.
పార్థసారథి పొట్లూరి .....
అమెరికా పతనం పార్ట్-2
పీటర్ టర్చిన్ 15 ఏళ్ళ క్రితం చెప్పిన జోస్యం నిజం అని ఒప్పుకోవడానికి కొన్ని వరుసగా జరిగిన సంఘటనలని జాగ్రత్తగా పరిశీలిస్తే అమెరికా పరిస్థితి ఎలా దిగజారుతూ వచ్చిందో అర్ధం అవుతుంది.
Ads
1. కోవిడ్ వాక్సిన్ సిద్ధం కాకముందు క్వినైన్ డ్రగ్ కోసం ట్రంప్ భారత దేశాన్ని దేబిరించడం అనేది అమెరికా ఎంత బలహీనంగా ఉందో తెలియచేసే సంఘటన. అఫ్కోర్స్! ముందు భారతీయుల అవసరాలు తీరినాకే మేము ఎగుమతి చేస్తామని మోడీ తెగేసి చెప్పడం చూస్తే అప్పటికే భారత్ దగ్గర ఏదో సమాచారం ఉండి ఉండవచ్చు అని భావించాలి!
2. సౌదీ అరేబియా జర్నలిస్ట్ ఖషోగ్గిని సౌదీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ టర్కీలోని ఇస్తాంబుల్ లో హత్య చేసిన తరువాత అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సౌదీ రాజుని విమర్శించడంతో సౌదీ అరేబియా అమెరికాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. సౌదీ అరేబియా దగ్గర అమెరికా ఆర్ధికస్థితి గురుంచి కీలక సమాచారం ఉంటేనే అమెరికాని దూరం పెట్టే పనిచేయగలదు.
3. కేవలం అమెరికాని ఇరుకున పెట్టడానికే OPEC దేశాలు క్రూడ్ ఉత్పత్తిని తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు అమెరికా ఖంగుతిన్నది!
4. క్రూడ్ ఉత్పత్తి తగ్గితే అది నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేస్తుంది.
5. జూన్ 7, 2023 న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లైంకెన్ సౌదీ పర్యటనకి వచ్చాడు. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ( MBS )తో తను సమావేశం అయిన సందర్భంలో క్రూడ్ ఉత్పత్తి పెంచి ప్రపంచ దేశాలలో ద్రవ్యోల్బణం పెరగకుండా కాపాడమని అభ్యర్థించాడు కానీ MBS నవ్వి ఊరుకున్నాడు తప్పితే క్రూడ్ ఉత్పత్తిని పెంచుతామని అని హామీ ఇవ్వలేదు. MBS నవ్వి ఊరుకోవడానికి కారణం బ్లిన్కెన్ ప్రపంచదేశాలు అని అమెరికా అనడం హాస్యాస్పదంగా ఉందనే అర్ధంలో!
చివరికి ఆంటోనీ బ్లింకెన్ నేను అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో మిమ్మల్ని అభ్యర్థించడం లేదు.. నేను ఒక యూదు మతస్థుడిగా అభ్యర్థిస్తున్నాను అని అన్నాడు.
ఆంటోనీ బ్లింకెన్ అంతలా దిగజారి క్రూడ్ ఉత్పత్తిని పెంచమని అడుక్కోవడం దేనికి? జో బిడెన్ ఏం చేస్తావో తెలీదు క్రూడ్ ఉత్పత్తిని పెంచుతాము అని MBS నుండి హామీ తీసుకొని తిరిగి రావాలి అని బ్లింకెన్ కి చెప్పి పంపించి ఉండవచ్చు! ఈ విషయం మీద నేను అప్పట్లో పోస్ట్ కూడా పెట్టాను!
6. జులై 15, 2023 న అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సౌదీ పర్యటన కోసం జెడ్డా వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి మక్కా గవర్నర్ ని పంపించాడు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్! నిజానికి ప్రిన్స్ MBS ని కలవడానికి జో బిడెన్ రావడానికి అజెండాలో పలు ఒప్పందాల మీద సంతకాలు చేయాల్సి ఉండగా ( GCC+3 సమావేశం) ప్రధాన ఉద్దేశ్యం మాత్రం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి పెంచమని అడగడానికే!
జో బిడెన్ కి తన రాయల్ ప్యాలెస్ దగ్గర మాత్రమే బయటికి వచ్చి ఆహ్వానం పలికాడు సౌదీ రాజు. అంటే 2023 నాటికే అమెరికా ప్రాభవం సన్నగిల్లింది.
ప్రపంచ దేశాలు అమెరికా అధ్యక్షుడి అప్పోయింట్మెంట్ కోసం ఆశగా వేచి చూసే రోజులు పోయాయి 2020 నాటికే!
గత సంవత్సరం జూన్ నాటికి పెట్రో – డాలర్ ఒప్పంద గడువు ముగిసిపోయింది! కానీ ఈ రోజు వరకూ పెట్రోడాలర్ ఒప్పందం రెన్యూవల్ చేయలేదు సౌదీ అరేబియా! క్రూడ్ ఆయిల్ కొనాలి అంటే డాలర్ తప్పనిసరి కాదు!
ఇజ్రాయేల్ కనుక పాలస్తీనాని తమ దేశంలో కలిపేసుకుంటున్నట్లు ప్రకటించడమే తరువాయి వెంటనే OPEC ( Organization of Petroleum Export Countries) దేశాలు అమెరికాకి తమ ఎగుమతులని నిలిపివేస్తాయి!
OPEC దేశాలు అంత ధైర్యం చేయగలవా?
చరిత్రలోకి వెళితే Yom Kippur war ( fourth Arab-Israeli war, October war,Ramadan war) యుద్ధం సందర్భంగా (ఇజ్రాయేల్ అరబ్ దేశాల మధ్య యుద్ధం అక్టోబర్ 6 నుండి 25, 1973) ఒపెక్ దేశాలు అక్టోబర్ 1973 నుండి మార్చి 1974 వరకూ క్రూడ్ ఎగుమతుల మీద కఠినమైన ఆంక్షలతో పాటు నిషేధం విధించడమే కాకుండా క్రూడ్ ఉత్పత్తిని తగ్గించేసాయి.
కేవలం రవాణా కోసమే వినియోగిస్తున్నారు అనుకున్న దేశాలకి మాత్రమే ఎగుమతులు చేశాయి. దాదాపుగా 7 నెలల పాటు ప్రపంచ దేశాలు తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరతతో నిత్యావసరాల ధరలు పెరిగి విలవిలలాడాయి. అమెరికా ఇజ్రాయేల్ కి సహకరిస్తున్నది అన్న ఒకే ఒక్క కారణంతో opec దేశాలు ప్రపంచాన్ని స్థంబింప చేయగలిగాయి.
అంచేత జో బిడెన్, ఆంటోని బ్లింకెన్ సౌదీ రాజు దగ్గర మోకరిల్లారు! గత జో బిడెన్ 4 ఏళ్ల పాలనలో మొత్తం 6 సార్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సౌదీ పర్యటనకి వెళ్ళాడు!
అమెరికా ఆర్ధిక సంక్షోభంలో ఉంది అని అనడానికి పైన పేర్కొన్నవి కొద్ది ఉదాహరణలు మాత్రమే!
పైకి చేస్తున్నట్లుగా కనపడేది జో బిడెన్, డోనాల్డ్ ట్రంప్, కానీ చేయించేది ఇల్యూమినాటి!
ఇల్యూమినాటి మరో చారిత్రిక చర్య!
నిక్సన్ షాక్!
Nixon shock గా పిలవబడేది బంగారంతో డాలర్ అనుబంధాన్ని విడదీసే చర్యగా పేర్కొంటారు.
1960- 70 ల మధ్య వియాత్నాంతో అమెరికా చేసిన యుద్ధం వలన అమెరికా సాధించింది ఏమీ లేదు కానీ ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది. దాంతో డామేజి కంట్రోల్ లో భాగంగా అప్పటి వరకూ అమలులో ఉన్న డాలర్ గోల్డ్ స్టాండర్డ్ రద్దు చేశాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్.
అమెరికా వియత్నాం యుద్ధం అనేది ఇల్యూమినాటి కోసం జరిగింది. పదేళ్ల సుదీర్ఘ పోరులో అమెరికన్ జెట్ ఫైటర్స్ అప్పటి వియత్నాం (సోవియట్ జెట్ ఫైటర్స్ ) ముందు ఓడిపోయాయి. హెలికాప్టర్ గన్ షిప్స్ ని మరింత మెరుగుపరుచుకోవడానికి అనుభవం లభించింది. కానీ అమెరికా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ కి అనుభవం వస్తే ప్రజలు మాత్రం కష్టాలని అనుభవించారు.
20 ఏళ్ళు ఆఫ్ఘానిస్తాన్ లో, గత మూడేళ్లుగా ఉక్రెయిన్ లో అమెరికన్ ఆయుధాల వాడకం వల్ల ఆర్ధికంగా నష్టపోయింది!
డాలర్లు ప్రింట్ చేసుకుంటూ వెళ్లే పరిస్థితి లేదు, ఆ అవకాశాన్ని ఇప్పటికే బాగా వాడుకున్నారు కాబట్టి అమెరికాకి ఎగుమతి చేసే దేశాలు అదనపు పన్నులు కట్టాలి అనే మతిలేని ఆలోచనకి తెర తీసింది ఇల్యూమినాటి… (మిగతాది పార్ట్ – 3 లో)…..
Share this Article