.
లక్షల మంది రాబర్ట్ వాద్రాలు… ఈ దేశం మీద, హిందువుల మీద సాగించిన మత ఉగ్రవాద దాడుల్ని కూడా… జస్ట్, యాంటీ బీజేపీ, యాంటీ మోడీ కళ్లద్దాల నుంచి చూస్తూ… తమను తాము మోసగించుకుంటున్నవాళ్లు…
కుహనా సెక్యులరిస్టులు అంటే ఎవరని అడుగుతున్నారు కదా… అసలు అది చాలా చిన్న ఇన్సిడెంట్, అసలు అది మత ఉగ్రవాదమే కాదు దగ్గర నుంచి బీజేపీయే చేయించిందనే శుష్క ప్రచారాల దాకా… తాజాగా కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న మృతుల జాబితా ఇది…
Ads
ఇండియా టీవీ న్యూస్‌లో ప్రచురితమైన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల పూర్తి జాబితా ఇది.
1-మహ్మద్ ఆసిఫ్ యుపి.
2 – అనిస్ ఖురేషి యుపి.
3 -ఫైసల్ ఖాన్ ఢిల్లీ.
4 -సలీం బేగ్ రాజస్థాన్.
5 – అనిల్ రాయ్ బీహార్.
6 – రమేష్ యాదవ్ యుపి.
7- ప్రదీప్ మిశ్రా యుపి
8 – ఆరిఫ్ ఖురేషి యుపి.
9 -ప్రవీణ్ ఠాకూర్ హర్యానా.
10 – జమీల్ అహ్మద్ పంజాబ్.
11 – సురేష్ కుమార్ ఢిల్లీ.
12 – మొహ్సిన్ షేక్ మహారాష్ట్ర.
13 -అఫ్జల్ అన్సారీ బీహార్.
14- మంజు శర్మ రాజస్థాన్.
15- దీపక్ వర్మ యుపి.
16 – నజీమ్ ఖాన్ యుపి.
17 – సునీల్ గుప్తా బీహార్.
18- అస్లాం మీర్జా గుజరాత్.
19 – రాకేష్ యాదవ్ ఎంపి.
20-షరీఫ్ షేక్ మహారాష్ట్ర.
21- షాహిద్ హుస్సేన్ ఢిల్లీ.
22-రియాజ్ అహ్మద్ జమ్మూ.
23 – మీనాక్షి త్రిపాఠి యుపి.
24 – సలీం ఖాన్ యుపి.
25 – నీరజ్ వర్మ హర్యానా.
26- ఇర్షాద్ ఖాన్ ఢిల్లీ.
చనిపోయిన 26 మందిలో 15 మంది ముస్లింలు ఉన్నారు, అయితే నిన్నటి నుండి గోడి మీడియా వాళ్లు టెర్రరిస్టులు హత్యకు ముందు పేర్లు అడిగి మరీ చంపారని మీడియా మరియు సోషల్ మీడియా వేదికగా ముస్లింల మీద విద్వేషాలను వ్యాప్తి చేస్తున్న అసత్య వార్తలను ఈ జాబితా గుట్టు రట్టు చేస్తుంది… ఇదీ ఆ ప్రచారం, ఆ పోస్టులు…
కానీ అసలు ఈ జాబితాయే బోగస్… అసలు మృతుల జాబితా ఇదుగో… (కశ్మీర్ అధికార యంత్రాంగం అధికారికంగా రిలీజ్ చేసిన జాబితా ఇది…)
వీరిలో ఒకే ఒకరు ముస్లిం… తను అక్కడి హార్స్ రైడర్… పర్యాటకుల్ని రక్షించడానికి తను ఉగ్రవాదుల నుంచి తుపాకీ లాక్కోబోయి తను కాల్పుల్లో మరణించాడు… తన గురించి మీడియా రాసింది… మరి మిగతా వాళ్లంతా ఎవరు..? మరెందుకు అసత్యాలు వ్యాప్తి చేస్తూ, అసలు అది ఉగ్రవాద చర్యే కాదని ప్రచారం చేస్తూ… పాకిస్థానీ ప్రేరిత ఉగ్రవాదాన్ని, ఈ దేశం మీద ఉగ్రవాద దాడిని సమర్థిస్తున్నారా..?
పర్యాటకుల మతం ఖరారు చేసుకుని మరీ పాయింట్ బ్లాంకులో కాల్చిచంపినట్టు మృతుల భార్యలే ఏడుస్తూ చెబుతున్నవి నిజాలు కావట… వీళ్లు స్టార్ట్ చేసిన ఫేక్ ఉగ్రవాద క్యాంపెయిన్‌ను నమ్మాలట… ఏమిటీ విషం..? స్వదేశం మీదే ఏమిటీ ద్వేషం..?
ఉగ్రవాదులు తమ చర్యలతో తమ పొట్టలు కొడుతున్నారని స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు… స్థానిక పత్రికలు తమ ఫస్ట్ పేజీలను నలుపులో ప్రచురించి స్పష్టంగా తమ నిరసన ప్రకటించాయి… నిజాలు అవి, కానీ కొందరు నిజాల్ని వక్రీకరించి ఉగ్ర పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు… పరోక్షంగా, ప్రత్యక్షంగా…
చివరకు ఫేక్ జాబితాలు కూడా పోస్ట్ చేస్తున్న వీళ్లు ఎవరికి మద్దతుదారులు..? వీళ్లే మరొక వీడియో రిలీజ్ చేశారు… అందులో ఓ మహిళ … ‘‘వాళ్ళు హిందువులా అని అడిగి సెలెక్ట్ చేసి చంపినట్టు ప్రచారం నిజం కానే కాదు… స్థానికులు ఇక్కడ అందరినీ సమానంగా చూసుకుంటారు… వాళ్ళు చంపింది హిందువులను కాదు భారతీయులను…’’ అని చెబుతోంది…
తీరా ఆరా తీస్తే ఆమె రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్న ఎన్సీపీ కార్యకర్త… పేరు పూజా జాదవ్… ఆమె కశ్మీరీ కాదు, ఆమె అసలు కశ్మీర్ వెళ్లనేలేదు… కానీ ఈ ఉగ్రవాద సమర్థన ప్రచారం దేనికి..? ఎవరు..? ఎవరు విచ్ఛిన్నకారులు..? ఎవరు విద్వేషకారులు..?
Share this Article