.
ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్9లో ఎలిమినేషన్, రీఎంట్రీ డ్రామా పండిస్తున్న సంజనా గల్రానీ ఏదో ఓ మామూలు సెలబ్రిటీలే అనుకున్నాను… ఆమెకు ఎప్పుడైతే సుప్రీంకోర్టు నోటీసులు పంపించిందనే వార్త చదివానో, అరె, ఎవరబ్బా ఈమె, ఏమిటీ కథ అనుకున్నాను…
తీరా ఆరా తీస్తే పెద్ద యవ్వారమే ఉంది… చాలా కథల్ పడే కేరక్టరే… 2020… అప్పట్లో కన్నడ చిత్రసీమలో పెద్ద కలకలం, సంచలనం… పెద్ద డ్రగ్ రాకెట్‌ను పోలీసులు బ్రేక్ చేశారు… సినిమా నటి రాగిణి ద్వివేదితోపాటు ఈ సంజనను కూడా అరెస్టు చేశారు… కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్‌డీ వంటి డ్రగ్స్ వాడడమే కాదు, పెడ్లర్ కూడా అని కేసు..!
Ads
మూడు నెలలు జైలులో ఉంది… పదే పదే ఆమె బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టేశాయి, తరువాత బయటికొచ్చాాక విచారణ జరిగింది… కానీ 2024లో ఏవో సాంకేతిక కారణాలతో కోర్టు ఈ కేసు కొట్టేసింది… అదెలా కుదురుతుంది అనుకున్న కర్నాటక పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారు… అదుగో ఆ కేసుకు సంబంధించే సంజనాకు నోటీసులు జారీ చేసింది… ఇదీ కథ… అసలు పుట్టుపేరు అర్చన మనోహర్ గల్రాని… తెర పేరు సంజన… పుట్టింది బెంగుళూరు…
ఆది పినిశెట్టి పెళ్ళిచేసుకున్న నిక్కీ గల్రానీ ఈమె సోదరి…
మన తెలుగు ప్రేక్షకులకు ఇంతకుముందు తెలుసు ఈమె… 2005లో సోగ్గాడు అనే తెలుసు సినిమాతోనే తెరంగేట్రం… 2008లో ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో ఓ మోస్తరు పాత్ర… పాపులారిటీ వచ్చింది… కానీ నిలుపుకోలేకపోయింది… ఏవేవో అనామక పాత్రలు ఒప్పుకుంటూ, తన కెరీర్‌ను తనే దెబ్బతీసుకుంది… 2016 సర్దార్ గబ్బర్‌సింగ్, దండుపాళ్యం-2 లోనూ ఉంది…
టాప్ హీరోల సినిమాల్లో నటించినా… వాటి ఆధారంగా కెరీర్‌కు మంచి బాట వేసుకోలేకపోయింది… కాకపోతే ఎప్పుడూ ఖాళీగా లేదు… ఈమె మతం మారి వస్క్యులార్ సర్జన్ అజీజ్ పాషాను రహస్యంగా పెళ్లి చేసుకుంది, ఓ మగబిడ్డ… హిందూ సంప్రదాయాల్ని కూడా వదిలిపెట్టలేదు…
బిగ్‌బాస్ విషయానికి వస్తే… ఇది ఆమెకు కొత్తేమీ కాదు, కన్నడ బిగ్‌బాస్ మొదటి సీజన్‌లోనే కంటెస్టెంట్… 14 రోజులకే ఎలిమినేట్… మలయాళ, కన్నడ, తెలుగు, తమిళ సినిమాలే కాదు… దాదాపు అన్ని సౌత్ భాషల టీవీల రియాలిటీ షోలలోనూ యాక్టివే తను… ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌లోనూ యాక్టివే… జనం ఆదరిస్తున్నట్టే కనిపిస్తోంది..!!
Share this Article