.
కవిత ఆ గులాబీ యాదవ శిబిరంలో ఓ ముసలం… ముసలం ఎటు దారితీస్తుంది… జనానికి తెలుసు… ఇక లోతు చర్చ లేదు…
కవిత గొప్ప నాయకురాలు కాకపోవచ్చు… ఎస్, మరి కేటీయార్..? సేమ్ సేమ్ కదా.,.! సినిమా వారసుల్లాగా వీళ్లూ తెలంగాణ ఉద్యమతెర మీదకు వచ్చారు…
Ads
అయ్య పోరాడుతున్నాడు… ఇదొక మైనింగు… ఛలో అని వాళ్లూ ఓ చెయ్యేశారు… ఎస్, ఆమే చెబుతున్నట్టు కవిత పెళ్లినాటికి కేసీయార్ కటకట… సిద్దిపేట ముఖ్యులకు అందరికీ తెలుసు…
మరి ఇప్పుడు..? ప్రపంచ నేతలు కూడా హాశ్చర్యపడిపోయే ఆస్తులు… మించిన కేటీయార్… అనేకరెట్లు మించిన హరీష్… నల్లికుట్ల సంతోష్ కూడా… ఎక్కడిది ఇదంతా… లిల్లీపుట్లు చెప్పవు… కానీ ఆమే చెబుతోంది…
కుటుంబం గుట్టు విప్పుతోంది… సంతోష్, హరీష్ దొంగలు అని చెబుతున్నదీ అంటే… కేసీయార్, కేటీయార్ పెద్ద దొంగలు అని అన్యాపదేశంగా చెబుతున్నట్టే… తెలంగాణ సమాజానికి అర్థం అవుతుంది…
ఇంకా చెప్పబోతోంది… ఎందుకు..? ఈ పితృస్వామిక వ్యవస్థకు సిసలైన ప్రతీక,, లక్ష పుస్తకాలు చదివిన కేసీయార్… ఐనాసరే, తనలో అభ్యుదయభావనలు జీరో… అందుకే కొరివి పెట్టే కేటీయార్ మాత్రమే వారసుడు… తప్పితే హిమాంశు మాత్రమే వారసుడు… వూ ఈజ్ కవిత..? ఆమె కల్వకుంట్ల కవిత కాదు, జస్ట్, ఓ దేవనపల్లి కవిత… అదీ హిమశిఖరోన్నతంగా గులాబీ క్యాంప్ ప్రచారం చేసిన సదరు కేసీయార్ అనబడే అసలు సిసలు మనువాద కేరక్టర్ నిజస్వరూపం…
నాటకాలు, అబద్ధాలు, మన్నూమశానం వదిలేస్తే… కవితను ఎందుకు దూరం పెట్టాలి..? అసలు ఓ ఆడబిడ్డను కనీసం మాట్లాడకుండా, గేట్లు మూసేసి మరీ కక్ష సాధించడం ఏమిటి..? కేటీయార్ ఏమైనా నీతో ఉంటున్నాడా..? ఐనా నాస్తికుడైన కేటీయార్ కావాలి గానీ… ఫామ్ హౌజులో మళ్లీ ఓ చండీ గణపతి హోమాన్ని సొంత బిడ్డను పిలవకుండా తాజాగా చేసుకుంటూ ఉంటే… ఆదిశక్తి స్వరూపిణి సహిస్తుందా..? ఉల్టా దండిస్తుందా..? ఆయుత చండీయాగం సమాప్తివేళ యాగవాటిక తగలబెట్టినట్టు ఆగ్రహం ప్రదర్శిస్తుందా..?
అబ్బే, కవితను రేవంత్ రెడ్డి వాడుకుని, బీఆర్ఎస్ క్యాంపును కకావికలు చేస్తున్నాడు… జనంలో కేసీయార్ అంటే ఏవగింపు జనంలోకి బలంగా పోయింది అంటారా..? రాజకీయం అంటే అదే కదా… ఇదే కేసీయార్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి అహోబిలం మఠం కాదు కదా నడిపించేది… తనూ చేసేది రాజకీయాలే కదా…
ఆమె ఏమైనా పిచ్చిదా..? ఎవరో ఏదో చెప్పగానే చేసేయడానికి..? అంత పెద్ద మద్యం కుంభకోణి… కాకలు తీరిన కథానాయకి… ఇంకా ఇంకా చెప్పు అక్కా… సంతోష్ బినామీలు, హరీష్ బినామీలు, కేటీయార్ బినామీలు… మొత్తం ఎన్ని లిల్లీపుట్లు ఎంతగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేశాయో… సవివరంగా చెప్పక్కా… తెలంగాణ రుణం తీర్చుకో… లింగవివక్ష మీద పోరాడు…
ఈ వ్యవస్థలు, ఈ కేసులు, ఈ విచారణలూ మన్నూమశానం ఏమీ ఫలించవు… కేసీయార్ సాధనసంపత్తి ఎదుట ఏవీ నిలబడవు… కానీ నువ్వు నిజమైన జడ్జివి… వాళ్ల బాగోతాల బట్టలు విప్పు… స్లిప్పర్ల హరీష్ వర్తమానపు అసలు కథలు చెప్పు… రెండో చొక్కా కూడా లేని సంతోషుడి అసలు ప్రస్తుత కథలు చెప్పు.,. ఖచ్చితంగా తెలంగాణ సమాజం నీ ‘ఆత్మాంగీకార ప్రకటన’ను… (కన్ఫెషన్ స్టేట్‌మెంట్ల)ను వింటుంది, చూస్తుంది, చదువుతుంది, నమ్ముతుంది… నువ్వు ఆడబిడ్డవు కాబట్టి… కమాన్…
చివరగా... ఇంతకీ హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకున్నది ఎక్కడ..? ఎందుకు..? ఏమిటి..? ఎలా..? నువ్వే చెప్పాలి... చెప్పాలి... నిజమైన నిజామాబాద్ దేవనపల్లి కుటుంబ కోడలివే అయితే...!!
Share this Article