.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు డిస్కమ్ ఏర్పాటు చేసింది… రెగ్యులేటరీ కమిషన్ పరిశీలనలో ఉంది… సరే, ప్రభుత్వం ఏం చేసినా ఈకలు పీకి, వ్యతిరేకించాలనే ఓ భ్రమాత్మక ప్రతిపక్ష సూత్రంతో ఉంటుంది కదా బీఆర్ఎస్.., పైగా వీటిల్లో హరీశ్ రావు ప్రసిద్ధ హస్తుడు… అక్కడ ముంబై- పూణె మధ్య రోడ్లు, రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి అంటే కూడా రేవంత్ రెడ్డి అవినీతి, అసమర్థతే కారణమని చెప్పగలడు…
సేమ్, రైతు డిస్కమ్ మీద కూడా ఏదేదో మాట్లాడాడు, తీరా కవిత రెగ్యులేటరీ కమిషన్ ఎదుట తన వాదన వినిపించడానికి వెళ్తుందని తెలియగానే తను స్కిప్… ఆమెకు ఎదురుపడాల్సి వస్తుందని జంకు… సరే, మీడియాలో వ్యతిరేకించాడు…
Ads
ఇక కేటీయార్ అయితే తన నోటికి ఎంతొస్తే అంత… స్మార్ట్ మీటర్లు పెడతారు, ఉచిత విద్యుత్తు రద్దు చేస్తారు, నాణ్యమైన విద్యుత్తు ఇక కలే అని ఏవేవో చెప్పాడు, తనకు ఇరిగేషన్, పవర్, ఫైనాన్స్ వంటి కీలక సంక్లిష్ట విషయాల్లో సబ్జెక్టు తక్కువే పాపం… పోనీ, మేం స్మార్ట్ మీటర్లు పెట్టకపోతే నీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా అని రేవంత్ సవాల్ విసిరితే బావామరుదుల నుంచి నో ఆన్సర్…
నిజానికి దాని పేరు రైతు డిస్కమ్ అయినా, దాని ఉద్దేశం వేరు… ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్న కనెక్షన్లను, అంటే రైతు విద్యుత్తు, సాగునీటి ఎత్తిపోత పథకాల విద్యుత్తు, మిషన్ భగీరథ విద్యుత్తు, ఇతరత్రా ఫ్రీ బాపతు కనెక్షన్లను దీని పరిధిలోకి తీసుకువస్తారు… మిగతా నార్త్, సౌత్ డిస్కమ్స్ ఇక వయబుల్ అయిపోవాలి, రుణాలు తెచ్చుకోవాలి… సొంతంగా స్వయంసమృద్ధి సాధించాలి…
అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..? ఆఫ్ పీకవర్స్‌లో పవర్ ఎక్స్‌ఛేంజీల్లో చాలా చీప్‌గా పవర్ దొరుకెుతోంది… దేశమంతా బాగా విస్తరించిన హైడల్, సోలార్, విండ్, బయోమాస్, రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల విద్యుత్తు చౌకగా దొరుకుతోంది… కొన్నిసార్లు మరీ యూనిట్‌కు 2 లేదా 3 రూపాయలకే దొరుకుతుంది… కొన్నిసార్లు మరీ ఆలోపే… మరి దాంతో మనకు ఏం ఫాయిదా అంటారా..? ఉంది…
ఏటా ఈ సబ్సిడీ విద్యుత్తు కోసం ఏడెనిమిది వేల కోట్ల భారం ఖజానాపై పడుతోంది… సింపుల్‌గా డిస్కమ్స్‌కు చెల్లించాల్సిన డబ్బును కేసీయార్ బకాయి పెట్టేశాడు… అది పెరిగీ పెరిగీ దాదాపు 40- 50 వేల కోట్లకు చేరుకుంది… ఇరిగేషన్, హైదరబాద్ వాటర్ బోర్డ్, మిషన్ భగీరథ బకాయిలే ఎక్కువ… డిస్కమ్స్ అప్పుల్లో, నష్టాల్లో కూరుకుపోయాయి… వయబుల్ గాకుండా దేశంలోకెల్లా నష్టదాయక డిస్కమ్స్‌గా మారిపోయాయి, ఇక ఎవడూ రూపాయి అప్పు ఇచ్చే సిట్యుయేషన్ లేదు… కేసీయార్ చేసిన నష్టం అంతా ఇంతా కాదు, ప్రతి రంగంలోనూ!
ఇప్పుడు ఈ సబ్సిడీ భారం మోస్తున్న పథకాల కనెక్షన్లను ప్రతిపాదిత రైతు డిస్కమ్ పరిధిలోకి తీసుకొస్తే… చీప్ పవర్ ను నేరుగా (పీపీఏల గొడవలు, కొనాల్సిందే అనే కమిట్మెంట్లు లేవు కదా)… పవర్ ప్లాంట్లు లేదా పవర్ ఎక్స్‌చేంజీల నుంచి తీసుకోవచ్చు… దీనికి సాయపడేది ఓపెన్ యాక్సెస్ విధానం… అంటే నేరుగా ప్లాంటు నుంచో, ఎక్స్‌చేంజ్ నుంచో తీసుకుని వాడుకుంటే… గ్రిడ్ ఛార్జీలు, ట్రాన్స్‌మిషన్ చార్జీలు అదనంగా భరిస్తే చాలు, చీప్ పవర్ మన సొంతం…
యాదాద్రి, భద్రాద్రి పవర్ మరీ ఆరేడు రూపాయలు పడుతోంది… ఇది కేసీయార్ మరో బ్లండర్… ఒకటి మరీ కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టారు… సో, చీప్ పవర్ వచ్చినప్పుడు, ఆ పవర్ కొని, ఖజానాపై భారం తగ్గించుకోవాలనేది రేవంత్ ప్రభుత్వం ఆలోచన… ఈ కోణంలో రైతు డిస్కమ్ సరైన అడుగు…
తరువాత నార్త్, సౌత్ డిస్కమ్స్ ఎలా వయబుల్ అవుతాయి, ఏం చేయాలనేది వేరే సంగతి… ప్రతిపక్షాలకు (బీజేపీలో పవర్ సబ్జెక్టు తెలిసినోళ్లే లేరు, బీఆర్ఎస్ అబద్ధాల స్పెషలిస్టు) మాత్రం ప్రతిదీ రచ్చ చేయడం అలవాటైపోయింది..!!
Share this Article