Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ధర్మస్థల వందల శవాల కంట్రవర్సీ..! బయటపడుతున్న ఓ భారీ కుట్ర…!?

August 19, 2025 by M S R

.అనుకున్నట్టే జరుగుతోంది… ధర్మస్థల గుడి నిర్వాహకులు వందల మందిపై లైంగిక దాడులు చేసి, చంపి ఆ మహిళలు, అమ్మాయిల మృతదేహాలను పూడ్చిపెట్టించారనే కథలు, కేసుల వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే విషయాలు వెల్లడవుతున్నాయి… యాంటీ హిందూ మతద్వేషులు పన్నిన పన్నాగంలో సీఎం సిద్దరామయ్య అడ్డంగా పడిపోయాడనే వార్తలు బయటికి వస్తున్నాయి…సీఎం సిద్ధరామయ్య అంతే కదా… అరాచకం… తనేం చేస్తాడో తనకే తెలియదు… ఐనా ఎప్పుడో అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి హఠాత్తుగా తన పాపప్రాయశ్చిత్తం పేరిట, విజిల్ బ్లోయర్ పేరిట తెరప్రవేశం చేసి, నేను వందల శవాల్ని పాతేశాను అని చెప్పగానే ప్రభుత్వం నమ్మేయడం ఏమిటి..?ఏ సగటు పోలీసైనా ముందు సస్పెక్ట్ చేయాల్సింది ఆ వ్యక్తినే కదా… తనూ దోషే అవుతాడు కదా… ఇన్నేళ్లు ఎందుకు పాపచింతన లేదు..? సో, తను చెప్పినట్టు గుడ్డిగా తవ్వకాలు చేస్తూ పోయారు… 16, 17 చోట్ల… అబ్బే, ఇక్కడ కాదు, అక్కడ… అక్కడ కాదు, మరింత దూరం అంటూ గుడికి కిలోమీటర్ల దూరం దాకా తీసుకుపోయాడు… జేసీబీలు తవ్వుతూనే ఉన్నాయి…తీరా ఏం దొరికింది… ఆ శిథిలాల్లో కర్నాటక ప్రభుత్వపు మూర్ఖత్వపు ఛాయలు బయటపడ్డాయి… అతనేదో చెప్పగానే యాంటీ హిందూ ప్రాపగాండా యాక్టివిస్టులు రెచ్చిపోయారు… వందలు, వేల శవాలు అంటూ రాసిపారేశారు… మన పిచ్చి సీపీఐ నారాయణ సహా… మరీ బీబీసీ బాధ్యతారహితంగా వ్యవహరించింది… ఇక యూట్యూబులైతే చెప్పనక్కర్లేదు…dhamasthalaఏమాటకామాట… రాహుల్ టీమ్ సంయమనం పాటించింది… ఆ గుడి దేవాదాయ శాఖ పరిధిలో లేదు, హెగ్డే కుటుంబ ఆధ్వర్యం… దాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని లేదా వేరే వ్యక్తులు ఆ గుడి పెత్తనాన్ని ఈ బదనాం కుట్రలతో కాజేయాలని కుట్ర పన్నారు అనే వార్తలు చాన్నాళ్లుగా వస్తూనే ఉన్నాయి…తీరా 15 రోజుల తవ్వకాల్లో ఏం దొరికింది..? ఓ పుర్రె, ఓ కంకాళం… అన్ని కిలోమీటర్ల పరిధిలో ఏళ్లుగా ఎన్నో శవాలు పాతిపెట్టి ఉంటారు… మరి వందల శవాలు ఏవి..? చివరకు ఆమె ఎవరో తన బిడ్డ కనిపించడం లేదని చేసిన ఫిర్యాదు కూడా అనుమానాస్పదమేనట… వందలు, వేల వార్తలన్నీ ఫేక్ అని తేలుతున్నాయట… ప్రస్తుతానికి తవ్వకాల్ని ఆపేశారు… సిద్ధరామయ్య ఇప్పుడు కిమ్మనడం లేదు… ఇదుగో ఇలాంటి దుందుడుకు నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకం…dharmasthalaతీరా ఇప్పుడు సిట్ కన్నెర్ర చేసేసరికి… ఆ కార్మికుడు నిజం చెబుతున్నాడట… 2023 నుంచి ఓ టీమ్ తనను ఈ శవాల పాతిపెట్టడం మీద తాము చెప్పినట్టు చెప్పాలని ఒత్తిడి తెచ్చాయట… 2014 నుంచి 2023 వరకు తమిళనాడులో ఉన్న తనను ఆ టీమే కర్నాటకకు తీసుకొచ్చింది, ఓ పుర్రెను సమకూర్చింది… పోలీసులను పిచ్చోళ్లను చేసింది…మన మీడియా, మన సోషల్ మీడియా… చివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఎంత ఈజీగా మిస్‌గైడ్ అయిపోయి… కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయటానికి ఎలా ప్రయత్నించాయో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది… హిందూ ప్రార్థనస్థలాలు ఎలా టార్గెట్ అవుతున్నాయో కూడా తెలుస్తుంది..! రాను రాను హిందూ మతం ఎంత వల్నరబుల్ అవుతుందో కూడా అర్థమవుతుంది…! నిష్ఠురంగా ఉన్నా నిజం ఇదే..!! ఏమయ్యా సిద్ధరామయ్యా… కాస్త కళ్లు తెరుచుకుని, ఇకనైనా ఈ కుట్ర అసలు నిజాల్ని బయట పెట్టు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలుగు అభ్యర్థి..! ఇండియా కూటమిలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు..!!
  • మార్వాడీ గో బ్యాక్…! అశాంతి రేపే అసాంఘిక శక్తులకు చుక్కెదురు…!!
  • ఎక్కడో న్యూజిలాండ్‌లో కనిపించేవి… ఇప్పుడివి ఖమ్మం అడవుల్లో ప్రత్యక్షం…
  • సింహాసనం , నిరీక్షణ , స్వాతిముత్యం… నడుమ పుణ్యస్త్రీ స్లో సక్సెస్…
  • ధర్మస్థల వందల శవాల కంట్రవర్సీ..! బయటపడుతున్న ఓ భారీ కుట్ర…!?
  • అమెజాన్ అంటేనే అమేజింగ్..! వర్షాన్ని తనే రప్పించుకుంటుంది..!
  • కమర్షియల్ యాడ్స్‌పై రజినీకాంత్ ధోరణి ప్రశంసనీయమే..! కానీ..?
  • ఆధ్యాత్మికత + నృత్యాలు = కామాఖ్యలో దియోధని ఉత్సవాలు…
  • కాళేశ్వరం గంతలు… హరీష్‌రావు వృథా ప్రయాస..! ఇవీ నిజాలు..!!
  • …. కోటి రూపాయలకు ఓ కింగ్ ఫిషర్ విమానం కొని ఈ హోటల్ పెట్టాను

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions