Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాలుగో క్లాసులో గొడవ… 53 ఏళ్ల తరువాత తన్నుకున్నారు…

June 10, 2025 by M S R

.

చిన్నప్పుడు, స్కూల్‌లో చదువుకునే చిన్న వయస్సులో పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవడం కామన్… తరువాత వయస్సు పెరిగాక అసలు చాలామందికి అవేవీ గుర్తుండవు… లేదా మరిచిపోయి కలిసిపోతారు, మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు…

కానీ కొన్ని అలా ఉండవు… మన సగటు పాత తెలుగు సినిమాల్లో చూసినట్టు ఆ చిన్న వయస్సు నుంచే ప్రతీకారం పెరిగిపోతూ ఉంటుంది… ఇదీ అలాంటి వార్తే… ఉత్తర కేరళలోని కాసరగోడ్… 1972లో చిన్న పంచాయితీ… ఎవరి మధ్య..?

Ads

నాలుగో తరగతి చదువుకునే ఇద్దరు పిల్లల నడుమ గొడవ… నాటక్కల్లు అనే ప్రాథమిక పాఠశాలలో… బాబు (ఇప్పుడు 62 ఏళ్లు) అనే పిల్లాడు తన క్లాస్‌మేట్ బాలకృష్ణన్ (62) ను ఎందుకో కొట్టాడు… బాలకృష్ణన్ మనసులో అది అలాగే నిలిచిపోయింది… తిరిగి కొట్టలేదు, అసహాయుడు… కానీ ఎప్పుడో ఓసారి వీడిని తన్నాలనే కోరిక మాత్రం బాలకృష్ణన్‌లో పెరిగిపోయింది…

ఇద్దరూ ముసలోళ్లు అయిపోయారు… ఓరోజు బాబు ఒంటరిగా దొరికాడు… బాలకృష్ణన్ అప్పటికే తన దోస్త్ మాథ్యూతో కలిసి ప్లాన్ చేశాడు… బాబును పట్టుకుని డిష్యూం డిష్యూం వాయించేశారు… మొహంపై పంచులు, తిట్లు మాత్రమే కాదు, బాబు పారిపోతుంటే రాళ్లతో కొట్టారు… సదరు బాబు రెండు పళ్లూ విరిగాయి, నెత్తురు కారింది…

దెబ్బకు హాస్పిటల్ పాలయ్యాడు..,  బాబు హాస్పిటల్‌లో కన్నీటి పర్యంతం అవుతూ… ‘‘ఇది ఏనాటి మాటో… ఫోర్త్ క్లాసులో ఉన్నప్పుడు ఓరోజు ఎందుకో వాడిని కొట్టాను… కానీ నేను ఆరోజే మరిచిపోయాను, వాడు మరిచిపోలేదు… కడుపులో నామీద కోపం అలాగే ఉన్నట్టుంది… ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్టున్నాడు, నేను దొరకగానే వాడి దోస్త్‌తో కలిసి దాడి చేశాడు…’’ అంటున్నాడు… 

నిజానికి ఈ దాడిలో బాలకృష్ణన్‌కు సహకరించిన మాథ్యూ కూడా వీళ్ల క్లాస్ మేటే… బయటికి చూస్తే ఈ ముగ్గురూ మంచి ఫ్రెండ్స్‌లా కనిపించేవాళ్లు… కానీ లోలోపల ఉడికిపోతూనే ఉన్నాయి పాత కోపాలు… చివరకు పోలీస్ కేసు… ఎవరినీ అరెస్టు చేయలేదు గానీ… కేసు పెట్టుకుంటే పెట్టుకోనీ అని నవ్వేస్తున్నారు మాథ్యూ, బాలకృష్ణన్…

ఏమయ్యా, నువ్వు కేస్ విత్‌డ్రా చేసుకుంటావా అని పోలీసులు అడిగితే మాత్రం… లక్షన్నర పరిహారం ఇస్తే కంప్లయిట్ వాపస్ తీసుకుంటాను అంటున్నాడు బాబు… అందుకే అనేది… చిన్నప్పటి పంచాయితీలు అప్పుడూ మరిచిపోవాలి, తగాదాలు తెగిపోవాలి… లేకపోతే ఇదుగో ఇలా రాళ్లదాడులు, పోలీస్ కేసుల దాకా వస్తుంది కథ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions