.
Anasuya: ఆ సుఖం కోసం మూత్రం ఆపుకోవాలి… అనసూయ కామెంట్స్ వైరల్!…. అంటూ ఓ సైట్ హెడింగ్… ఏ సుఖం కోసం అనడక్కండి పాపం… ఇప్పుడు అందరి బాట యూట్యూబ్ చానెళ్ల థంబ్ నెయిల్స్ బాటే కదా… దాన్నలా వదిలేస్తే… వార్త కాస్త విచిత్రంగా అనిపించింది…
అసలే అనసూయ సోషల్ మీడియో ధోరణి కాస్త చిత్రం… బికినీలు, కురచ దస్తులు గట్రా వేసుకుని, ఎక్స్‌పోజ్ చేస్తుంది… ఇదేమిటమ్మా అని ఎవరైనా నసిగితే నా బట్టలు నా ఇష్టం, నా మొగుడికే లేని అభ్యంతరం మీకేంటి అని ఇంతెత్తున లేస్తుంది…
Ads
ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తే చాలు, రేయ్, నీ మీద సైబర్ క్రైమ్ కేసు పెడతాను అంటుంది… అక్కడికి వాళ్లకు వేరే పనేమీ లేదు… ఇవి చూడటానికే ఆ విభాగం అన్నట్టు..! చివరకు ఆంటీ అన్నా సరే ఆమెకు బూతులాగే వినిపిస్తుంది… వెరసి ఆమె ఓ డిఫరెంట్ సోషల్ కేరక్టర్…
అసలే అనసూయ… ఈమధ్య రాజేంద్ర ప్రసాద్ ప్రసంగాల ప్రభావం ఏమైనా పడిందో ఏమో ఫాఫం… ఇంకాస్త విచిత్రంగా వ్యవహరిస్తోంది… ఇప్పుడు మనం చెప్పుకోవాలని అనుకుంటున్న ‘సుఖం- మూత్ర విసర్జన’ వార్త అదే…
వార్త సారాంశం ఏమిటయ్యా అంటే… కొత్త గృహప్రవేశం, కొడుకు ఉపనయనం ఎట్సెట్రా పనుల్లో బిజీగా ఉండి అవే ఫోటోలు, అవే వీడియోలు షేర్ చేసి మురిసిపోయిన అనసూయ… విచిత్రంగా తొలిసారి చీరకట్టులో దిగిన ఫోటోలను షేర్ చేసింది…
ఫోటోల్లో అందంగా బాగుంది గానీ… అవి కాదు, చీరకట్టుకోవడంలో ఉండే సమస్యలు, ఛాలెంజెస్ గురించి ఏదో ఇన్‌స్టాలో రాసుకొచ్చింది…
‘‘తొమ్మిది గజాల చీరెకట్టు సంప్రదాయానికి తిరుగులేదు, కాకపోతే 16 గంటల సుదీర్ఘ షూటింగుల్లో సరైన వేళల్లో మూత్రవిసర్జన సాధ్యం కాని సవాళ్లు వంటివి ఉన్నా సరే…’’ అని ఆమె రాతల సారాంశం…
అదే ఆశ్చర్యం… అనసూయ వంటి నటి షూటింగ్ గ్యాపులో ఉండటానికి క్యారవాన్ మస్ట్… అవసరమైతే తనే ఓ సొంత క్యారవాన్ మెయింటెయిన్ చేయగలదు… ఆమె నటించేవి ఎలాగూ పెద్ద సినిమాలే కాబట్టి ఆ నిర్మాతలు అన్నిరకాల ఏర్పాట్లు, సౌకర్యాలు కూడా కల్పించేవాళ్లే…
మరి ఈ మూత్రవిసర్జన కష్టాలేమిటో… హేమిటో ఫాఫం, అనసూయ ఎవరికీ అర్థం కాదు… ఇంతకుమించి ఉదాహరణ ఏముంటుంది..? చివరకు చీరకట్టుకూ మూత్రవిసర్జన కష్టాలకూ ముడిపెట్టింది… ఆ రాజేంద్ర ప్రసాద్ ప్రసంగాలు ఎక్కువగా ఫాలో కావద్దమ్మా…
Share this Article