.
రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను తన మాటలతో మూలాల్నుంచీ సెలుపుతున్నాడు… ‘కోసి నెత్తురు పంటలపై చల్లితే సరి’ అనే మాట, భాష ఒక్కసారిగా బీఆర్ఎస్ క్యాంపులో సామూహిక హాహాకారాలకు కారణమై, వెంటనే రక్తపిశాచి వంటి కౌంటర్లకు దిగింది… రాజకీయాల్లో కౌంటర్లు తప్పదు… కానీ కేటీయార్ ప్రస్తావించిన అంశాలు కొన్ని, తను ఎంత అనాలోచిత, హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పడానికి పక్కా ఉదాహరణ…
ప్యూర్ హై హిపోక్రటిక్ లైస్..! తను ఓ ట్వీట్ చేశాడు… రఫ్‌గా తెలుగు అనువాదం ఏమిటంటే..? ‘‘60 ఏళ్లపాటు తెలంగాణను హింసిస్తూ దాని రక్తాన్ని మీరు తాగలేదా? రక్తం రుచికి అలవాటుపడిన నక్కలారా, కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎంత రక్తం కావాలి? ఎన్‌కౌంటర్ల పేరుతో తెలంగాణ బిడ్డలను, యువతను సజీవ దహనం చేసి పాతిపెట్టిన హంతకులు మీరే!
Ads
1952లో ఏడుగురు యువకులను కాల్చి చంపి, వారి రక్తాన్ని మీ కళ్లకు అద్దుకున్న రాక్షసులు మీరే! 1969లో 369 మంది అమాయక పిల్లలపై తూటాల వర్షం కురిపించి వారి రక్తాన్ని చిందించిన రక్తపిపాసులైన హంతకులు మీరే! ఉద్యమ చివరి దశలో వెయ్యి మంది ప్రాణాలను బలిగొన్న మృగాలు మీరే! కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిసి ఉన్నాయి!’’
సరే, కావాలని తెలంగాణ సెంటిమెంటును రగల్చడానికి నానా రకాల రాజకీయ ఎత్తులు పన్నుతున్న ధోరణిలో భాగంగానే… రేవంత్ మాటలకూ తెలంగాణ ఉద్యమ మరణాలకూ లింక్ పెట్టాడు కేటీయార్… 1969లో 369 మంది బుల్లెట్లకు బలయ్యారా..? ఉద్యమం చివరి దశలో 1000 మంది మరణాలకూ కాంగ్రెసే కారణమా అనే విషయాల్ని పక్కన పెడితే…
ఎన్‌కౌంటర్ల పేరుతో 60 ఏళ్లు తెలంగాణ పిల్లలను ఎన్‌కౌంటర్ల పేరిట సజీవదహనం చేశారా? అది కేవలం కాంగ్రెస్ వల్లనేనా..? మరి కేసీయార్‌కు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీయార్, చంద్రబాబు కాలం మాటేమిటి..? ఆ ప్రభుత్వాల్లో కేసీయార్ కూడా భాగస్వామి, బాధ్యుడు కాదా..? ఇక్కడ ఇంకొన్ని విషయాల్ని, నిజాల్ని ముచ్చటించుకుందాం…
1) ఎన్‌కౌంటర్లు, నక్సలైట్లపై ప్రభుత్వాల పోరాటం ఒక్క తెలంగాణకెే పరిమితం కాదు… 2) ఎన్‌కౌంటర్లు- సజీవదహనాలు మాటలో గాఢత ఉంది గానీ పొంతన కుదరని పదాలు… 3) కాంగ్రెస్ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిసి ఉన్నాయా..? బీఆర్ఎస్ చేతులు స్వచ్ఛమైనవా..? ఓసారి చూద్దాం…
నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా అని చెప్పుకుని… తెలంగాణ స్వరాష్ట్రం సాధించాక, అంటే కేసీయార్ పాలించిన కాలంలో (2014 నుండి 2024 వరకు) జరిగిన ఎన్‌కౌంటర్లు పాపం కేటీయార్’కు గుర్తులేదా? గుర్తుండీ కన్వీనియెంటుగా దాచేయడమా..?
-
మొత్తం ఎన్‌కౌంటర్లు…: 2014 నుండి 2024 వరకు పదేళ్ల కాలంలో తెలంగాణలో మొత్తం 44 ఎన్‌కౌంటర్లు జరిగాయి…
-
మరణించిన మావోయిస్టులు..: ఈ ఎన్‌కౌంటర్లలో మొత్తం 96 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారిక, మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి…
- 2014 సంవత్సరంలో మాత్రమే పోలీసుల సంయమనం… తరువాత 2015 నుండి మావోయిస్టుల ఏరివేత మొదలైంది… ఈ పదేళ్ల కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి చెందిన నలుగురు సభ్యులు కూడా ఉన్నారు.
గతంలో వైఎస్ ఉన్నప్పుడు శాంతి చర్చలు జరిగాయి… ప్రజాస్వామిక పద్ధతుల్లో కనీసం పోరాట విరమణ ఎజెండాతో ప్రయత్నాలు జరిగాయి… రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక క్లియర్ కట్ ధోరణి తీసుకున్నారు… నో బుల్లెట్స్, ఓన్లీ సరెండర్స్… రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ కార్యదర్శి, సభ్యులు దొరికినా ఎవరినీ ఏమీ చేయలేదు…
- 2024 నుండి ఇప్పటి వరకు సుమారు 760 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి…
- కీలక నేతలు, కేంద్ర కమిటీ నేతలు, బుల్లెట్ వాడొద్దు అనే వైఖరికి కట్టుబడి ఉంది ప్రభుత్వం…
ఒక్క బుల్లెట్ పేలకుండానే ‘నక్సలై ముక్త తెలంగాణ’ సాధ్యం చేసిన కాంగ్రెస్ చేతులకు నెత్తురు అంటినట్టా..? స్వరాష్ట్రంలో నక్సలైట్ల మీద మాటల్లో కృత్రిమ ప్రేమ కురిపిస్తూ… అనేక మందిని కిరాతకంగా హతమార్చిన బీఆర్ఎస్ చేతులకు నెత్తురు అంటిందా..? ఏది నిజం! పైగా ఇప్పుడు పౌరహక్కులు, ఎన్‌కౌంటర్ల ఖండనలు!! pure high Hypocrisy…
Share this Article