.
బిగ్ బ్రేకింగ్: కేసీఆర్ సర్కార్‌పై సంచలన ఆరోపణ! 2 లక్షల ఓటర్ల ఫోటోలు మిస్ యూజ్!
ఓటర్ల గుట్టు లీక్ చేసిందా? ECIకి తెలంగాణ CEO సీక్రెట్ లెటర్!
Ads
అబ్బో… ఈ వార్త తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఏకంగా 2 లక్షల 16 వేల మంది ఓటర్ల ఫోటోలు, వివరాలు తప్పుగా వాడుకుందని (Misuse) తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి (CEO) కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) రాసిన ఒక లేఖ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది…
ఓటర్ల వివరాలు గోప్యంగా ఉంచాల్సింది పోయి, వాటిని అడ్డగోలుగా వాడేశారని ఈ లేఖలో రాశారు… ఒక రిపోర్టింగ్ సంస్థ చేసిన దర్యాప్తులో ఈ విషయం బయటపడింది…
అసలేం జరిగింది?
శ్రీనివాస్ కొడాలి అనే రీసెర్చర్ నెల రోజుల క్రితమే ఈసీకి ఈ మోసం గురించి చెప్పారు… ఆ తర్వాతే మన రాష్ట్ర సీఈఓ ఈ లేఖ రాశారు…
ఓటరు-ఆధార్ లింకింగ్ పేరుతో…: ఓటరు కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది… ఈ పర్మిషన్ తోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఓటర్ల డేటాను యాక్సెస్ చేశాయి…
ఫేస్ రికగ్నిషన్ వాడకంలో: 2019 నుండి 2021 వరకు, తెలంగాణ ఐటీ విభాగం… సీఈఓ API నుండి ఓటర్ల ఫోటోలు తీసుకుని, వాటితో ‘ముఖ గుర్తింపు’ (Facial Recognition) ఆధారంగా పెన్షన్ దారులు బ్రతికే ఉన్నారా లేదా అని చెక్ చేసే సిస్టమ్‌ను నడిపింది… ఇందులో 2,16,488 మంది ఓటర్ల ఫోటోలు వాడారు..!
సీక్రెట్ మొత్తం అక్కడే ఉంది!
సాధారణంగా ఈ లింకింగ్ అంతా ECI మెయిన్ సర్వర్స్‌లో జరగాలి… కానీ మన BRS ప్రభుత్వం మాత్రం… తమ సొంత డేటా సిస్టమ్స్‌లో ఈ పని చేసింది…
సీఈఓ ఏమంటున్నారంటే…: “ఇక్కడే అసలు సమస్య మొదలైంది… ఒకసారి డేటా తమ సిస్టమ్‌లోకి వచ్చాక, కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ రద్దు చేసినా… డేటా మాత్రం ప్రభుత్వంతోనే ఉండిపోయింది… సీఈఓకు చెప్పకుండానే వాడేశారు!” అని చెప్పారు…
ప్రైవేట్ కంపెనీల ప్రమేయం?
పెన్షన్ ధృవీకరణ లాంటి పనుల కోసం ‘Posidex’ అనే ప్రైవేట్ కంపెనీతో పని చేయించారు… ఈ కంపెనీ ఓటర్ల ఫోటోలను, ఇతర డేటాను కలిపేసి కొన్ని సర్వీసులు డెవలప్ చేసింది…
గమనించాల్సిన విషయం ఏంటంటే: ఈ ఓటర్ల డేటాను తీసుకెళ్లి, రాష్ట్రంలోని అన్ని వివరాలు ఉండే SRDH (State Resident Data Hub) లో పెట్టేశారు…
సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత ఈ వాడకం ఆగిపోయినా… ప్రభుత్వం ఆ డేటాను చెరిపేయకుండా తమ దగ్గరే ఉంచుకుంది!
సీఈఓ రెడ్డి గారు, ప్రైవేట్ కంపెనీలకు యాక్సెస్ ఉందా అని ప్రభుత్వాన్ని అడిగితే… వాళ్లు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటవేశారు!
పరిశోధకుడు కొడాలి రియాక్షన్: “తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి, ముఖ గుర్తింపు కోసం ఫోటోలు తప్పుగా వాడారని ఒప్పుకుంటున్నారు… కానీ దానిపై యాక్షన్ తీసుకోవడానికి మాత్రం ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు” అని శ్రీనివాస్ కొడాలి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు… ఈ మొత్తం రిపోర్ట్ ఇప్పుడు ECI దగ్గర ఉంది. దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి….
Share this Article