Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…

June 2, 2025 by M S R

.

Pardha Saradhi Potluri…. క్యారేట్ తింటే కళ్లకు మంచిది! రాత్రిపూట చీకటిలో కూడా బాగా చూడగలుగుతారు! ఇది బాగా వాడుకలో ఉన్న ప్రచారం! క్యారట్ లో విటమిన్ A తో పాటు బేటా కెరటోన్ ఉంటుంది కాబట్టి కళ్ళకి మంచిదే!

కానీ అడవిలో ఉండే చెంచులు, యానాదులు రాత్రిపూట కూడా బాగా చూడగలుగుతారు. అడవిలో లైట్లు ఉండవు! నిజానికి ఎలాంటి కృత్రిమ కాంతి లేకుండా అడవిలో సహజసిద్ధంగా ఉంటే కాంతిలో ఉండడం వలన అక్కడ నివసించే వారి కనుపాప ( IRIS ) విచ్చుకొని ఉంటాయి ఎక్కువ కాంతిని రేటినా మీదకి ప్రసరించడానికి!

Ads

చీకటి పడే కొద్దీ కనుపాపలు ఇంకా ఎక్కువగా విప్పారతాయి కాబట్టి రాత్రిపూట నగరలాలలో ఉండేవాళ్ళకంటే బాగా చూడగలుగుతారు చెంచులు, యానాదులు. వాళ్లకి విటమిన్స్ అంటే ఏమిటో తెలియదు, క్యారట్ అంటే ఏమిటో తెలియదు. దాదాపుగా అన్ని ఆకుకూరలలో కూడా విటమిన్ A ఉంటుంది! కానీ క్యారట్ కే ఎందుకు ఎక్కువ ప్రచారం జరిగింది?

క్యారట్ తింటే కంటి చూపు బాగవుతుంది అనే పుకారు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ప్రచారం చేయబడ్డది!

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి!
జెర్మన్ బాంబర్లు లండన్ మీద బాంబులు వేసి తిరిగి క్షేమంగా వెళుతున్నాయి. ఎలాగైనా జెర్మన్ బాంబర్లని లండన్ మీదకి దాడికి వచ్చే ముందే కూల్చేయాలని అందుకు ఏం చేయాలో త్వరగా చర్యలు తీసుకోమని బ్రిటన్ సైంటిస్టుల మీద ఒత్తిడి తెచ్చింది ప్రభుత్వం.

14th నవంబర్, 1940 రాయల్ ఎయిర్ ఫోర్స్ 604 స్క్వాడ్రన్ కి చెందిన బ్యూ ఫైటర్ ( Beaufighter) మొత్తం 12 జెర్మన్ బాంబర్లని దారిలో ఉండగానే కూల్చివేసింది!

AIR ( Airborne Intercept Radar ) ని మొదటిసారిగా బ్యూఫైటర్ కిా అమర్చడం వలన రాత్రిపూట దాడి చేయడానికి వచ్చిన జెర్మన్ బాంబర్లని 8 కిలోమీటర్ల దూరం నుండే గుర్తించి కూల్చివేయగలిగింది బ్రిటన్. నిజానికి బ్రిటన్ సైంటిస్టులు అప్పటికే ట్రయల్ రన్ చేశారు AIR మీద. ఎయిర్ బోర్న్ ఇంటర్సెప్ట్ రాడార్ ని విజయవంతంగా వాడింది బ్రిటన్ 1940 లో!

మొత్తం 12 జెర్మన్ బాంబర్లు బ్రిటన్ మీదకి దాడికి వెళ్ళినప్పుడు కూలిపోవడం, అదీ రాత్రిపూట చీకటిలో, బ్రిటన్ పైలట్లు ఎలా చూడగలిగారు అనే సందేహం జెర్మన్ సైనిక జెనరల్స్ కి వచ్చింది!

మరోవైపు బ్రిటన్ యుద్ధ వ్యూహకర్తలకి తాము ఎయిర్ బోర్న్ ఇంటర్సెప్ట్ రాడార్ ని కనుగొన్నామని, అది 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెర్మన్ బాంబర్లని గుర్తించగల్గుతున్నది అనే విషయం రహస్యంగా ఉంచదలచి పత్రికలలో, రేడియోలో, కరపత్రాల ద్వారా విస్తృతంగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు ఇలా…

కాట్స్ ఐ ( Cat’s Eye) కన్నింగ్ హామ్ అనే బ్రిటన్ పైలట్ 5 జెర్మన్ బాంబర్లని తాను ఒక్కడే రాత్రిపూట కూల్చివేయగలిగాడు అనీ, కన్నింగ్ హామ్ క్యారట్స్ ఎక్కువగా తినడం వలన అతని కంటి చూపు బాగా మెరుగుపడి రాత్రిపూట పిల్లి లాగా బాగా చూడగలుగుతున్నాడు అని!

Cat’s Eye Cunningham అనే బ్రిటన్ పైలట్ అసలు పేరు John Cunningham ( జాన్ కన్నింగ్ హామ్).
Cat’s Eye అనేది అప్పట్లో బ్రిటన్ పత్రికలు ఇచ్చిన బిరుదు!

So..! కారట్స్ తినడం వలన బ్రిటన్ పైలట్లు చీకటిలో బాగా చూడగలుగుతున్నారు అనే ప్రచారాన్ని జెర్మన్ సైనిక జెనరేల్స్ నమ్మారు! బ్రిటన్ మాత్రం ఎయిర్ బోర్న్ ఇంటర్సెప్టింగ్ రాడార్ విషయాన్ని కొద్ది నెలల పాటు రహస్యంగా ఉంచగలిగింది. చివరికి పత్రికలు కూడా కారట్ ప్రచారాన్ని నమ్మేసి విస్తృతంగా ప్రచారం చేశాయి!

క్యారెట్లు తింటే కళ్ళు బాగుపడేట్లు అయితే ఈ రోజున ఇన్ని కంటికి సంబంధించి స్పెషలిటీ హాస్పిటల్స్ ఎందుకు ఉన్నాయి?

యుద్ధం జరుగుతున్నప్పుడు సైనిక వ్యూహకర్తలు రకరకాలగా ప్రచారాలు చేస్తారు, వాటికి విలువ ఉంటుంది, అది అబద్ధమైనా నిజమైనా సరే!

ఎయిర్ బోర్న్ ఇంటర్ సెప్ట్ రాడార్ తో మేము 12 జెర్మన్ బాంబర్లని కూల్చేసాము అని బ్రిటన్ గర్వంగా చెప్పుకోవచ్చు కదా? అప్పటికి అలా చెప్పడం మంచిది కాదు, ఎందుకంటే జెర్మన్లు జాగ్రత్త పడి దానికి విరుగుడు కనిపెడతారు అనే భయం వల్ల… 1945 లో యుద్ధం ముగిసేవరకూ, అంటే అయిదేళ్ల పాటు అసలు నిజం బయటపెట్టలేదు బ్రిటన్!

మరో విషయం రహస్యంగా ఉంచగలిగింది బ్రిటన్… అది వెస్ట్ సెసెక్స్ ( West Sussex) లోని చిచెస్టర్ (Chichester) దగ్గర గ్రౌండ్ కంట్రోల్డ్ ఇంటర్ సెప్షన్ (GCI ) ఆపరేటర్లు లండన్ మీదకి దాడి కోసం వచ్చే బాంబర్లని ముందుగానే పసిగట్టి… రేడియో ద్వారా అప్పటికే ఆకాశంలో ఎగురుతున్న బ్రిటన్ ఫైటర్ విమాన పైలట్లకి సమాచారం ఇవ్వడం వల్ల 5 జెర్మన్ బాంబర్లు west సెసెక్స్ దగ్గర కూల్చివేయగలిగాడు పైలట్ కన్నింగ్ హామ్! .సెసక్స్ దగ్గర ఒక చిన్న ఇంట్లో GCI ని ఏర్పాటు చేసింది బ్రిటన్ కానీ ఎవరికీ తెలియదు!
********************

CDS ( Chief of Defence Staff ) జెనరల్ అనిల్ చౌహన్!
శనివారం సింగపూర్ లో జరిగిన భద్రతా సమావేశం షాంగ్రీ- లా ( Shangri- La ) అయిన తరువాత రాయిటర్స్ మరియు బ్లామ్ బెర్గ్ వార్త సంస్థల విలేఖరులు అడిగిన ప్రశ్నలకి జెనరల్ అనిల్ చౌహన్ సమాధానం ఇస్తూ May 7 న పాకిస్తాన్ మీద చేసిన దాడిలో మేము జెట్ ఫైటర్స్ ని కోల్పోయాము అని అన్నారు!

కానీ అవి ఎన్నో చెప్పలేదు. We lost అని అనలేదు డౌన్డ్ అని అన్నారు! Lost అంటే అవి ఇక పనికి రావు కానీ డౌన్డ్ అంటే? డౌన్డ్ అంటే కూడా కూలిపోయింది అనే అర్ధంలోనే వాడతారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్!

May 11 న ఎయిర్ మార్షల్ AK భర్తి, డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ మాట్లాడుతూ మన పైలట్స్ అందరూ క్షేమంగానే బేస్ కి తిరిగి వచ్చారు అని ప్రకటించారు విలేఖరుల సమావేశంలో! ఇదే విషయాన్ని నిన్న సింగపూర్ లో CDS జెనరల్ అనిల్ చౌహన్ ప్రస్థావించారు!

అంటే పైలట్లు క్షేమంగా బేస్ కి తిరిగి వచ్చారు అంటే అది మిసైల్ దాడి అయిండదు. మరి ఇంకేమై ఉంటుంది?

1.పైలట్ తప్పిదం – Pilot Error.
2.వ్యూహత్మక తప్పిదం లేదా కమాండ్ సెంటర్ తప్పిదం – Strategy Error or Command Error.
3.టెక్నీకల్ ఫెయిల్యూర్ లేదా ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ – Technical failure or Equipment failure.
4. శత్రు దేశపు ఆధిపత్యం – Out Right Air Superiority OAS.
ఒకసారి అన్ని దేశాల జెట్ ఫైటర్స్ నష్టాలని పరిశీలిస్తే 95% పైలట్ తప్పిదాల వల్లనే నష్టాలు సంభవించాయి!

మరో మూడు శాతం యుద్ధ వ్యూహకర్తల తప్పు వలన ఫైటర్స్, పైలట్లు కూడా నష్టపోయారు. కేవలం 2% మాత్రమే అవతలి దేశపు విమానాలు సుపీరియర్ గా ఉండడం వలనే నష్టపోయాయి! ఈ 2% లో లిబియా, ఇరాక్ దేశాలతో జరిగిన యుద్ధంలో రెండు దేశాలూ అవుట్ డేట్ అయిన సోవియట్, రష్యన్ వెపన్స్ తో అమెరికాతో పాటు కెనడా ఇతర యూరోపియన్ దేశాలు కలిసి దాడి చేయడం వలన ఎయిర్ సుపీరియరిటీ దొరికింది!

వియత్నాం అమెరికా యుద్ధంలో అమెరికన్ జెట్ ఫైటర్స్ పిట్టల్లా రాలిపోవడమే కాదు పైలట్లు కూడా చనిపోయారు అప్పట్లో. వియత్నాం Mig 21 లతో అమెరికన్లని ఎదుర్కోవడమే కాదు అమెరికన్ పైలట్లని భయపెట్టారు వియత్నాం పైలట్లు. కానీ షరా మామూలుగానే తన టెక్నాలజీని నిందించకుండా తన పైలట్ల తప్పిదం వలనే ఎక్కువ నష్టం కలిగింది అని ప్రకటించింది అమెరికా!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…
  • ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…
  • ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
  • విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…
  • ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…
  • సారీ… నాటి నాయకన్‌కు ఆమడల దూరంలో ఆగిపోయింది ఇది..!
  • ఐపీఎల్… ఇదొక వికృత క్రీడ… ఆటగాళ్ల వేలంవెర్రి… ఓ పిచ్చి…
  • ఈ పిచ్చిది ఏదో చెబుతుంది… గుడ్డిగా ఫాలో అయ్యారో, బుక్కయిపోతారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions