Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మా వాణిశ్రీని చంపేస్తాడా..? అందుకే ఈ దర్శకుడి మీద నాకెప్పుడూ కోపమే..!

June 6, 2026 by M S R

.
Subramanyam Dogiparthi … ఈ సినిమా ఎప్పుడు చూసినా నాకు ఇ వి వి సత్యనారాయణ మీద కోపం వస్తూ ఉంటుంది . చంపదలచుకుంటే మణిమాలని చంపొచ్చు కదా ! ఈ సినిమా టైంకు కూడా ప్రౌఢ అయినా వాణిశ్రీ అందంగానే ఉంటుంది . అలాంటి అందగత్తె వాణిశ్రీని చంపటం అన్యాయం కదా !!

ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఒకే రకమైన కధాంశంతో ఈ సీతారత్నం గారి అబ్బాయి , అత్త సొమ్మ అల్లుడు దానం రెండు సినిమాలు వచ్చాయి . అంతే కాదు . తారాగణం కూడా ఆల్మోస్ట్ సేం . అయితే రెండింటిలో ఈ సీతారత్నం గారి అబ్బాయి ప్రేక్షకులకు బాగా నచ్చింది . బాగా ఆడింది . బాగుంటుంది కూడా .

ఓ గ్రామంలో అందరి చేత గౌరవించబడే స్త్రీమూర్తి వాణిశ్రీ . ఎప్పుడో కాలు జారాడని భర్తను దూరం పెడుతుంది . ఆ విరహాన్ని భరించేందుకు భర్త సత్యనారాయణ తాగుడుకి అలవాటు పడతాడు . ఆమెకో విలన్ అన్నయ్య కోట శ్రీనివాసరావు , మేనకోడలు రోజా , మేనల్లుడు శ్రీకాంత్ .

Ads

ఆ ఊరి ఆంధ్రా బాంకులో పనిచేయటానికి వచ్చిన హీరో వినోద్ కుమార్ ఆమె ఇంటికే చేరుతాడు . అతని తల్లి మణిమాల రావటంతో సత్యనారాయణకు వినోద్ కుమార్ మణిమాల ద్వారా కలిగిన కొడుకుగా తెలుసుకుంటాడు .

కొన్నాళ్ళకు వినోద్ కుమార్ తన భర్త మొదటి భార్య కొడుకు అని తెలవటంతో సీతారత్నం గారికి కోపం ఇంకా పెరుగుతుంది . క్లైమాక్సు సీన్ ఇవివి బాగా మలిచాడు . ఇష్టం లేని పెళ్ళిని వదిలించుకోవటానికి అమ్మ వారి గర్భగుడిలోకి వెళ్లి బట్టలను బయటకు విసిరేస్తుంది . వినోద్ కుమార్ ఆ బట్టలను తీసుకుని లోపలికి వెళ్లి రోజాను బయటకు తీసుకుని వస్తాడు .

అందరూ సీతారత్నం వద్దకు చేరుతారు . అప్పటికే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది . తన మేనకోడలు మెళ్ళో కట్టమని తాళి ఇస్తుంది . ఆమె అంత్యక్రియలతో సినిమా ముగుస్తుంది . సినిమాను ఇవివి చాలా బిర్రుగా నడిపిస్తాడు .

రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . డ్యూయెట్ల చిత్రీకరణ రొమాంటిగ్గా కూడా ఉంటాయి . బాగా పాపులరయిన డ్యూయెట్ మేఘమా మరువకే మోహమా విడవకే . అలాగే ఆ పాపికొండల్లో ఈ పాప గుండెల్లో , మత్తుగా గమ్మత్తుగా చిత్తుగా చెంగొత్తగా డ్యూయెట్లు . ఈ మూడూ వినోద్ కుమార్ , రోజాల మీదే .

నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి అంటూ సాగే హుషారయిన పాట రోజా మీద ఉంటుంది . రోజా బోలెడంత గ్లామర్ ఒలకబోస్తుంది. పసివాడో ఏమిటో ఆ పైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు అనే విషాదభరిత పాటలో కావలసినంత వేదాంతం ఉంటుంది . వేటూరి , సిరివెన్నెల , భువనచంద్ర పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , చిత్ర , శైలజ శ్రావ్యంగా పాడారు . డాన్సుల్ని శివ సుబ్రమణ్యం , ఏంథొనీ , దిలీప్ , సునీత బాగా కంపోజ్ చేసారు .

సినిమా కధ క్రెడిట్‌ను ప్రొడక్షన్ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలింస్ యూనియనుకు ఇవ్వటం జరిగింది . డైలాగులను యల్ బి సుబ్రమణ్యం బాగా వ్రాసారు . బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాత . దర్శకుడు ఇవివి ఖాతాలో మరో పాపులర్ సినిమా .

1992 సెప్టెంబరులో రిలీజయిన ఈ సినిమాలో వాణిశ్రీ , సత్యనారాయణ , రోజా , వినోద్ కుమార్ , మణిమాల , నిర్మలమ్మ , కోట శ్రీనివాసరావు , అనిత , శ్రీకాంత్ , బాబూమోహన్ , బ్రహ్మానందం , వాసుకి (పాకీజా) , చిడతల అప్పారావు , జిత్ మోహన్ మిత్రా  తదితరులు నటించారు .

తరచూ ఏదో ఒక టివి చానల్లో వచ్చే ఈ సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే చూడవచ్చు . It’s a romantic entertainer . వాణిశ్రీ , రోజా అభిమానులు మరోసారి కూడా చూడవచ్చు . బోర్ కొట్టదు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హెరిటేజ్ ఆనవాళ్ల పరిరక్షకుడు- ఈ ఆగాఖాన్ ఎవరో తెలుసా?
  • KTR ట్వీట్లు, ఆరోపణలు సరే… ఇంతకీ ఠాణాలో దాడి ఘటన జరిగిందా?
  • ట్రూ కామ్రేడ్ వెళ్లిపోయాడు – ఆ ఎరుపు రంగూ వెలిసిపోయింది !!
  • అచ్యుతం కేశవం … బాగున్నట్టే ఉంది… కానీ ఏదో తెలియని అసంతృప్తి !!
  • GDN – మాధవన్ మరో మంచి పాత్ర! చూడదగిన ఓ బయోపిక్ !!
  • 72 వేల మందికి పీఆర్సీ కట్?… అపోహలేమిటి – నిజాలేమిటి?
  • ‘ది హిందూ’ ఎందుకు గుంజీలు తీసింది? తను చేసిన తప్పేమిటంటే?
  • తెలంగాణ రెడ్లు, కోమట్లు – వందల తరాలుగా ఓ జన్యులోప వారసత్వం!!
  • కొరగాని వారసులు! ఘోషిస్తున్న బాల్ ఠాక్రే ఆత్మ! – అసలెవరు ఈ దిశా ?
  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions