.
నెట్‌లో ఓ డిస్కషన్ సాగుతోంది… అందెశ్రీ సినిమాలకు కూడా పనిచేశాడు కదా… ఒకరూఇద్దరు మినహా టాలీవుడ్ పెద్దల్లో ఒక్కడైనా సంతాపం ప్రకటించాడా..? బన్నీ తన తెలివితక్కువతనానికి ఒక్కరోజు జైలుపాలయితే అదేదే కుట్రకేసు అన్నట్టుగా టాలీవుడ్ కేరక్టర్లు అన్నీ సంతాపం, మద్దతు ప్రకటించడానికి బన్నీ ఇంటి ఎదుట పొర్లుదండాలు పెట్టాయి కదా… ‘మెగా విషాదం’ అన్నాయి కదా…
మరి ఓ తెలంగాణ ఆత్మకవి అందెశ్రీ మరణం వారికెందుకు పట్టలేదు..? అవన్నీ ఎందుకు..? కీరవాణి కంపోజర్‌ను పిలిచి తెలంగాణ రాష్ట్ర గీతానికి ట్యూన్ కట్టమన్నారు కదా… బోలెడంత డబ్బు ఇచ్చారు కదా… ఓ చెత్తా ట్యూన్ ఇచ్చాడు కదా… ఐనా తెలంగాణ ఓన్ చేసుకుంది కదా…
Ads
తన మీద వచ్చిన విమర్శలకూ అందెశ్రీయే డిఫెండ్ చేసుకొచ్చాడు… తను మరణించాడు కదా… మీకెక్కడైనా కీరవాణి అనే మనిషి కనిపించాడా… మాయమైపోయాడా…?
.
నాకైతే ఓ ట్వీట్ గానీ, ఓ పోస్టు గానీ కనిపించలేదు, ఓ సంతాప ప్రకటన లేదు… ఈ మనిషికి అందెశ్రీ పట్ల కనీస కృతజ్ఞత కూడా లేదా..?
.
జయజయహే తెలంగాణ గీతానికి కీరవాణి కట్టిన ట్యూన్ ఏమాత్రం పవర్‌ఫుల్‌గా ఓ పోరాట, ఓ రాష్ట్రగీతం స్థాయిలో లేదు అంటే అందెశ్రీ ఒప్పుకోలేదు… ఆ విమర్శ చేసిన వాళ్ల మీదే కోపగించాడు, అంటే కీరవాణికి కోట్ల డబ్బే కాదు, తన మీద విమర్శలకూ అడ్డుగా నిలిచాడు…
.
నీకు ఒక్క తెలంగాణ కంపోజర్ దొరకలేదా అనే ప్రశ్ననూ ఎదుర్కున్నాడు తను… సరే, ఆ పాటతో అందెశ్రీది నెత్తుటి ఉద్వేగ బంధం… కీరవాణిదేముంది..? జస్ట్, ఓ కరెన్సీ నోెట్ల బంధం… నిజానికి అందెశ్రీ పార్థివశరీరం మీద పూలు జల్లి, నివాళి అర్పించాల్సినవాడు… మరి ఏమయ్యాడు..?
.
ఈ రాజమౌళి కుటుంబమంతా ఇంతేనా..? పక్కా కమర్షియల్ బందీలేనా..?
దీనికి రచయిత, నిర్మాత, దర్శకుడు ప్రభాకర్ జైనీ స్పందన ఏమిటంటే..? ఆలోచించాల్సిన విషయమే…
‘‘మనం వాళ్ల నుంచి ఆ సంస్కారం ఎక్స్ పెక్ట్ చేయడమే తప్పు. ముఖ్యమంత్రితో ప్రయోజనాలు పొందాలని తప్పితే, స్టూడియోలకు స్థలాలు పొందడానికి, సినిమాలకు రాయితీలు పొందడానికి తప్పితే, #సినిమా_వాళ్ళెవరికీ, తెలంగాణా పట్ల ఎటువంటి అభిమానం లేదు.
- తెలంగాణా ఉద్యమం సమయంలో ఈ సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ ఉద్యమ గీతం రాయమని అడిగితే ఉచ్చలు పోసుకున్నరు. ‘మా పొట్ట గొట్టుకుంటమా?’ అని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇప్పుడు సిగ్గు లేకుండా, ముఖ్యమంత్రి ముందర కూర్చుని తెలంగాణా సాంస్కృతిక అభ్యుదయం గురించి మాట్లాడుతున్నారు.
ఇంకొకడు, ఉత్తేజ్ అనే థర్డ్ గ్రేడ్ జోకర్, తెలంగాణా ఉద్యమంలో 1200 మంది ఆత్మాహుతి చేసుకుంటే, తాగి పండుకున్నడు గాని, ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదు గాని, వైజాగ్ లో ‘హుదూద్’ తుపాను వస్తే మాత్రం హృదయం కరిగి కవితలు రాసిండు జోకర్ గాడు. వీళ్ళిద్దరూ కేసీయార్ ముందు కూర్చుని సినిమా రంగ అభివృద్ధికి సలహాలు ఇచ్చారు. అశోక్ తేజకు, ఈ ప్రభుత్వమైతే ఏకంగా కోటి రూపాయలిచ్చి, అపవిత్రమయింది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యస్ పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తెలంగాణా పాట పాడమని అడిగితే నిరాకరించాడు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడినా, ఈ సినిమా వాళ్ళు, ఇంకా జలగల్లా మనను పీక్కు తింటూనే ఉన్నారు. సినిమా రంగంలో తెలంగాణా నటులు, టెక్నీషియన్స్ తమది తెలంగాణా అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు.
‘జయజయహే’ పాటను ఖూనీ చేసినవాడు ఆ గేయాన్ని రాసిన అందెశ్రీకి నివాళి అర్పిస్తాడని ఎలా అనుకున్నారు. సినిమా రంగం నుంచి ఏ ఒక్కరైనా స్పందించారా?
.
ఇదంతా మన దురదృష్టం ! మనం ఇంకా సెకండ్ గ్రేడ్ సిటిజెన్స్ మాదిరిగానే హైదరాబాదులో బ్రతుకుతున్నాము. ఇప్పటికీ తెలంగాణా వారికి కొన్ని అపార్టుమెంట్లలోకి ప్రవేశం లేదు. ఫ్లాటు కొనడానికి కూడా వీలు లేదు. Even now, as of today. నాకే జరిగింది…..
Share this Article