.
ఆయ్ఁ … ఏడాది దాటింది, ఐనా ఎవరూ వచ్చి సీఎంను కలవలేదు, వాటీజ్ దిస్..? ఇది రిటర్న్ గిఫ్టా..? ఛల్, ఈ టాక్సులు, ఈ లీజుల బాగోతాలు ఏమేం ఉన్నాయో తవ్వండి… హమ్మా, ఇంత అమర్యాదా..? అని ఉరిమాడు పవన్ కల్యాణ్…
సరే, ఇండస్ట్రీ మనిషి, పైగా పవర్‌లో ఉన్నాడు… ఏదో వచ్చి కలవాలని అంటున్నాడు..? ఎందుకు కలవాలి..? కలిసి ఏం చేయాలి..? పైగా చంద్రబాబును కలవాలని పవన్ కల్యాణ్ ఆదేశించడం ఏమిటి..? ఐతే గియితే యాక్టింగ్ సీఎం లోకేష్ బాబు గారు చెప్పాలి…
Ads
అసలు ఇండస్ట్రీ మొత్తం చంద్రబాబు అండ్ క్యాంపే కదా… మళ్లీ కొత్తగా కలిసి విధేయతను నిరూపించుకోవడం దేనికి..? నిరూపించుకోవాలంటే ఇంకేం చేయాలి..? ఈ వింత ప్రశ్నలు ఓ మిస్టరీ… ఏపీ రాజకీయాల భాష, అది అర్థం కాదు, అందులోనూ పవన్ కల్యాణ్ అస్సలు అర్థం కాడు…
అబ్బే, తన సినిమా వస్తోంది కదా హరిహర వీరమల్లు అని… దాన్ని దెబ్బతీయడానికి పెద్ద తలకాయలు కుట్రలు చేస్తున్నాయి, అందుకే కొరడా తీస్తున్నాడు అని ఓ వాదన… ఎగ్జిబిటర్ల సమస్యను హఠాత్తుగా సాకుగా తీసుకుని పవన్ కల్యాణ్ సినిమాను నష్టపరచాలని చూస్తున్నారని ఆ వాదన సారాంశం… కానీ అది కాదు, ఏదో పెద్దదే ఉంది… అది అంత త్వరగా అర్థమయ్యేది కాదు… ఎవరూ బయటపడటం లేదు…
అసలు టాలీవుడ్ అంటే హైదరాబాద్… నిర్మాణం, ప్లానింగ్, ఫండింగ్ మన్నూమశానం అంతా హైదరాబాదే, జస్ట్ ఎగ్జిబిషన్ మాత్రమే రెండు రాష్ట్రాల్లో… వోకే, ఇప్పుడు దేశంలో, విదేశాల్లో కూడా… మనం పాన్ వరల్డ్ కదా…
సినిమాకు పరిశ్రమ హోదా ఇవ్వాలని ఆలోచిస్తుంటే మీరేమో మాకే నష్టం చేయాలని చూస్తున్నారు, సరే చూసుకుందాంలే అన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నాడనేది సినిమా రంగ పరిశీలకుల విశ్లేషణ… పరిశ్రమ హోదా ఇస్తే గిస్తే తెలంగాణ ప్రభుత్వం ఇస్తే ఏమైనా ఫాయిదా..? ఏపీ ప్రభుత్వ పాత్ర పరిమితమే కదా… పైగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం లేదు సరే, వాళ్లకు ఏమిచ్చారని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి చంద్రబాబుకైనా, పవన్ కల్యాణ్‌కైనా..?!
మొన్నటిదాకా ఆ నలుగురు అని పిలిచేవాళ్లు ఓ సిండికేట్‌ను… అంటే థియేటర్లన్నీ వాళ్ల లీజుల గుప్పిట్లో ఉన్నాయి… అందుకే వాళ్లు థియేటర్లు ఇస్తేనే సినిమా విడుదల, అందులోనూ రాగద్వేషాలు… ఓరకంగా నియంతృత్వం… వాళ్లు చెప్పిందే టాలీవుడ్‌లో శాసనం… వాళ్లే నిర్మాతలు, వాళ్లే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్లే ఎగ్జిబిటర్లు, వాళ్లే బయ్యర్లు… వాళ్లే అంతా…
ఎవరు ఆ నలుగురు..? దిల్ రాజు, ఆసియాన్ సునీల్, అల్లు అరవింద్, సురేష్ బాబు… తాజాగా మరో పేరును పైకి తీసుకొస్తున్నారు నట్టి కుమార్ వంటి చిన్న నిర్మాతలు… ఆ పేరు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అట… ఈ నలుగురు అసలు ఓ అయిదో ప్లేయర్‌ను రానిస్తారా..? ఏమో, గోదావరి జిల్లాల్లో థియేటర్లను రెడ్డిగారి గుప్పిట్లోకి తెచ్చుకున్నారట…
ఆయనేమో రాజకీయంగా కూటమికి ప్రత్యర్థి… కానీ కొన్ని కేసుల్లో కూటమి ప్రభుత్వ ముఖ్యులతో ‘సంప్రదింపులు’ జరుపుకుని సెటిల్ చేసుకున్నాడనీ అంటారు… ఐనా వీళ్లంతా డబ్బు మనుషులు కదా… కావాలని రాజకీయ కారణాలతో అధికారంలో ఉన్న పవన్ కల్యాణ్‌తో గోక్కుంటారా..? ఒకవేళ పవన్ కల్యాణ్ గోకినా వణికిపోతారా..? సో, అసలు కారణమేదో ఉంది…
‘‘సినిమా పరిశ్రమ కు హోదా ఇవ్వాలనే ఆలోచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు సినీ రంగం ఇచ్చిన రిటన్ గిఫ్ట్ ను తగిన విదంగా స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు’’ అని నిన్నటి పవన్ కల్యాణ్ ఆఫీస్ ప్రెస్‌నోట్‌లో ఉన్న ఈ పాయింట్ సీరియస్సే…
నిజానికి ఎగ్జిబిటర్ల సమస్య జెన్యూన్… మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్నట్టే వసూళ్లలో వాటా ఇవ్వండి, నామమాత్రం అద్దెలతో మాకు ఇక కుదరదు అంటున్నారు, లేకపోతే థియేటర్లు నడిపించే పరిస్థితి లేదనీ అంటున్నారు… అవును, మల్టీప్లెక్సుల పట్ల ప్రేమ దేనికి..? సింగిల్ స్క్రీన్ల మీద వివక్ష దేనికి..? ఈ సమస్య మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత సినిమా మనిషిగా, ప్రభుత్వ ముఖ్యుడిగా, సినిమా మంత్రి బాసుగా పవన్ కల్యాణ్‌కు లేదా..?
సేమ్, మల్టీప్లెక్సులకు ఇచ్చినట్టే సింగిల్ స్క్రీన్లకూ వాటాలు ఇస్తే… నిర్మాతలకు నష్టం, కానీ ఎగ్జిబిషన్ ఆ నలుగురు ప్లస్ కొత్తగా అయిదో వ్యక్తి చేతుల్లో ఉంది కాబట్టి వాళ్లకు లాభం… ఇదీ పంచాయితీ… చర్చలు, భేటీలు ఆలోచనల్లో ఉండగానే పవన్ కల్యాణ్ ఉరిమేసరికి అన్నీ ఆగిపోయాయి… ఏపీ ప్రభుత్వంతో అక్కడి థియేటర్లు కూడా గోక్కోవు కాబట్టి తాత్కాలికంగా బంద్, సమ్మె ఏమీ లేవని వాళ్లకు వాళ్లే స్టే ఇచ్చుకున్నారు…
చిన్నాచితకా, ఔట్ డేటెడ్ నిర్మాతలతో ఓ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, దాని మాటకు విలువ లేదు, అందుకని బిగ్, యాక్టివ్ నిర్మాతలు ఓ కూటమిగా మారినట్టు (ప్రొడ్యూసర్స్ గిల్డ్) మరో సమాచారం… ఈ ఎగ్జిబిటర్ల విషయంలో అందులోనూ విభేదాలు… ప్రొడ్యూసర్స్ కమ్ ఎగ్జిబిటర్స్ అలియాస్ సిండికేట్ వ్యవహార తీరుతో విసిగిపోయిన మరో ఏడుగురు యాక్టివ్, బిగ్ ప్రొడ్యూసర్స్ విడిగా కూటమి కట్టారట… వాళ్లకు వసూళ్లలో ఎగ్జిబిటర్లకు వాటాలు ఇవ్వడం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్లకు నష్టం… సో, ఆ నలుగురు ఎగ్జిబిటర్ల సిండికేట్‌తో గ్యాప్ వస్తోంది అందుకే… ఇంతకీ వాళ్లెవరు..? (ఆ నలుగురులాగా ఆ ఏడుగురు ఎవరు..?) ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం చేస్తోంది..? హేమిటో…
మైత్రి మూవీ మేకర్స్ నుండి రవి, నాగ వంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), సుప్రియ (అన్నపూర్ణ స్టూడియోస్), స్వప్నా దత్ (వైజయంతీ మూవీస్), సాహు గారపాటి (చిరంజీవి సినిమా నిర్మాత), చెరుకూరి సుధాకర్ (ప్యారడైజ్ ప్రొడక్షన్స్), మరొకరు బాపినీడు అట… ప్రధానంగా చంద్రబాబు సామాజికవర్గమేనా..? సరే…
అల్లు అరవింద్ నిర్మాత ప్లస్ ఎగ్జిబిటర్, సిండికేట్ మెంబరే… ఐనా తటస్థంగా కనిపిస్తున్నాడు… కాగల కార్యం ఎవరో ఒకరు తీరుస్తారులే అన్నట్టు… ఒకవైపు బావ గారి అధికార తమ్ముడు గారు… ఎటూ గోక్కోవడం ఇష్టం లేదు… కానీ ఒక్కటి మాత్రం నిజం…
దిల్ రాజు రేవంత్ రెడ్డికి దగ్గర, ఫిలిమ్ కార్పొరేషన్ చైర్మన్‌గా తెలంగాణలో తన మాట, తన కోరికను చలామణీ చేయించుకోగలడు, కానీ ఏపీలో..? అదే వేచి చూడాలి…
ఇండస్ట్రీ మనస్తాపానికి గురైతే, నష్టపోయే సిట్యుయేషన్ వస్తే చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతుంది… పోలవరం, అమరావతి, జీబీ లిఫ్టు వంటి బృహత్తర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తనకు ఆ *యవ్వారాలు* చాలు, ఈ పల్లీబఠానీ ఇష్యూలోకి సాధారణంగా జోలికి రాడు… కానీ ఒత్తిడి పెరిగితే తను జోక్యం చేసుకుంటే, అది కూటమిలోనే అంతర్గతంగా విభేదాలకు, మనస్పర్థలకు, ఇష్యూలకు దారితీసే ప్రమాదం అయితే ఉందట..!! ఈ మొత్తం వ్యవహారంలో చిన్న నిర్మాతకో, ఔత్సాహిక నిర్మాతకో ఒరిగేది ఏమైనా ఉందా.,? జీరో..!!
Share this Article