Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి… అయ్యో, కేసు పెట్టేసి జైళ్లో వేస్తారా..?!

October 26, 2025 by M S R

.

#MegastarChiranjeevi వ్యక్తిత్వ హక్కులకు ఇంటరిమ్ ఇంజంక్షన్‌ను మంజూరు చేసిన కోర్ట్

ముందుగా ఓ వార్త చదవండి… హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి 26 సెప్టెంబర్ 2025 తేదీ నాటి I.A. No.6275 of 2025 in O.S. No.441 of 2025లో ప్ర‌ముఖ న‌టుడు కొణిదెల చిరంజీవికి అనుకూలంగా అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు) మంజూరు చేసింది.

Ads

ఈ ఉత్తర్వు ప్రకారం పిటిషన్‌లో పేరు పొందిన పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి/ ఏ సంస్థైనా, చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్‌ తదితర గుర్తించదగిన లక్షణాలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం నిషేధించబడింది…

నలభై ఏళ్లకు పైగా చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించి పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి గౌరవాలందుకున్న చిరంజీవి, తన పేరు/చిత్రం/ప్రసిద్ధ సినీ శీర్షికలును అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌ మొదలైన వేదికలపై వినియోగించడం, అలాగే కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపాంతరం చేసిన (మార్ఫ్ చేసిన) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపేందుకు కోర్టు జోక్యం కోరారు…

భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా, ఉన్నత వ్యక్తిత్వంగా చిరంజీవి స్థానాన్ని గుర్తిస్తూ, పేరుపెట్టి, చిత్రాలు తీసుకొని, వీడియో- మీమ్స్ చేసి, అనుమతి లేని విక్రయాలు మొదలైన చర్యల ద్వారా ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని ప్రస్తావించింది. ముఖ్యంగా డిజిటల్, AI వేదికల ద్వారా జరిగే వాణిజ్యపు దోపిడి, తప్పుడు ప్రతిరూపణ వల్ల అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు గమనించింది…

ఈ నిషేధాజ్ఞ ప్రకారం ఎవరు అయినా సరే— చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ (ఉదా: “MEGA STAR”, “CHIRU”, “ANNAYYA”), స్వరము, చిత్రం లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ ఉపయోగించటం నుంచి వెంటనే నిరోధించబడుతున్నారు.

టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు/సంస్థలు, TRPs పెంచడం, వీక్షణలను/ లాభాలను పొందడం వంటి ఉదేశ్యాలతో, చిరంజీవి పేరు, చిత్రం, స్వరము, లైక్నెస్ లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, తప్పుగా ప్రతిబింబించడం లేదా వక్రీకరించడం చేస్తే, చట్టం అనుమతించే కఠినమైన పరిహారాలు అమలు చేయబడతాయని ఈ ఉత్తర్వు స్పష్టంగా హెచ్చరిస్తుంది… తద్వారా ఆయన ఖ్యాతి, మేధసంపత్తి రక్షణను పటిష్టంగా అమలు చేస్తుంది…

అక్టోబర్ 11న చిరంజీవి హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్‌ని కలసి కోర్టు ఉత్తర్వుల ప్రతిని వ్యక్తిగతంగా అందజేశారు… ఈ సందర్భంగా ఇటువంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు శిక్షా చట్టాలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరంపై ఇరువురు సవివరంగా చర్చించారు… చిరంజీవి ఈ చట్టపరమైన చర్య, భారత వినోద రంగంలో వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ప్రాముఖ్యతను బలపరుస్తుందని సజ్జనార్ నొక్కిచెప్పారు…

megastar



గుడ్… చిరంజీవి ఫోటోను వాడుకోవడం తప్పు… అగ్రీడ్…

గుడ్… చిరంజీవి ఎఐ ఫోటోలు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్పు… అగ్రీడ్…

గుడ్… చిరంజీవి ఇమేజ్‌‌ను దుర్వినియోగం చేస్తూ మీమ్స్ చేయడం తప్పు… అగ్రీడ్…

గుడ్… అగ్ర హీరో, పద్మవిభూషణ్, మెగాస్టార్ అన్నీ వోకే… వరల్డ్ క్లాస్ టాప్ స్టార్ అని చెప్పుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు… అగ్రీడ్…

గుడ్… అసలు ఈ విశ్వం ఇలాంటి వ్యక్తిని చూసి ఉంటుందా అని ఎవరైనా భావిస్తే అది వారి స్థాయి… అగ్రీడ్…

గుడ్… ఈరోజుకూ పిచ్చి స్టెప్పులు, బేకార్ ఫైట్ల స్థాయిని దాటకుండా పద్మవిభూషణ్ సాధించడం ఓ ప్రపంచ రికార్డు… అగ్రీడ్…

గుడ్… పద్మ పురస్కారాలకు పెద్దగా లెక్కలేమీ ఉండవు కాబట్టి పద్మవిభూషణ్ ఏం ఖర్మ… చల్లని మోడీ కరుణ ఉంటే భారత రత్న, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పెద్ద కష్టమేమీ కాదు, పవన్ కల్యాణ్ అనే తమ్ముడూ ఉండనే ఉన్నాడు… అగ్రీడ్…

ఎటొచ్చీ… చిరంజీవి, అన్నయ్య, మెగాస్టార్ అనే పదాల దగ్గరే అభ్యంతరం, సందేహం… ఏం..? ఆ పదాలపై పేటెంట్లు ఉన్నాయా..? ఉంటాయా..? అవి చట్టబద్ధమేనా..?

  • నా తమ్ముడిని ఆశీర్వదిస్తూ ‘చిరంజీవి — కు ఆశీస్సులు, ఇట్టు మీ అన్నయ్య అని పోస్టు పెడతాను, జైలులో వేస్తారా..,?
  • చిరంజీవ అనేది లక్షల ఏళ్లుగా ఈ భారతావనిలో ఓ ఆశీస్సు… దానికీ పేటెంట్ ఉందా..? ఈ శివశంకర వర ప్రసాద్‌కు..? అయితే ఎవరు ఇచ్చారు..?
  • అన్నయ్య అనేది కోట్ల తెలుగు కుటుంబాల్లో ఓ రక్త, కుటుంబబంధం… అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో సహజమైన ఆత్మీయ పలకరింపు… సోకాల్డ్ ఈ కేరక్టర్‌కు పేటెంట్ ఎవరిచ్చారు..?
  • మెగాస్టార్ అని మనం ఏ సిల్వెస్టర్ స్టాలోన్, ఓ రజినీకాంత్, ఓ అమితాబ్ బచ్చన్, అంతెందుకు, మోడీనే పొలిటికల్ మెగాస్టార్ అంటాం… కేసులు పెట్టి జైలులో వేస్తారా..?

 

  • ఆ పదాలే కాదు, తన చిత్రాలు, తన పాటలు ఏవీ వాడుకోకూడదట… అంటే, అమ్మడూ కుమ్ముడూ వంటి అత్యంత పౌరాణిక పదాలను కూడా వాడుకోకూడదట… పైగా అవన్నీ చిరంజీవి వ్యక్తిత్వ లక్షణాలట… ప్చ్, మనం ఇన్నాళ్లూ వ్యక్తిత్వం అంటే, వ్యక్తిత్వ లక్షణాలు అంటే ఏమేమో అనుకున్నాం కానీ, కాదట..!

ఇక్కడ చిరంజీవిలాగే అత్యంత గౌరవనీయులైన సజ్జనార్‌ గారికి ఓ అమాయకపు ప్రశ్న… మీ పేరుతో ఎవడో ఈ ప్రకటనలు విడుదల చేయడం ఏమిటి..? యు కెన్ గివ్ క్వారిటీ కదా… పైన ప్రశ్నలకు సజ్జనార్ బాధ్యత వహిస్తున్నాడా..? చిరంజీవి, అన్నయ్య పదాలపై ఆయనకు పేటెంట్ రైట్స్ ఉన్నాయని సమర్థించుకోగలడా..? పైగా ఇంకా కఠిన చట్టాలు కావాలా..? సజ్జనార్ ఈ మాయ సినీప్రపంచంలో పడిపోతున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి సజ్జనార్ అన్నయ్యా… ప్లీజ్, పోలీసు పోస్టు, లాఠీ, డ్రెస్సుతో గాకుండా సమాధానం చెప్పాలని ఆశిస్తూ……. తెలంగాణ పోలీసు శాఖలో ఓ మెగాస్టార్ చిరంజీవి సజ్జనార్ అన్నయ్యా… యువార్ గ్రేట్… ఇట్లు… ఓ మెగాస్టార్ అభిమాని..!!



డియర్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యా… నీకో సంగతి చెప్పాలి, నువ్వు గొప్ప తెలివికలవాడివి కాబట్టి ఇట్టే అర్థం చేసుకోగలవు…. బ్రహ్మానందం అంటే నవ్వుకు ఓ ఐకన్ అయ్యాడు… జోక్స్, మీమ్స్, సోషల్ పోస్టులు… వాట్ నాట్… లక్షలుగా, కోట్లుగా…. అరె, ఆపేయండ్రోయ్ అనలేదు… తెలుగువారిలో హాస్యానికి చిరునామా, యూఆర్ఎల్ అయ్యాడు తను… నో, నో, నీకు తెలియదని కాదు… నువ్వు చాలా గొప్పోడివి కదా, అసలే మోడీకి అత్యంత ప్రియమైన వాడివి…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎహెఫో… ట్రంపుకి ఇండియా తాజా సందేశం… రష్యాలో భారీ యూరియా ప్లాంట్…
  • శ్రీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి… అయ్యో, కేసు పెట్టేసి జైళ్లో వేస్తారా..?!
  • కృష్ణ సాహసి..! ఆరోజుల్లో ఎన్టీయార్‌ను ఢీకొట్టడం అల్లాటప్పా కాదు మరి..!!
  • ఎస్… రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ, మద్దతు ఇవ్వకపోతే… మొదటికే మోసం.,.!!
  • దమ్మున్న జర్నలిస్టు అంటే..? సీఐఏకే చుక్కలు చూపించిన ఈ కేరక్టర్..!!
  • ఒక మంచి ప్రేమకథ… కథలో లీనమైతే కళ్లు తడిపేసే ‘ప్రేమకథ’…
  • తాష్కెంట్-2… ఓ విఫల కుట్ర… నిజంగా మోడీని పుతిన్ రక్షించాడా..?!
  • శంఖు పుష్పం..! అందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం… వ్యాపారం..!!
  • పదండి పోదాం, పదండి తోసుకు… పోదాం పోదాం వెనక్కి వెనక్కి…!!
  • ప్రపంచ టాప్-3 సైంటిస్టుల జాబితాలో… వరుసగా మూడేళ్లూ స్థానం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions