·
“డాక్టర్… బయటకి వెళ్లాలని అనుకుంటే… నా గుండె బలంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఊపిరాడదు. చేతులు చెమటపట్టేస్తాయి. నన్ను ఎవరూ save చేయలేరన్న helplessness. ఇప్పుడే కుప్పకూలిపోతానేమో అనిపిస్తుంది” అని వణికే గొంతుతో చెప్పింది శివాని. కళ్ళల్లో కన్నీటి పొర కనిపిస్తోంది.
శివానీ, 32 ఏళ్ల మధ్యతరగతి యువతి. ఆమె నా ఎదురుగా చైర్ లో కూర్చుని ఉన్నా మనసు ఇక్కడ లేనట్టుంది. చేతులు వడిలో బిగపట్టుకుని ఉంది. గోర్లతో చర్మాన్ని గీస్తోంది. ఆమె కళ్ళలో బరువు. sleep deprivation, suppressed fear, silent tears… అన్నీ కనిపిస్తున్నాయి.
పక్కన భర్త శివాజీ. కాళ్ళను restlessగా కదుపుతున్నాడు.
“సర్, నా భార్యకి ఏం జరుగుతోందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను” అని guilt + helplessness తో చెప్పాడు.
“శివానీ గారు, మీరు చాలా ధైర్యంగా కౌన్సెలింగ్ కోసం వచ్చారు. మీకు ఏం జరుగుతోందో చెప్పినందుకు కృతజ్ఞతలు. మీకు ఎప్పట్నుంచి ఇలాంటి భయం మొదలైందో చెప్పగలరా?” అని శివానీని అడిగాను.
Ads
ఆమె ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని, ఒక్క క్షణం ఆగి… “డాక్టర్ గారు… ముందు నేను బస్సులో, మెట్రోలో తిరిగేదాన్ని. ఆఫీసుకి వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు ఇంటి తలుపు దాటడమే కష్టమైపోయింది. బస్సులో కూర్చుంటే ఊపిరాడకపోయేది. మెట్రో తలుపులు మూసుకుపోతే గుండె బలంగా కొట్టుకునేది. ఆ క్షణం ముగిసిపోయినా… రాత్రంతా నా తలలో ఒకే ఆలోచన—‘మళ్లీ ఇలా జరిగితే?’
“అది ఎంత భయంకరంగా అనిపించి ఉంటుందో నాకు అర్థమవుతోంది. మీరు ఒక క్షణం లోపలే ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా ఫీల్ అయ్యారన్నమాట. ఆ భయం తర్వాత మీ రోజువారీ జీవితం మీద ఎలా ప్రభావం చూపింది?”
“ఉదయం బయటకి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినా చెమటలు పట్టేస్తుంది. సూపర్ మార్కెట్ క్యూలో నిలబడలేను. సినిమా హాల్లో మధ్యలో లేచి బయటికి పరుగెత్తిపోతానేమో అని భయపడుతుంటాను. మాల్స్, వంతెనలు, పార్కింగ్ స్థలాలు— ఇవన్నీ నాకు ఉక్కిరిబిక్కిరి చేసే ప్రదేశాల్లా అనిపిస్తాయి.
ఆఫీసుకి లీవులు తీసుకుంటూ వుండి, చివరికి ఉద్యోగాన్నే వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను పనికిరానట్టు అనిపిస్తోంది.”
“మీరు చెప్పే ప్రతి అనుభవం చాలా బరువుగా ఉంది. ఇందులో మీ తప్పేం లేదు… మీలోని భయం మీకు బలహీనతలా అనిపింపజేస్తోంది. కానీ మీరు బలహీనురాలు కాదని నేను చెబుతాను. ధైర్యంగా నాతో పంచుకుంటున్నారు కదా.”
“ఇంట్లో గోడల మధ్యే బందీలా మారిపోయాను.
భర్త పక్కన లేకపోతే బయట అడుగు పెట్టలేను.
ఆయన పనికి వెళ్ళినప్పుడు, ఎప్పుడొస్తారా అని నేను గడియారం వైపే చూస్తుంటాను. ‘నువ్వు వీక్ అయిపోయావ్. ఎక్కడికీ వెళ్ళలేవు. వెళ్తే కుప్పకూలిపోతావు” అని మనసు చెప్తుంది.”
“మీ ఆలోచనలు మిమ్మల్ని పూర్తిగా పీడిస్తున్నాయి. మీరు ఎప్పుడూ ఒక judgmental voice వింటున్నట్టుగా అనిపిస్తోంది. అది ఎంత అలసట కలిగిస్తుందో నాకు అర్థం అవుతోంది. ఆ సమయంలో మీ శరీరం ఎలా స్పందిస్తోంది?”
“గుండె బలంగా కొట్టుకుంటుంది. శ్వాస ఆడకపోతే ఇప్పుడే చనిపోతాననిపిస్తుంది. కొన్ని సార్లు ‘ఇలాగే బతికే కంటే… చచ్చిపోవడం మంచిదేమో’ అనిపిస్తుంది.
కానీ నా భర్తకి ఇది చెప్పలేను. అతనికి మరింత భయం కలిగించకూడదనిపిస్తుంది. కానీ లోపల నరకం చూస్తున్నా డాక్టర్ గారు.”
“మీరు ఎంత బాధతో మాట్లాడుతున్నారో నాకు స్పష్టంగా తెలుస్తోంది. మీరు లోపల చాలా ఒత్తిడి, భయం మోస్తున్నారు. ఈ పరిస్థితిలో మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. నేను మీతోనే ఉన్నాను. మీరు ఎదుర్కొంటున్నదానికి పరిష్కారం ఉందని చెబుతున్నాను.”
“ఒకసారి ధైర్యం చేసి బయటికి వెళ్ళాను. కానీ మధ్యలోనే ఒళ్ళంతా వణికిపోయి, శ్వాస ఆడక, గుండె పట్టేసినట్టైంది. అక్కడే కుప్పకూలిపోయాను.
చుట్టుపక్కల వారు ఇంటికి తీసుకువచ్చారు. నా భర్త కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది. ఆయన రాత్రంతా నిద్రపోలేదు.”
ఆ మాటలు చెప్పినప్పుడు ఆమె కళ్ళలో ఒక్కసారిగా కన్నీళ్లు జలపాతంలా కారాయి. భర్త తనను ఓదారుస్తూనే, తలవంచి కళ్ళద్దాలు తీసి తుడుచుకున్నాడు. గదిలో వాతావరణం భారంగా మారింది.
“మీ భర్త కూడా మీ గురించి ఎంతగా ఆందోళన పడుతున్నాడో మీ మాటల్లోనే తెలుస్తోంది. మీరు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి కేవలం మీ సమస్య కాదు—మీ కుటుంబాన్ని కూడా తాకుతోంది. కానీ శివానీ, ఈ భయానికి ఒక పేరు ఉంది, దీని కోసం ఒక మార్గం కూడా ఉంది. ఇప్పుడు మనం దానిని అర్థం చేసుకుందాం.”
“శివానీ గారు, మీరు చెప్పిన అనుభవాలను విన్నాక నాకు స్పష్టమైంది—
ఇది మీ ఊహ కాదు, మీ బలహీనత కాదు.
ఇది ఒక రుగ్మత, దీనికి పేరు ఉంది: అగరాఫోబియా…”
“అంటే నాకు పిచ్చా డాక్టర్?” అని ఆందోళనగా అడిగింది.
” నో నో. అగరాఫోబియా ఒక రకమైన anxiety disorder, అంతే.
బయట ప్రదేశాలకు వెళితే మూర్ఛపోతానేమో, శ్వాస ఆడకపోతానేమో, పడిపోతానేమో అన్న భయంతో వ్యక్తి ఇంటికే పరిమితమవుతాడు. అంతే.”
“అంటే నా శరీరానికి ఏమీ లేదన్నమాటా? పరీక్షలన్నీ నార్మల్‌గానే వచ్చాయి…”
“అవును. మీ శరీరం సరిగానే ఉంది. కానీ మీ మైండ్ ‘డేంజర్ సిగ్నల్’ తప్పుగా ఇస్తోంది.
గుండె దడదడ కొట్టుకోవడం నిజమే—కానీ అది హార్ట్‌అటాక్ కాదు.
ఇది anxiety trigger. ఇది చాలామందికి వస్తుంది, మీరు ఒంటరిగా లేరు.”
“ఇది వచ్చిందని తెలుసుకోవడం ఎలా?”
“మీరు అనుభవించిన వణుకు, చెమటలు, శ్వాస సమస్యలు—ఇవన్నీ ఈ రుగ్మత యొక్క క్లాసిక్ లక్షణాలు.
ఒంటరిగా బయటికి వెళ్లలేకపోవడం
బస్సు, రైలు, మెట్రోలో ప్రయాణం భయంగా అనిపించడం
క్యూలో నిలబడలేకపోవడం
మాల్స్, వంతెనలు, పార్కింగ్ వంటి ప్రదేశాల్లో అసౌకర్యం
బయట అడుగు పెట్టడానికి ఎవరైనా తోడు కావాలని కోరుకోవడం
ఆరు నెలలకంటే ఎక్కువ కాలం ఇదే సమస్య ఉండడం… ఇవన్నీ కూడా దాని లక్షణాలే…”
“నేనేం పాపం చేశానని ఈ జబ్బు నాకు వచ్చింది సర్?”
“ఇది మీరు చేసిన తప్పు వల్ల కాదు.
పలు కారణాల వల్ల వస్తుంది:
జెనెటిక్స్ (కుటుంబంలో ఉంటే అవకాశం ఎక్కువ)
గతంలో ఎదురైన భయంకర అనుభవాలు
ఎక్కువ ఒత్తిడి
కొంతమంది వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు
ఇది ఎక్కువగా స్త్రీలలో, యువతలో కనిపిస్తుంది. చాలామంది ఈ సమస్యను అనుభవిస్తున్నారు, కాని చెప్పడానికి సంకోచిస్తారు. మీరు ధైర్యం చేసి ముందుకొచ్చారు” అని మెచ్చుకున్నాను.
” ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది?”
“అగరాఫోబియాను నిర్లక్ష్యం చేస్తే, అది డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు వరకు తీసుకెళ్ళవచ్చు. అందుకే మీరు కౌన్సెలింగ్ కోసం రావడం చాలా పెద్ద స్టెప్.”
“బయటపడే మార్గం ఉంది కదా డాక్టర్?”
“శివానీ గారు, దీని నుండి బయటపడటానికి మార్గం ఉంది. అది నిదానంగా జరుగుతుంది. యోగా, ప్రాణాయామం, డీప్ బ్రిథింగ్, విజువలైజేషన్ లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ మీకు భయపు క్షణాల్లో ఉపశమనం ఇస్తాయి.
మీరు భయపడే ప్రదేశాలకు క్రమంగా మళ్లీ మళ్లీ వెళ్ళడం. చిన్న అడుగులతో మొదలుపెట్టాలి.
మీ లైఫ్ స్టైల్ లో కూడా మార్పులు చేసుకోవాలి. ఎక్కువ కాఫీకి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర, వ్యాయామం అవసరం.
కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (CBT) ద్వారా ఈ భయాన్ని మీ మైండ్ రీ-ప్రోగ్రామ్ చేసుకోవచ్చు.
ఆందోళన మరీ ఎక్కువగా ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గర మందులు తీసుకోవాల్సి ఉంటుంది” అని వివరించాను.
ఆ తర్వాత థెరపీ ప్రారంభించాను.
శివానీ కేస్ లో మూడు కోణాలు స్పష్టంగా కనబడ్డాయి:
1. Fear as Prison: మొదట bus, metroలో భయం. ఆపై shop, street. చివరకు “ఇంటి గడప దాటకూడదు” అనే rule.
2. Loss of Identity: ఉద్యోగం, స్నేహాలు, personal freedom… అన్నీ పోయాయి. “నేను ఇక useless” అన్న guilt పెరిగింది.
3. Hope through Exposure – భయాన్ని avoid చేస్తే అది ఇంకా ఇంకా పెరుగుతుంది. చిన్న చిన్న అడుగులు వేసి, భయాన్ని face చేస్తే అది dissolve అవుతుంది. Relaxation techniques, CBT, support groups—అన్నీ కలిసి healing ఇస్తాయి…
చిన్న విజయం.. ఆశాకిరణం…
కొన్ని వారాల తరువాత… శివానీ మళ్లీ therapy కి వచ్చింది. ఈసారి ముఖంలో కొద్దిగా కాంతి కనిపించింది.
“డాక్టర్… నిన్న నేను నా భర్తతో కలిసి మెట్రోలో రెండు స్టేషన్లు ప్రయాణించాను. మొదట్లో గుండె వేగంగా కొట్టుకుంది. కానీ మీరు నేర్పిన deep breathing చేసి కంట్రోల్ చేసుకున్నాను. నేను భయాన్ని కొంచెం ఓడించాను అనిపించింది ఫస్ట్ టైమ్.”
ఆమె కళ్ళలో కనిపించిన ఆ చిన్న spark — అదే Agoraphobia పై మొదటి విజయం.
“చూశారా? మీరు ఈ సమస్య నుంచి బయటకు రావచ్చు. ఒక్కొక్క చిన్న అడుగుతో మీరు గతంలో ఉన్నట్లే ఉండగలరు. మీరు ఒంటరి కాదు, ఈ ప్రయాణంలో నేను మీతోనే ఉన్నాను” అని భరోసా ఇచ్చాను.
ఇది శివానీ ఒక్కరి కథ కాదు. వేలాది మంది ఇళ్లలో ఇలాంటివే చెప్పలేని భయాలు కనిపించని జైళ్లను తయారుచేస్తాయి.
– “బయటకెళ్లొద్దు” అన్న parental over-protection.
– “ఏదో జరుగుతుందేమో” అన్న anxious imagination.
– “ఇలా ఉంటేనే safe” అన్న false belief.
ఇవన్నీ మనసు వేసే కనిపించని సంకెళ్లు.
కానీ నిజం ఏమిటంటే: భయం ఎప్పుడూ 100 శాతం నిజం కాదు. ఎదుర్కోవడమే విముక్తి.
Parents కి Takeaway
మీ పిల్లల్లో ఇలా social fears, unexplained anxiety కనిపిస్తే వెంటనే గమనించండి.
మొదట “నువ్వు safe, నేను నీతో ఉన్నాను” అని empathy ఇవ్వండి.
తర్వాత professional support తీసుకోండి.
Question for you: Healthy fear (protects you), unhealthy anxiety (paralyzes you) మధ్య తేడా మీకు ఏం అనిపిస్తుంది?
—- సైకాలజిస్ట్ విశేష్
Founder, Genius Matrix Hub
మానసిక సమస్యలుంటే, అశ్రద్ధ చేయకుండా వెంటనే psyvisesh dot com లో సెషన్ బుక్ చేసుకోండి. లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి… 8019 000066
Share this Article