సలహాలు…
  • పిచ్చి స్క్రిప్టుతో అభాసుపాలు – ఇప్పుడు దిద్దుబాటుకు మరో ప్రయాస
  • డియర్ చంద్రబోస్, ఓ నాలుగు రోజులు చల్లగరిగెలో ఉండి రావచ్చుగా…
  • Ellis Island – అమెరికా పారడాక్స్ వలస కథలకు అచ్చమైన సాక్ష్యం !!
  • నిషా నూర్‌..! ఈమెదీ సిల్క్ స్మిత కథేనా..? డర్టీ పిక్చర్‌-2 అదేనా..?
  • ఘర్షణ వద్దు – అదెటు దారితీస్తుందో ఎవరూ చెప్పలేని రోజులివి !!
  • FSD … మస్కా కాదు, మస్క్ మార్క్ ఆటో పైలట్ Tesla కారు..!!
  • నిత్యం వార్తల్లో బొద్దింకలు ! రాహుల్‌ను సైడ్‌లైన్ చేసేందుకు బీజేపీ ప్లాన్ !!
  • తిలక్ వర్మ రనౌట్ స్వీయ తప్పిదమే… కానీ వెస్టిండీస్ క్రీడాస్పూర్తి !?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions