Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇక పనికిరాదా..!?

November 16, 2025 by M S R

.

ఓ కార్టూన్ కనిపించింది… మోడీ ఓ మృత్యుదూతలా వరుసగా ఒక్కో ప్రతిపక్ష నాయకుడి భరతం పడుతున్నట్టుగా… ఇక తరువాత వంతు మమతదే అని కార్టూన్ సారాంశం… మొన్నటి బీహార్ విజయ ప్రసంగంలో కూడా మోడీ చెప్పింది కూడా అదే…

ఉద్దవ్ ఠాక్రే, భూపేందర్ సింగ్ హూడా, అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడు తేజస్వి యాదవ్… తరువాత మమత… ఇదీ సీక్వెన్స్… హూడా, కేజ్రీవాల్, లాలూ… అందరిపైనా కేసులున్నయ్… ఒక్కొక్క రాష్ట్రంలో ఇక బీజేపీ లేదా ఎన్డీయే కూటమికి తిరుగులేకుండా విజయప్రస్థానం సాగుతోంది… ఎటొచ్చీ మోడీకి మింగుడపడనిది, దక్షిణభారతం…

Ads

మొన్నటి బీహార్ విజయం వెనుక మోడీకి సపోర్టుగా ఎన్నికల కమిషన్ కుట్ర ఉందని ప్రచారం బలంగానే సాగుతోంది… ఆర్జేడీ కూటమి బొక్కబోర్లా పడటానికి విశ్లేషకులు చాలా కారణాలు చెబుతున్నారు… అందులో ఒకటి… 1) ఆర్జేడీ ఎంవై ఫ్యాక్టర్ మాత్రమే నమ్ముకుంది… అంటే ముస్లిం, యాదవ్… మళ్లీ ఆ పాత జంగిల్‌రాజ్, మాఫియారాజ్ పాలన వస్తుందేమోనని మిగతా ఓబీసీలు ఠారెత్తిపోయారని ఒక కారణం… 2) మోడీ కూడా ఎంవై ఫార్ములానే నమ్మాడు… అంటే మహిళలు, యువత… మహిళా వోట్లు ఎక్కువ, అందరికీ పదేసి వేలు ఇచ్చి ఒక్క ముక్కలో చెప్పాలంటే వోట్లు సర్కారీ సొమ్ముతో అధికారికంగా కొన్నాడు.,.

నిజానికి ఆ స్థానిక సమస్యల్ని, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వదిలేసి… రాహుల్ గాంధీ ఈ ఎన్నికల ప్రచారాన్ని చెడగొట్టాడు… ఆర్జేడీ ఆశలపై నీళ్లు గుమ్మరించాడు… వోట్ చోరీ… అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు అని తననుకున్నాడు తప్ప అవేమీ పేలలేదు… తరువాత సర్… అదీ ఎవరూ నమ్మలేదు… దొంగ వోట్లు తొలగిస్తే తప్పేమిటి అన్నారు జనం… ఆ వోట్లు పోయాయి కాబట్టే, ఇన్నాళ్లూ వాటిని నమ్ముకున్న ఆర్జేడీ కూటమి ఓటమి పాలైంది…

ఓటర్ సాధికార యాత్ర అని పర్యటించారు… 110 చోట్ల పర్యటిస్తే, ప్రచారం చేస్తే ఒక్కచోట కూడా గెలవలేదని విశ్లేషకుల వివరణ… 61 సీట్లలో పోటీచేస్తే వచ్చినవి 5… అవీ చచ్చీచెడీ… ఇక్కడ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్ కుట్రల దాకా వెళ్లడం లేదు గానీ… యువతకు రాహుల్ వైఖరి నచ్చకపోవడానికి బోలెడు కారణాలు… అవి తనకు అర్థం కావు, చెప్పేవాళ్లు లేరు…

విదేశాల్లోకి వెళ్లి ఇండియా పరువు తీయడం… ప్రతి అంశానికీ ఆర్ఎస్ఎస్‌ను ముడిపెట్టడం.., ప్రధానంగా తను ఇండియన్ సిస్టమ్స్‌ను డిమోరల్ చేస్తున్నాడు… ఆర్మీ, ఎన్నికల సంఘం, బడ్జెట్ టీం… ఇలా తను ఎద్దేవా చేయని, విమర్శించని ప్రధాన రంగం లేదు… ఓ ప్రమాదకరమైన రాజకీయ క్రీడ… ఇప్పుడే కాదు…

మోడీని దెబ్బతీయడానికి… దేశంలో అంతర్గత సంక్షోభాలకూ, అల్లర్లకూ ప్రయత్నించడం… జెన్ జీ ఆందోళనల్ని కోరుకోవడం..! ఇప్పుడే కాదు… పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఈవీఎంల దగ్గర నుంచి… వ్యవసాయ చట్టాలు, ఢిల్లీలో ఆందోళనలు… చివరకు ఈ దేశ రక్షణకు, ఉగ్రవాదంపై యుద్ధానికి సంబంధించిన సర్జికల్ స్ట్రయిక్స్‌ను కూడా అనుమానించి వ్యాఖ్యలు చేయడం…

హిందూ జాతి ఆత్మగౌరవ పోరాటానికి చిహ్నంగా భావించే అయోధ్య విషయంలోనూ కాాంగ్రెస్ సరైన ధోరణి కనబర్చలేదు… మైనారిటీలకు కోపం వస్తుందని భయం… అటువైపే మొగ్గు… కాంగ్రెస్ ప్రదర్శించే హిందూ వ్యతిరేక ధోరణి కూడా హిందూ వోటు సంఘటనకు దారితీస్తోందనే స్పృహ రాహుల్‌లో గానీ, తనను నడిపించే కోటరీలకు గానీ లేకుండా పోయింది… (అంతర్గతంగా అన్‌రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించే పాకిస్థాన్ ప్రేరేపిత శక్తులు, చైనా ప్రేరేపిత ఎర్ర శక్తులు కూడా క్రమేపీ హిందూ సంఘటనను పెంచుతున్నాయి…)

rahul

ఇలా అనేకం… రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ 95 పరాజయాల్ని పొందిందని ఓ చార్ట్ ఇప్పుడు బాగా కనిపిస్తోంది సోషల్ మీడియాలో… ఐతేనేం..? కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబ వారసత్వ నాయకత్వం నుంచి బయటపడదు… బయటపడితే ముక్కలుచెక్కలయ్యే సిట్యుయేషన్… దీనికితోడు రాహుల్ అపరిణత వ్యక్తిగత సంబంధాలు కూడా పార్టీ క్షీణతకు కారణం, ఉదాహరణ అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ…

తను కీలక విషయాలను చర్చించడానికి రాహుల్ నివాసానికి వెళ్తే… పెంపుడు కుక్కలకు బిస్కెట్లు విసురుతూ అసలు తనను పట్టించుకోనేలేదు… మనసు విరిగిన తనను బీజేపీ టాకిల్ చేసింది… ఫలితం అస్సోంలో ఇక కాంగ్రెస్ కోలుకోదు… ఇలా చాలామంది నేతల్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ… వెనుక నుంచి అన్నీ చక్కబెట్టే అహ్మద్ పటేల్ వంటి కేరక్టర్లు ఇప్పుడు లేరు పార్టీలో… వేణుగోపాల్ నీడలాగా ఉన్నాడే తప్ప డీకే శివకుమార్ తన సొంత రాష్ట్రంలోనే పట్టు సాధించలేకపోతున్నాడు…

కర్నాటకలో సిద్ధరామయ్యను గనుక మారిస్తే కర్నాటక కాంగ్రెస్‌లో సంక్షోభం ఖాయం… అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి జోలికి వెళ్తే అదీ మొదటికే మోసం తెచ్చే ప్రమాదం… పోనీ, ఇండి కూటమి సరిగ్గా ఉందా..? అదీ లేదు… కేజ్రీవాల్ ఔట్, మమత ఔట్… ఒక్క స్డాలిన్ మాత్రమే గట్టిగా కనిపిస్తున్నాడు… ఇప్పుడు తేజస్వి పని అయిపోయింది… అఖిలేష్ చంచల స్వభావి… రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోదు…

బీహార్ ఓటమి మాత్రమే కాదు… కొన్నేళ్ల రాహుల్ నాయకత్వ వైఫల్యాల మీద సమగ్ర సమీక్ష, దిద్దుబాటు ఉంటేనే దేశంలో బీజేపీకి ఓ బలమైన ప్రతిపక్షంగా మనుగడ… లేకపోతే రాహుల్ ఇలాగే ఉన్నట్టయితే, తనను తప్పుదోవలో నడిపిస్తున్న కోటరీని వదిలించుకోలేని పక్షంలో… దేశంలో అందరికన్నా ఎక్కువ సంతోషించేది మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాలు మరద తిమ్మక్క… 114 ఏళ్ల బతుకంతా పచ్చటి చెట్ల వరుసలే…
  • ఓహ్…! జుబ్లీ హిల్స్‌లో ఓడింది జగన్ రెడ్డి… గెలిచింది చంద్రబాబా..?!
  • అసలు రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇక పనికిరాదా..!?
  • సుమలత ఖాళీ చేయదు… రాజేంద్ర ప్రసాద్ అమ్ముకోలేడు… అల్లరల్లరి..!!
  • ఓ సైంటిస్టు ఘన సృష్టి..! కానీ మన కుళ్లు వ్యవస్థ తనను చంపేసింది..!
  • కిరాతకం..! పసి పిల్లాడిపై ఓ సవతి తండ్రి దారుణ హింస..!!
  • ఘట్టమనేని కృష్ణ… సూపర్‌నోవా ఆఫ్‌ ఏ సూపర్‌స్టార్‌..!
  • సంతానప్రాప్తిరస్తు..! ఓ సున్నితమైన, భిన్నమైన సబ్జెక్టు… పర్లేదు…!!
  • అంతా మాయ..! పీఆర్ టీమ్స్ మాయ..! బిగ్‌బాస్ వోటింగు మాయ..!!
  • శ్రేయసి సింగ్…! షూటింగ్ ఆట నుంచి… పొలిటికల్ షూటింగ్ వరకు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions