.
Pardha Saradhi Potluri ….. పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద క్యాంపులపై ఆపరేషన్ సింధూర పేరిట భారత్ యుద్ధం అర్ధరాత్రి దాటాక ఆరంభించింది… అయితే అది పూర్తి యుద్ధంలాగా మారుతుందా..? ప్రస్తుతం పీవోకేపై దాడులు… మరి భారత్ ఎప్పుడు పాకిస్థాన్ మీద దాడి చేస్తుంది? PART- 1
ప్రపంచ దేశాలతో పాటు పాకిస్తాన్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నది! గత అయిదు రోజులుగా పాకిస్థాన్ తన సైన్యంలో సింహ భాగం సరిహద్దుల దగ్గరికి తరలించి రోజు వారీ డ్రిల్స్ నిర్వహిస్తున్నది!
Ads
బ్యారక్స్ నుండి సరిహద్దుల దగ్గరికి సైన్యాన్ని తరలించి రోజువారీ డ్రిల్స్ నిర్వహించడానికిగాను నిన్నటి వరకూ అయిన ఖర్చు 10 వేల కోట్లు!
అసలు యుద్ధమే మొదలవకుండా 10 వేల కోట్లు ఖర్చు అయితే యుద్ధం మొదలయితే అది రోజుకి యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా!
అంత ఖర్చు పాకిస్తాన్ భరించగలదా?
బలూచిస్తాన్ నుండి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహారిస్తే BLA విజృంభిస్తుంది! కానీ LOC దగ్గర వీలున్నంత ఎక్కువమంది సైన్యాన్ని ఆయుధాలని మెహరించాలి అని ప్లాన్!
చెరువు మీద అలిగిన పాకిస్థాన్!
పాకిస్థాన్ స్వంతంగా పారాసిటమాల్ టాబ్లెట్ ని కూడా తయారుచేసుకోలేదు! అన్నీ దిగుమతి చేసుకోవాల్సిందే! పైగా భారత్ నుండి దుబాయ్ కి ఎగుమతి అయ్యి, అక్కడ నుండి పాకిస్థాన్ కి వెళుతున్నాయి మందులు, ఇతర నిత్యావసరాలు! మూడు రోజుల క్రితం వాటి మీద కూడా నిషేధం విధించింది పాకిస్తాన్ ప్రభుత్వం!
అంటే భారత్ లో తయారయ్యే ఏ వస్తువుని కూడా ఇతర మార్గాల ద్వారా దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు విధించింది! అయితే చైనా లేదా టర్కీ నుండి దిగుమతి చేసుకోవాలి!
చైనా అయితే చవకగా దొరికే మైదాపిండికి రంగులు అద్ది సరఫరా చేస్తుంది ఇది రుజువు అయిన విషయం!
పాకిస్థాన్ మెడికల్ షాపులలో భారత్ లో తయారైన మందులనే అడిగి మరీ కొంటారు అక్కడి ప్రజలు. టర్కీ నుండి కొంటే 10 పైసల పారాసిటమాల్ టాబ్లెట్ 5 రూపాయలు పెట్టి కొనాలి!
ఒక పోలిక చెప్పుకోవాలి!
ఇజ్రాయేల్ ఉత్పత్తులని గల్ఫ్ దేశాలు కొనేవి కావు! ఇజ్రాయేల్ నుండి జోర్దాన్ కి వచ్చి అక్కడి నుండి గల్ఫ్ దేశాలకి ఎగుమతి అయ్యేవి!
2019 లో గల్ఫ్ దేశాలు ఇజ్రాయేల్ ఉత్పత్తుల మీద నిషేధం ఎత్తివేశాక నేరుగా ఇజ్రాయేల్ నుండే ఎగుమతి అవుతున్నాయి! ఇజ్రాయేల్ హమాస్ మీద దాడి చేసినా, ఇంకా చేస్తున్నా కూడా ఇజ్రాయేల్ మీద ఎలాంటి ఆంక్షలు విధించకుండా దిగుమతి చేసుకుంటున్నాయి గల్ఫ్ దేశాలు.
కానీ పాకిస్తాన్ మాత్రం ఉన్న ఒక్క దారిని కూడా స్వయంగా తానే మూసివేసుకున్నది!
యుద్ధం మొదలయితే పెయిన్ కిల్లర్స్ తో పాటు మార్ఫిన్ ఇంజెక్షన్స్ కూడా వేల సంఖ్యలో అవసరం అవుతాయి. మార్ఫిన్ ఇంజెక్షన్స్ ఖరీదు ఎక్కువ!
ఇక ఆయుధాల మాటేమిటి?
గత పదేళ్లలో పాకిస్థాన్ ఆయుధాల దిగుమతులు చైనా నుండే జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత పాకిస్తాన్ ఆయుధాలు మొత్తంగా చూస్తే 60% శాతానికి చేరుకున్నాయి.
So..! యుద్ధం మొదలైతే సింహ భాగం చైనా నుండే విడిభాగాలు, ఇతర ఫైర్ ఎక్విప్మెంట్ ని దిగుమతి చేసుకోవాలి!
155 mm టాంక్ షేల్స్!
యుద్ధ టాంకులలో వాడే 155 mm షెల్స్ పాకిస్థాన్ స్వంతంగానే తయారుచేసుకుంటుంది. కానీ రా మెటీరియల్ చైనా నుండే దిగుమతి చేసుకోవాలి!
పోనీ 155 mm షెల్స్ కావాల్సినంత స్టాక్ ఉన్నాయా?
లేవు. పాకిస్థాన్ తన దగ్గర ఉన్న 155 mm షెల్స్ ని ఉక్రెయిన్ కి అమ్మి బదులుగా ఉక్రెయిన్ నుండి గోధుమలు, వంట నూనెలు కొన్నది.
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ దగ్గర 155 mm షెల్స్ తగినన్ని నిల్వలు లేవు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రోజుకి 80 వేల షెల్స్ ఫైర్ చేసింది రష్యన్ ఆర్మీ. కానీ యుద్ధం తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా రోజుకి ఒక లక్ష తరువాతి కాలంలో రోజుకి రెండు లక్షల షెల్స్ అవసరం అయ్యాయి. రష్యాలో మూడు పెద్ద షెల్స్ తయారు చేసే ఫాక్టరీలు ఉన్నా రోజుకి ఒక్కో ఫాక్టరీ 10 వేల షెల్స్ తయారు చేసినా మొత్తం 30 వేల షెల్స్ మాత్రమే తయారు చేయగలిగింది. కానీ ఫ్రంట్ లైన్ నుండి డిమాండ్ ఎక్కువ అవడంతో ఉత్తర కొరియాకి తాను గతంలో సప్లై చేసిన షెల్స్ ని తిరిగి దిగుమతి చేసుకున్నది రష్యా!
పూర్తి స్థాయి యుద్ధం అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ ఒకేసారి పాల్గొంటే అది పూర్తి స్థాయి యుద్ధం అంటారు!
పాకిస్తాన్ పూర్తి స్థాయి యుద్ధం చేసే స్థితిలో లేదు!
ఒక F-16 ఫైటర్ జెట్ డ్రిల్ కోసం టేకాఫ్ చేసి 10 నిముషాల తరువాత ల్యాండ్ అయితే 16 వేల డాలర్లు దాని మెయింటినేన్స్ కోసం ఖర్చు అవుతుంది. దీనిని సార్టీ అంటారు. ప్రతీ సార్టీకి 16 వేల డాలర్లు ఖర్చు చేయగలదా పాకిస్థాన్? పైగా స్పేర్ పార్ట్స్ అమెరికా నుండి రావాలి. అదే చైనా తయారీ JF 17 ఫైటర్ జెట్ కి అయితే 6 వేల డాలర్లు ఖర్చు అవుతుంది!
ప్రస్తుతం పాకిస్థాన్ డాలర్ రిజర్వ్ 4 బిలియన్లు మాత్రమే!
యుద్ధం అంటూ మొదలైతే రోజుకి ఒక బిలియన్ డాలర్లు ఆవిరి అయిపోతాయి! యుద్ధం చేస్తున్నాము అప్పు ఇవ్వమంటే ఏ దేశమూ ఇవ్వదు. నాలుగు రోజుల పాటు యుద్ధం చేస్తే పాకిస్తాన్ దగ్గర ఒక్క డాలర్ కూడా మిగలదు.
పాకిస్థాన్ సైనిక జెనరల్స్ ఎదురు తిరుగుతున్నారు!
చీఫ్ ఆఫ్ ఆర్మీ ఆశీమ్ మునీర్ కి అతని కింద పనిచేసే జెనరల్స్ తమ అధీనంలో ఉన్న సైన్యానికి కావాల్సిన అయుధాలు, స్పేర్ పార్ట్స్, మందులు, ఆహారం నిల్వలు లేవనీ, తాము ఎలా ముందుకు నడిపించగలమని లెటర్స్ వ్రాస్తూ తాము యుద్దానికి సిద్ధంగా లేమని చెపుతున్నారు!
ముఖ్యంగా MBT ( Main Battle Tank) లకి కావాల్సిన విడిభాగాలు, షెల్స్ లేవని, రోజుకి ఎన్ని షెల్స్ ఖర్చు అవుతాయో, ఫాక్టరీ ప్రోడక్షన్ కోసం రా మెటీరియల్స్ నిల్వ ఎంత ఉన్నాయో తెలుపుతూ లెటర్స్ వాస్తున్నారు!
కేవలం అణు ఆయుధాలనే చూపిస్తూ ఆశీమ్ మునీర్ యుద్దానికి సిద్ధపడ్డాడు!
పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ సయ్యద్ ఆసిమ్ మునీర్ ని జిహాదీ మునీర్ అని పిలుస్తారు! జిహాదీ జెనరల్ మునీర్! మునుపటి పాకిస్తాన్ సైనిక జెనరల్స్ ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ నుండి వస్తే ఆసిమ్ మునీర్ ఆర్మీ బాక్ గ్రౌండ్ లేకుండా ఆర్మీ చీఫ్ అయ్యాడు.
మునీర్ తండ్రి 1947 లో దేశ విభజన సందర్బంగా భారత్ లోని పంజాబ్ లో ఉన్న జలంధర్ నుండి పాకిస్తాన్ లోని రావల్పిండి నగరానికి వలసవెళ్ళాడు. 1947 లో భారత్ నుండి వెళ్లిన ముస్లిమ్స్ ని ముహజిర్ అనేవాళ్ళు అక్కడివాళ్ళు. ముహజీర్ అంటే శరణార్ది! అఫ్కోర్స్! రెండు దశాబ్దాల క్రితం వరకూ ముహజీర్ లని రెండవ శ్రేణి పౌరులుగా పరిగణించేవారు పాకిస్తాన్ ప్రజలు.
మునీర్ తండ్రి రావల్పిండిలోని మదరసాకి ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. మునీర్ కూడా మదరాసాలోనే చదివాడు. తరువాత మిలిటరీ అకాడమిలో శిక్షణ తీసుకోని సైన్యంలో చేరాడు!
2016 నుండి 2018 వరకు మిలిటరీ ఇంటెలిజెన్స్ కి చీఫ్ గా పనిచేశాడు!
మునీర్ ఎక్కువగా రాజకీయ నాయకులతో తిరగడం వలన తక్కువ సమయంలో, అంటే 2018 లో ‘ISI’ చీఫ్ అయ్యాడు.
కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ISI కి చీఫ్ గా పనిచేశాడు మునీర్. 2019 లో పుల్వామా లో CRPF జవాన్ల మీద దాడికి పధక రచన చేసింది అప్పటి ISI చీఫ్ ఆశీమ్ మునీర్! అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మునీర్ మీద విరుచుకుపడ్డాడు పుల్వామా పధక రచన చేసినందుకు. భారత్ ప్రతిగా బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు అటు రాజకీయంగా ఇటు సైన్యంలో కూడా మునీర్ మీద వ్యతిరేకత వచ్చింది.
సైన్యం రెండుగా చీలిపోయి ఒక వర్గం మునీర్ కి మద్దతుగా నిలవగా ఇంకో వర్గం మునీర్ కి వ్యతిరేకంగా మరియు ఇమ్రాన్ ఖాన్ కి మద్దతుగా నిలిచాయి!
ఇమ్రాన్ ఖాన్ వత్తిడితోనే మునీర్ ISI నుండి వైదోలిగాడు! ISI కి చీఫ్ గా అతితక్కువ కాలం పనిచేసింది ఆసిమ్ మునీర్ ఒక్కడే!
ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టించి ప్రధాని పదవి నుండి దించడంలో మునీర్ పాత్ర ఉంది! ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI ని ఎన్నికలలో పాల్గొనకుండా చేసి, ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టడం వెనుక మునీర్ ఉన్నాడు.
ఇమ్రాన్ ఖాన్ రాజీనామా తరువాతే 2022 లో ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అయ్యాడు.
“ Kashmir is our jugular vein “ ఈ మాట 1947 లో జిన్నా అనేవాడు తరుచూ!
జిన్నాలాగానే ఆసిమ్ మునీర్ తరుచూ అదే మాటని అంటూ ఉంటాడు “ Kashmir is our jugular vein, It will remain our jugular vein “
**************
ఆసిమ్ మునీర్ చైనాకి ఇష్టమైన సైన్యాధ్యక్షుడు!
ఆసిమ్ మునీర్ పట్టుపట్టి చైనా నుండి J-10CE మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ కొనిపించాడు 2022 లో.
అఫ్కోర్స్! ఒరిజినల్ J-10 C అనేది చైనా దగ్గర మాత్రమే ఉంటాయి! J-10CE లో E అంటే Export వర్షన్ అని అర్ధం! చైనా ఎక్స్పోర్ట్ వర్షన్ అయిన J-10CE లని పాకిస్తాన్ కి అమ్మింది! భారత్ ఫ్రాన్స్ నుండి రాఫెల్ కొన్న దానికి పోటీగా పాకిస్తాన్ J-10CE లని కొన్నది!
పాకిస్తాన్ లో ప్రజలు గోధుమపిండి దొరకక అలమటిస్తుంటే ఆసిమ్ మునీర్ మాత్రం చైనా నుండి J10CE లని కొన్నాడు! మొత్తం 60 J-10CE లని చైనా నుండి కొనడానికి మునీర్ ఒప్పందం చేసుకున్నాడు.
మొత్తం 12 J-10 CE లు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు.
ముందస్తు ప్రణాళిక!
చైనాకి ట్రంప్ విధిస్తున్న 245% టారిఫ్ లతో సమస్య ఉందన్నది వాస్తవం! అయితే అవి కొద్ది నెలలకే పరిమితం అవవచ్చు! చైనా నుండి అమెరికాకి దిగుమతి అయ్యే వాటి మీద అత్యధికంగా టారిఫ్ విధిస్తే చైనా నుండి అమెరికాకి దిగుమతులు తగ్గిపోతాయి!
దానికి విరుగుడుగా చైనా తన ఎగుమతుల వాల్యూమ్ తగ్గిపోకుండా చూసేందుకు ఇతర మార్గాలని సిద్ధం చేసుకుంది కాకపొతే కొద్ది నెలల సమయం పట్టవచ్చు!
ఈలోగా చైనా నుండి పరిశ్రమలు ఇతర దేశాలకి తరలిపోకుండా చూసుకోవాలి! చైనా నుండి వియత్నాం లేదా భారత్ కి వెళ్లిపోవచ్చు!
ఆపిల్, శామ్ సంగ్ చైనా నుండి తమ ప్లాంట్స్ పూర్తిగా తరలించే యోచనలో ఉన్నాయి! బహుశా అయితే భారత్ లేదా వియత్నాంకి వెళ్లిపోవచ్చు!
భారత్ కి వెళ్లడం చైనా కి ఇష్టం లేదు!
ఆసిమ్ మునీర్ చేత పహాల్గామ్ దాడికి మద్దతు తెలిపింది చైనా! ఆసిమ్ మునీర్ కి కొంత ఊరట కలిగించే హామీ ఇచ్చింది చైనా!
అది PL-15 VLAAM ( Very Long range Air to Air Missile) లాంగ్ రేంజ్ ఎయిర్ to ఎయిర్ మిసైల్ ని పాకిస్తాన్ కి ఇస్తానని వాగ్దానం చేయడమే కాదు ఇచ్చింది కూడా!
PL 15 లాంగ్ రేంజ్ మిసైల్ పరిధి 230 KM. దీనిని JF-17 బ్లాక్ III ఫైటర్ జెట్ తో ప్రయోగించవచ్చు! ఈ విషయంలో చైనా అమెరికా కంటే ముందు ఉంది!
చైనా పాత్ర అనుమానాస్పదం!
PL -15 లాంగ్ రేంజ్ మిసైల్ అనేది PLAAF అంటే చైనా ఎయిర్ ఫోర్స్ కోసం తయారుచేసుకున్నది. PL-15E ఎక్స్పోర్ట్ కోసం నిర్దేశించింది కానీ ఒరిజినల్ PL-15 లాగా 230 KM వెళ్ళలేదు 180KM మాత్రమే పరిధి కలిగి ఉంది!
కానీ ఏప్రిల్ 22న పహాల్గామ్ దాడి జరిగితే ఏప్రిల్ 25 న PL-15 మిసైల్స్ ని పాకిస్తాన్ కి డెలివరీ చేసింది చైనా! అదీ ఒరిజనల్ వెర్షన్ ని! ఇదే ఆపిల్, సామ్ సంగ్ థియరీని సమర్థించేదిగా ఉంది!
పూర్తి స్థాయి యుద్ధం జరిగితే భారత్ లో FDI లు పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతారు! చైనా నుండి పరిశ్రమల తరలింపు తాత్కాలికంగా ఆగిపోతుంది!
గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు అనని అణు యుద్ధం అనే మాట ఇప్పుడు పదే పదే అనడం వెనుక వ్యూహం చైనాదే! …… Contd.. Part 2
Share this Article