Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జాతిని… ఆ వెగటు కూతల నిర్మాత పిచ్చి కూతలు మళ్లీ… కవరింగు…!

June 17, 2025 by M S R

.

ఒక పృథ్వీరాజ్, ఒక రాజేంద్ర ప్రసాద్… ఇలా బహిరంగంగా వేదికల మీదకు ఎక్కినప్పుడు… పిచ్చి కూతలకు దిగుతున్నారు… వీళ్లు సెలబ్రిటీలు, వీళ్లను ఆరాధించే పిచ్చి ప్రేక్షకగణం…

మరీ కంట్రవర్సీ ఎక్కువై, జనం బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తే ఏదో క్లారిటీ వీడియో రిలీజ్ చేయడమో, సారీ చెప్పడమో… మరి మాట్లాడేటప్పుడు సరైన సోయి ఉండాలిగా… 90 కొట్టి మరీ వేదిక ఎక్కాలా..? నాలుక మీద అదుపు లేకుండా కూయాలా..?

Ads

ఎస్‌కేఎన్ అని ఓ ప్రొడ్యూసర్… పూర్వాశ్రమంలో జర్నలిస్టు కూడానట… ఆమధ్య ఏదో ఫంక్షన్‌లో హీరోయిన్ కాయదు లోహర్‌ను ఉద్దేశించి… ఏమండీ మీపేరు ఏమిటీ, కాయలా పళ్లా అని ఓ వెకిలి కూతకు దిగాడు…

అంతకుముందు ఇకపై తెలుగు అమ్మాయిలను అస్సలు మా సినిమాల్లో తీసుకోం, బాగా అనుభవం వచ్చింది అన్నాడు… పరోక్షంగా వైష్ణవి చైతన్యను ఉద్దేశించి… ఏమో, ఎందుకో తనకే తెలియాలి… ఈ వ్యాఖ్యల్ని రేఖ భోజ్ కడిగిపారేసింది… అవును, పిచ్చి కూతలకు దిగాక ఇక గౌరవం ఏముంటుంది..?

మరోసారి హీరోయిన్ కేతిక శర్మను ఉద్దేశించి… ఎలాగూ మీ బాత్రూంతో మాకు యాక్సెస్ ఉండదు, ఇక్కడే పాట పాడండి అని మరో వెగటు కూత… పైగా అమ్మాయిలతోనే తనకు కంఫర్ట్ ఎక్కువట…

ఇప్పుడేమో ప్రభాస్ సినిమాకు జాతిని అని రాసి ఉన్న ఓ టీ షర్ట్ వేసుకొచ్చి… చూడండ్రా ఈ సినిమా రిలీజయ్యాక… అంటూ టీషర్ట్‌పై జాతిని అనే పదాన్ని చూపించాడు… నాలుక మీద అదుపు లేదని తెలుస్తూనే ఉంది…

సాధారణంగా ఫ్యాన్స్ నడుమ ‘జాతిని’ అనే పదాన్ని ఓ వెగటు తిట్టుగా వాడుతుంటారు… చీప్ టేస్ట్… ఈ ఎస్‌కేఎన్ మరీ పృథ్వీరాజ్, రాజేంద్రప్రసాద్‌కన్నా హీనంగా తయారయ్యాడు… మొగుడి పనితనం పెళ్లానికే తెలుస్తుందట…

ఇది కాస్తా నెటిజనం నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారితీయడంతో రెండుమూడు సైట్లకు వివరణ ఇచ్చినట్టున్నాడు… ‘అబ్బే, ఏ కులాన్నీ కించపరచడానికి కాదు, సినిమాలో జాతిని అనే పాట ఉంది, దాన్ని ప్రమోట్ చేయడం కోసం’ అంటున్నాడు…

తను మాట్లాడుతున్నప్పుడు ఆ టోన్ లేదు, ఆ సబ్జెక్టే కాదు… ఆ సినిమాలో పాట జాతిని అనే ప్రస్తావనే లేదు… ఏదో కవరింగు… చూస్తూ ఉండండి… ఏదో వేదిక మీద మళ్లీ ఏదో కూసి, మళ్లీ ఇలాంటి కవరింగులకే దిగుతాడు… టీవీ షోలలో ఎప్పుడూ ఓ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది కదా… రేయ్, ఎవుర్రా మీరంతా..!!

ఒక థియేటర్ ఎదుట నాన్న పళ్లమ్ముకునేవాడు… అక్కడ నా సినిమా పడాలి అనే కలకన్నాను అని దర్శకుడు… అదే రాజా సాబ్ తీసిన మారుతి చెప్పుకున్నాడు… స్పూర్తి, అదెంత పాజిటివిటీ… ఈ ఎస్‌కేఎన్ అనే కేరక్టర్‌వి ఎలాంటి చీప్ పబ్లిసిటీ అగచాట్లు… తేడా గమనించారా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జాతిని… ఆ వెగటు కూతల నిర్మాత పిచ్చి కూతలు మళ్లీ… కవరింగు…!
  • అరాచకం..! షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు..!!
  • వావ్… వాట్ ఏ క్రికెట్ మ్యాచ్… మూడు సూపర్ ఓవర్లతో ఫలితం…
  • దిల్ రాజు గారూ… మరి మీకూ బాధ్యత ఉండాలి కదా, మరిచారా..?!
  • మోడీ సైప్రస్ ఫోటో వెనుక… శత్రు తుర్కియేకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్..!!
  • జాగ్రత్త, ప్రభుత్వ సంస్థల పేరిట సైబర్ ఫ్రాడ్… పదిమందికీ షేర్ చేయండి…
  • లతా, ఎందుకు చేశావీ పని..? గాంధీ మునిమనమరాలు- ఓ ఫ్రాడ్ కేసు..!!
  • ‘సూపర్ సిక్స్’ ప్యాక్ రేవంత్ రెడ్డి… నిజంగానే ఇది చేస్తే మరింత మేలు..!!
  • పార్టీ జర్నలిస్టు వేరు- పార్టీ కార్యకర్త వేరు… తేడాను చెరిపేశారు…
  • వినోద రూపంలో సందేశం ఓ మంచి కళ… ఈ ఇద్దరు దొంగలు వాళ్లే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions