.
Srini Journalist ….. ఆంధ్రజ్యోతి పేరులో ఇంకా తెలంగాణ ఎందుకు ఉంది ? తెలంగాణజ్యోతిగా మారని ఆ పత్రికను ఎందుకు చదవాలి? ఇది బియారెస్ నేత మాట…
పేరులో తెలంగాణ పదం లేకపోతేనే, ఈ నేల మూలాలు కోల్పోవడమే ప్రామాణికం అయితే … ముందుగా
తెలంగాణ జాతికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత బియారెస్ దే . తన పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించి భారత అని ఎందుకు పెట్టుకున్నారో ?
ఆంధ్రప్రభ , ఆంధ్రపత్రిక , విశాలాంధ్ర ఇంకా చాలా పత్రికలున్నాయి . ఆ పేర్లతో . ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే కాదు.
Ads
తెలంగాణలో ఒక్కసారిగా నరేటివ్ మారడానికి కారణం అయిన మహా న్యూస్ ఛానల్ ని తప్పు పట్టాలి .
పొరపాటున thumbnails పెట్టాము అని ఆ యాజమాన్యం అంటోంది. ఒకసారి పెడితే పొరపాటు… రెండో సారి జరిగితే తప్పు … మూడో సారి జరిగితే అది అలవాటు… ఆ ఛానల్ లో ఇలాంటి అలవాట్లను గమనించాను చాలాసార్లు …
జర్నలిస్ట్స్ కి చాలా బాగా తెలుసు… వార్తలో ఒక తప్పు జరిగితే ఉద్యోగం పోతుంది అని… కానీ నిర్లజ్జగా , ఇష్టారీతిలో , వ్యక్తిత్వ హననం చేస్తూ , డిజిటల్ మీడియా ప్రొడ్యూసర్స్ … న్యూస్ కంటెంట్ ని జనాలపై వదులుతూ ఉంటే .. మన్ను తిన్న పాములా యాజమాన్యం ఉంటే తప్పు ఎవరిదో ?
విపరీతమైన మానసిక ధోరణితో పెట్టిన ఆ రాతలు, మళ్ళీ మళ్ళీ వస్తుంటే … యాజమాన్యం గమనించలేదు అంటే , ఆ ఛానల్ మొత్తం వ్యవస్థే కొలాప్స్ అయినట్లు కదా ? ఎవరో వచ్చి ఛానల్ పై దాడి చేస్తే తప్ప పొరపాట్లు తెలుసుకోము అంటే , ఇక దాడులే ప్రామాణికం కావాలా?
తెలంగాణ వడి బియ్యం సంప్రదాయంపైన ఆ ఛానల్ అధినేత లైవ్ లో తిండికి గతిలేక అనే రీతిలో ఏదో అన్నాడు అని బియ్యరెస్ నేత ఒకరు ఆరోపిస్తున్న వీడియో చూసా . నాకు తెలిసి చాలా రోజుల కింద ఆ మాట తాను అన్నారు అనుకుంట . కానీ మళ్లీ ఈ మధ్య అదే మాట అంటే .. నా అభిప్రాయం ఇదే…
పెళ్లి అయిన ప్రతి ఐదు ఏళ్ళకి ( కొందరు మూడు సంవత్సరాలకి కూడా వడి బియ్యం పోస్తారు ) తన ప్రాణం ఉన్నంత వరకు పుట్టింటితో అనుబంధం పోకుండా చూసే…. అత్యంత అద్భుతమైన సంప్రదాయం… మా దగ్గర ఎందుకు లేదు అని బాధ, సిగ్గు పడాల్సింది తానే …
తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు ఉన్న కాలంలోనే, అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కెసిఆర్ అన్నారు. .. టీయారెస్ ఇక ఉద్యమ పార్టీ కాదు .. ఫక్తు రాజకీయ పార్టీ అని …. ఆ పెద్దాయన ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం కోసం… ప్రజా సమస్యలే ఎజెండా అయ్యేలా చూద్దాం . ఆంధ్ర తెలంగాణ అంటూ .. మరాఠీ కన్నడిగలు … తమిళం కన్నడిగల లాగా విద్వేషాలు నింపుకోకుండా, పెరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీ .
అసలు ఆంధ్రుల కాళ్లల్లో ముల్లు విరిగితే పళ్లతీ తీస్తా అన్నారు కేసిఆర్ అప్పట్లో… రెండు రాష్ట్రాల మీడియా అకాడమీలు, ఛానళ్ల బాధ్యులతో ఉమ్మడి సమావేశం పెడితే బెటర్ అనుకుంట.
ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం మొదటి నుంచి ఒక లైన్ తీసుకుని వార్తలు ప్రచురిస్తూ వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో , ఆ పత్రిక ఎడిటర్ పూర్తి తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటే , అందుకు భిన్నమైన వార్తలు మొదటి పేజీలో వార్తలు రాసిన ధోరణి ఆ పత్రికది .
యాజమాన్యం లైన్ తన లైన్ కాదు అంటూ స్వతంత్రంగా వ్యవహరించిన ఎడిటర్ గొప్ప వారు. అటువంటి స్వేచ్ఛ ఉన్న ఆ పత్రికలో కెసిఆర్ ని మెచ్చుకుంటూ వార్తలు రావాలి అంటే … హిందూ పత్రికలో మోదీని మెచ్చుకుంటూ … నమస్తే తెలంగాణలో చంద్రబాబుని పొగుడుతూ వార్తలు రావాలి ఏమో . అసలు ఏ పత్రిక పై ఏ ఆశలు లేక .. అన్ని వార్తలను చదువుకొని .. తార్కిక దృష్టితో చూస్తూ వెళ్లడం ఉత్తమం …
Share this Article