.
పార్థసారథి పొట్లూరి....
ట్రంపు- సౌదీ ప్రిన్స్- పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ – ఆపరేషన్ సిందూర్ లింకులు, మధ్యవర్తుల మీద ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చదివాం కదా… ఇది మిగతా పార్ట్…
.
Ads
ట్రంప్- టారిఫ్స్- మొహమ్మద్ బిన్ సల్మాన్ via India!
డోనాల్డ్ ట్రంప్ అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద సుంకాలు విధించాలనే ఆలోచనని గత మూడు దశబ్దాలుగా చెప్తూ వస్తున్నాడు! కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్తున్నది కాదు కానీ తన ఆలోచనని ఇప్పుడు అమలు చేస్తున్నాడు!
తప్పనిసరి పరిస్థితులలో, అదీ అమెరికా ఆర్ధిక పరిస్థితి బాగాలేని సమయంలో టారిఫ్స్ విధిస్తున్నాడు. అఫ్కోర్స్! ఇల్యూమినాటి మద్దతు ఉన్నది!
టారిఫ్స్ అనే డ్రామాకి తెర తీసే సమయంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ రంగ ప్రవేశం చేశాడు. MIB తన కుడి భుజం యాసిర్ అల్ రుమయ్యాన్ ని ట్రంప్ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయకముందే WWE ప్రీమియర్ షోలో కలిసినప్పుడు భారత్ మీద టారిఫ్స్ ఎక్కువగా ఉండేట్లుగా చూడమని అడిగించాడు MIB!
సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ మీద టారిఫ్స్ ఎక్కువగా వేయమని ఎందుకు అడగాడు?
1.రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయకముందు అంటే 2023 ఫిబ్రవరి 23 కి ముందు భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతి చేసుకునే చమురులో 60% సౌదీ అరేబియా నుండి కొనేది.
2. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలయ్యాక పుతిన్ తన ముడి చమురుని దిగుమతి చేసుకుంటే మార్కెట్ ధరలో 20% డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించగానే భారత్ రష్యా నుండి కొనడం మొదలుపెట్టింది.
3. ఎప్పుడైతే భారత్ రష్యా నుండి చమురు ఎక్కువమొత్తంలో కొనడం ప్రారంభించిందో సౌదీ వాటా కాస్తా 60% నుండి 11% కి పడిపోయింది.
4.చైనా కూడా సౌదీని పక్కన పెట్టి రష్యా నుండి కొనడం మొదలుపెట్టింది!
5. ఇంచుమించుగా భారత్, చైనా జనాభాలు కలిపితే 300 వందల కోట్లు ఉంటుంది. జనాభాకి తగ్గట్లే పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా అమెరికా, యూరోపులతో పోలిస్తే ఎక్కువ.
6. రష్యా మూలంగా సౌదీ బాగా నష్టపోతున్నది గత రెండేళ్లుగా!
7. ఎటూ అన్ని దేశాల మీద పన్నులు విధిస్తున్నారు కాబట్టి భారత్, చైనాల మీద రెట్టింపు పన్ను విధిస్తే రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేసి సౌదీ దగ్గర కొంటాయి రెండు దేశాలు.
8. గత రెండేళ్ల నుండి లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు వచ్చింది? జస్ట్, అల్ రుమయ్యన్ ట్రంప్ తో చేసుకున్న ఒప్పందం వల్ల భారత్ పై 50% టారిఫ్స్ కి చేరుకుంది.
Jared Kushner – ట్రంప్ అల్లుడు- ఇవాంక భర్త!
9. బదులుగా 2 బిలియన్ డాలర్లని ట్రంప్ క్రిప్టో కరెన్సీలో, ట్రంప్ రియల్ ఎస్టేట్లలో MBS పెట్టుబడులు పెట్టాడు…
అయితే నేరుగా ట్రంప్ తో సంబంధం ఉన్న సంస్థలలో పెట్టుబడులు పెట్టలేదు MBS. ట్రంప్ అల్లుడు ( ఇవాంక భర్త ) అయిన జరిడ్ కుష్నర్ ( Jared Kushner) రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాడు.
ఇంకో వైపు బలూచిస్థాన్ ని తనకి తాకట్టు పెట్టినందుకు గాను ఆసిమ్ మునీర్ కి ఇవ్వాల్సిన డాల్లర్లని కూడా ట్రంప్ క్రిప్టో కరెన్సీ, అల్లుడు జరెడ్ కుష్నర్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు రూపంలో ఇచ్చాడు.
10. So! భారత్ చైనాల మీద 50% టారిఫ్ తో పాటు ఇంకా పెంచుతాను అంటూ బెదిరిస్తూ వస్తున్నాడు ట్రంప్.
***************
1998 లో భారత్ చేసిన రెండో అణు పరీక్ష వల్ల అమెరికా ఆంక్షలు విధించింది. అప్పటి నుండి అమెరికా భారత్ మధ్య సంబంధాలు క్షీణ దశకు చేరుకుంటే, వాటిని అధిగమిస్తూ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ మళ్ళీ మామూలు స్థితికి చేరుకున్న వేళ… MBS ని నమ్ముకొని తన స్వలాభం కోసం అమెరికా ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు ట్రంప్!
రిపబ్లికన్స్, డెమోక్రాట్లు కూడా భారత్ మీద టారిఫ్స్ విధించి దూరం చేసుకోవద్దని మొత్తుకుంటున్నా వినకుండా ట్రంప్ MBS కి ఏదో చేసేద్దామని మోడీతో, అంటే ఇండియాతో వైరం పెట్టుకున్నాడు.
ఇప్పుడేమయ్యింది?
మోడీ ట్రంప్ టారిఫ్స్ లెక్క చేయకుండా రష్యా నుండి చమురు కొనడానికే నిర్ణయం తీసుకున్నారు.
F-35 గురించి మర్చిపో అన్నారు మోడీ!
నిజానికి మోడీ SCO ( SHANGHAI COOPERATION ORGANISATION) సదస్సుకి వెళ్లిoది పుతిన్ కి సంఘీభావం తెలపడానికే! అమెరికా వత్తిడి తెచ్చినా భారత్ రష్యాతోనే ఉంటుంది అని తెలపడానికే! అంతే కానీ SCO సదస్సులో మనకి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు, కాకపోతే మోడీ పుతిన్ వైపే ఉంటాను అనే సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారు!
అఫ్కోర్స్! భారత్ లో TIK TOK తన కార్యకలాపాలని మొదలు పెట్టడానికి అనుమతి ఇచ్చారు మోడీ!
బదులుగా భారత్ ఉత్పత్తులని చైనాలో స్వేచ్ఛగా అమ్ముకోవడానికి జింగ్ పింగ్ అనుమతి ఇచ్చాడు!
“ మేము రష్యాని, భారత్ ని చైనాకి కోల్పోయాము ” అంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ట్రంప్!
అమెరికాలో అరమెదడు గాళ్ళు వ్యూహలు పన్నుతుంటే పుతిన్, మోడీ కలిసి వాటికీ విరుగుడు కనిపెడుతున్నారు.
ఇంతకీ మోడీకి కానీ, పుతిన్ కి కానీ సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన పని గురించి తెలుసా అనే అనుమానం రావొచ్చు.
ఇద్దరితో పాటు జీ జిన్జ్పింగ్ కి కూడా తెలుసు!
అందుకే ఇప్పటికే ఇస్తున్న 20% డిస్కౌంట్ కి మరో 2% అదనంగా డిస్కౌంట్ ఇచ్చాడు పుతిన్. ఇది పరోక్షంగా ట్రంప్, MBS లకి హెచ్చరికలాంటిది. మీరు రష్యా నుండి ఆయిల్ కొనవద్దు అంటూ ఎంత ఒత్తిడి చేస్తే అంత డిస్కౌంట్ ఇస్తూ పోతాను అని చెప్పకనే చెప్పినట్లయింది!
MBS డబ్బులు వృధా అయిపోయినట్లే!
ట్రంప్ తన అల్లుడు జరెడ్ కుష్నర్ కోసం అమెరికాని సౌదీ యువరాజుకి తాకట్టు పెడితే MBS కి ఏదో ఒరిగిపోతుందని అనుకున్నాడు.
కానీ గత ఆగస్టులో అమెరికన్ ఫెడరల్ కోర్టు టారిఫ్స్ విధించే అధికారం గంపగుత్తాగా అమెరికా అధ్యక్షుడికి లేవు, కాంగ్రెస్ లో బిల్లు పెట్టి సభ్యుల ఆమోదం పొందాకే అది చెల్లుతుంది తప్పితే నేరుగా అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో టారిఫ్స్ విధించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు ఇచ్చింది.
అమెరికన్ సుప్రీమ్ కోర్టులో అప్పీల్ చేశాడు ట్రంప్. బహుశా సుప్రీం కోర్టు కూడా కింది కోర్టు తీర్పుని సమర్థించే అవకాశం ఉంది. ఇదే జరిగితే MBS బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు వృధా అయిపోయినట్లే. పెట్టుబడుల రూపంలో పెట్టింది కాకుండా లాబీయింగ్ కోసం లంచాలు ఇచ్చింది కూడా వృధా అయిపోయినట్లే.
బహుశా అందుకేనేమో మోడీ & Co., ట్రంప్ టారిఫ్స్ మీద ఎలాంటి ప్రకటన చేయకుండా గుంభనంగా ఉన్నారు!
పహాల్గావ్ మారణకాండ కి పరోక్షంగా MBS కారకుడు!
YES! యాసిర్ అల్ రూమయ్యాన్ అండగా ఉన్నాడని, ఆసిమ్ మునీర్ పహాల్గామ్ మారణ కాండకి ప్లాన్ చేసి ఉండవచ్చు!
పహాల్గామ్ లాంటి టెర్రరిస్ట్ చర్యకి పాల్పడితే మోడీ ఎలా ప్రతిస్పందిస్తారో ఆసిమ్ మునీర్ కి తెలుసు. నష్టం కలిగితే పూడ్చడానికి MBS, అల్ రుమయ్యాన్ లు ఉన్నారు అనే భరోసాతోనే ఆసిమ్ మునీర్ పహాల్గామ్ టెర్రర్ చర్యకి దిగాడు.
కొత్త అనుమానాలు!
భారత్ దాడిలో ధ్వంసం అయిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లోని అణు వార్ హెడ్స్ లలో కొన్ని సౌదీ అరేబియా డబ్బులు ఇచ్చి పాకిస్థాన్ లోనే నిల్వ చేసి ఉండవచ్చు… లేకపోతే కాల్పుల విరమణ కోసం అంతలా ఆసిమ్ మునీర్ మీద ఎందుకు ఒత్తిడి తెస్తాడు అల్ రూమయ్యాన్…? (మిగతాది తరువాయి కథనాల్లో చెప్పుకుందాం
)
Share this Article