Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణకు నూతన ఆధ్యాత్మిక శోభ – రేవంత్ రెడ్డి భక్తి పర్యాటకం!!

July 7, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి పాలనలో నిశ్శబ్దంగానే 20 ఆలయాల పునర్నిర్మాణం మునుపెన్నడూ లేని రీతిలో మొదలైంది… కేసీయార్ తన పదేళ్ల పాలనలో కేవలం యాదగిరిగుట్టను పునర్నిర్మించి, పేదల నర్సన్నను కాస్తా ధనికుల దేివుడిగా మార్చి, మిగతా గుళ్లను, దేవుళ్లను గాలికి వదిలేశాడు… చివరకు భద్రాచలానికి ముత్యాల తలంబ్రాలను తీసుకుపోవడాన్ని కూడా ఆపేశాడు…

కానీ ఇప్పుడు రాష్ట్రంలో 20 గుళ్లు కొత్త కళను సంతరించుకోనున్నాయి… ఆల్రెడీ వేములవాడలో చురుకుగా పనులు శృంగేరీ పీఠం పర్యవేక్షణలో సాగుతున్నాయి… బాసరలో సరస్వతిమాత విగ్రహాన్ని బాలాలయంలోకి తరలించారు, అంటే, ఇక పనులు స్టార్ట్ అన్నమాట… మొత్తం 20 గుళ్లకు 2216 కోట్లు ఖర్చు పెట్టనున్నారు…

Ads

వీటిలో కేవలం శైవాలయాలు, వైష్ణవాలయాలే గాకుండా జోగుేలాంబ వంటి శక్తికేంద్రాలు, సమ్మక్క- సారలమ్మ వంటి ఆదివాసీ పోరాటదేవతల ఆలయాలు కూడా ఉన్నాయి… మొన్నటి జాతరలోపే సమ్మక్క గుడికి కొత్త శోభ అద్దారు… కొండగట్టు, ధర్మపురి, జోగులాంబ, భద్రాచలం, పెద్దమ్మ, భద్రకాళి, కీసర, చెరువుగట్టు టెండర్లు పూర్తికానున్నాయి…

ytd

కేసీయార్ టెంపుల్ టూరిజాన్ని నిర్లక్ష్యం చేశాడు… అంతేకాదు, అయోధ్య రాముడిపైనా విషం కక్కాడు, రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అంటూ..! రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు ఆధ్యాత్మిక శోభను తీసుకు రావడానికి మొదటి దశలో 11 పుణ్యక్షేత్రాలకు 1300 కోట్లు ఖర్చు చేస్తోంది… వేములవాడలో ప్రధాన ఆలయమే గాకుండా అనుబంధ బద్దిపోచమ్మ గుడికీ 20 కోట్లు పెడుతున్నారు… వేలాది మంది బోనాలు సమర్పించేలా ఇంకా నిధులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది…

ఆల్రెడీ వేములవాడ ఆర్జిత సేవల్ని భీమేశ్వరాలయంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే… బాసర గుడి ఇదుగో ఇలా మారబోతోంది…

బాసర

ఒక భక్తుడు 31 కోట్లను గుడి పునర్నిర్మాణానికి విరాళంగా ఇచ్చాడు… విశేషమే… ప్రభుత్వం 225 కోట్లు ఖర్చు పెట్టనుంది… పూర్తిగా కృష్ణ శిలలతో గుడిని పునర్నిర్మించనున్నారు. తమిళనాడులో శిల్పాలు తయారవుతున్నాయి…

బాసర(బాసర బాలాలయంలో అమ్మవారు)

బాసర(సూర్యపనేని సునంద్ – పద్మప్రియ దంపతులు 31 కోట్ల విరాళదాతలు)

భద్రాచలాన్ని ఏకంగా దక్షిణ అయోధ్యగా మార్చబోతున్నారు… దాదాపు 586 కోట్ల ఖర్చు… ప్రధాన ఆలయంతోపాటు పర్ణశాలకూ కొత్త కళ… వచ్చే గోదావరి పుష్కరాల నాటికి భద్రాచల రామయ్యకు కొత్త ఇల్లు గ్యారంటీ…

vemulawada(వేములవాడ పాత రూపు)

ఇలా గోదావరి తీరంలో ఉండే ప్రతి గుడీ ఆధ్యాత్మిక పర్యాటక స్థలం కాబోతోంది… ధర్మపురితోపాటు కాళేశ్వర స్వామి గుడినీ తీర్చిదిద్దనున్నారు… ధర్మపురికి 50 కోట్లు, కాళేశ్వర క్షేత్రానికి 100 కోట్లు… అమరచింత పరిధిలోని కురుమూర్తి ఆలయం, కొడంగల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి, ఇతర గుళ్లకూ నిధులు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కేటాయిస్తున్నారు… వికారాబాద్ వీరభద్రస్వామి గుడిని యాదగిరిగుట్ట రేంజులో డెవలప్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకున్నారు…

bhadrachalam(భద్రాచలం గుడి)

ఇవి గాకుండా 2027-28 లో జరిగే గోదావరి పుష్కర ఏర్పాట్లకు 1000 కోట్లు కావాలి… మాస్టర్ ప్లాన్ తయారువుతున్న గుళ్లు… కొమురవెల్లి మల్లన్న, తాడ్‌బంద్ అంజన్న, ఐనవోలు మల్లన్న, జుబ్లీహిల్స్ పెద్దమ్మ, జమలాపురం వెంకన్న, మడికొండ రామలింగేశ్వరస్వామి, కర్మన్‌ఘాట్ అంజన్న తదితరాలు… యాదగిరిగుట్టలో 50 కోట్లతో కంచి కామకోటి పీఠం పర్యవేక్షణలో వేద పాఠశాల…

temples

వీటికితోడు మూసీ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ దగ్గర… మంచిరేవుల (Manchirevula) వద్ద ఉన్న చారిత్రక మచిలేశ్వర వీరభద్రదేవాలయ ప్రాంగణంలో భారీగా ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు… ఏకంగా 100 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు… విశేషమైన ఆధ్యాత్మిక ప్రగతి!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Telangana’s Spiritual Renaissance – Revanth Vision for Grandeur
  • బాగా నచ్చిన వార్త ! ఒక కప్పు కింద ఆరుగురు అత్తలు- 20 మంది కోడళ్లు!!
  • తెలంగాణకు నూతన ఆధ్యాత్మిక శోభ – రేవంత్ రెడ్డి భక్తి పర్యాటకం!!
  • కన్నెపల్లిపై అదే స్క్రిప్టు – అదే ప్రహసనం — కాకపోతే ఫేస్ మారింది!!
  • కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది…
  • ఏ కెరటం ఏ తీరానికి చేరుతుందో – ఈ మోహిని ఇప్పుడేం చేస్తోందంటే?
  • బాలమురళి పాడేది అసలు సంగీతమే కాదు- హైకోర్టులో ఓ కేసు …
  • ఎగిసిన రంగుల కెరటాలు కొన్ని విరిగిపడటం… స్వయంకృతాలే..!
  • 5 కోట్ల బంగారు రామచరితమానస్ – అయోధ్య గుడిలో మాయం !
  • కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions