.
జప్ట్, ఊరికే జర్నలిస్టు సర్కిళ్లలో ఉన్న ఎవరినైనా అడగండి… ఏ తెలుగు చానెల్ నంబర్ వన్, నంబర్ టూ ఏమటి అని…! చాలామంది టీవీ9 ఫస్ట్, ఎన్టీవీ సెకండ్ అంటారు… అలా ప్రచారంలో ఉండిపోయింది కాబట్టి, అదే గుర్తుంటుంది…
కానీ బార్క్ రేటింగులు ఏమంటున్నాయో తెలుసా..? ముందుగా హైదరాబాద్ మార్కెట్… ఏబీఎన్ ఫస్ట్ ప్లేస్… మీరు చదివింది నిజమే… మరో విశేషం ఏమిటో తెలుసా… చిత్రవిచిత్ర పోకడలతో న్యూస్ రీడర్లు, డిబేట్ ప్రజెంటర్లు దర్శనమిచ్చే టీవీ5 సెకండ్ ప్లేసు… నమ్మడం లేదా..? ఈ జాబితా చూడండి…
Ads

వాటి తరువాతే టీవీ9… మరి ఎన్టీవీ..? ఏడో ప్లేసు..! మరో విశేషం కావాలా..? ప్రైమ్9 చానెల్ ఎన్టీవీకన్నా బెటర్ రేటింగు అట… అరె, ఏమిటిది అనుకుంటున్నారా..? మాయ… అంతా బార్క్ మీటర్ల మాయ… కూటమి సర్కారు హవా చానెళ్ల రేటింగులనూ రిఫ్లెక్ట్ చేస్తోందా..? జనసేన బాపతు ప్రైమ్9 చానెల్‌కు ఈ హఠాత్ వెలుగులకు కారణం కూటమి ప్రభుత్వమేనా..!
ఈమధ్య కాస్త పాపులర్ అయిన బిగ్ టీవీ మరీ అన్నింటికన్నా దిగువన, అసలు ఆ చానెల్ నడుస్తున్నదా అన్నట్టు రేటింగ్స్… ఇవీ అత్యంత విస్మయకర రేటింగ్స్…
చెప్పడం మరిచిపోయాను… మరి ఏబీఎన్, టీవీ5 లాగే పచ్చ చానెళ్లే కదా మహా న్యూస్, ఈటీవీ ఏపీ… అవి రెండూ అసలు చానెళ్లు నడుస్తున్నాయా లేదా అన్నట్టు రేటింగ్స్‌లో కునారిల్లుతున్నాయి… సరే, రెండు రాష్ట్రాలు కలిపి లెక్కేస్తే ఏమిటి సిట్యుయేషన్ అంటారా..? ఏక్ బార్ దేఖో…
Dt. 15.11.25 – 21.11.25
Total MKT
Week # 46 / 45
TV9 : 74.7/78.2
NTV : 65.9/63.4
TV5 : 43.2/44
ABN : 38.7/39.6
10TV : 28.7/26.8
V6 : 26.6/29.6
Prime 9 : 26.2/21.4
Sakshi : 23.9/22.9
Mahaa : 12.4/11
I News : 10.3/10.9
ETV AP : 8/7.1
T News : 5/6.9
ETV TS : 4/4.6
Big : 3.6/4.5
Tot: 371.2/370.9
ఈ జాబితాలో టీవీ9 ఫస్ట్, ఎన్టీవీ సెకండ్… మరి హైదరాబాద్ మార్కెట్‌కూ టోటల్ తెలుగు మార్కెట్‌కూ ఏమిటింత తేడా అంటారా..? అందుకే కదా చెప్పుకుంటున్నది… అంతా మాయ… మీటర్ల మాయ… టీన్యూస్ మరీ అంత దారుణంగా పడిపోయిందా..? అదేమిటి..? బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆదరణే అక్కడ ప్రతిబింబిస్తోంది అనుకోవాలి…
అవునా.,? తెలుగుదేశం అంత ఆదరణతో ఉందా..? అందుకే ఏబీఎన్, టీవీ5 హైదరాబాద్ మార్కెట్‌లో టాప్‌లో ఉన్నాయి అంటారా..? మరి మహాన్యూస్, ఈటీవీ ఏపీ ఎందుకంత దురవస్థలో ఉన్నట్టు మరి… సేమ్ సేమ్ పార్టీ కదా..!
అవునూ, టీవీ9, ఎన్టీవీ చానెళ్లను హైదరాబాద్ ప్రేక్షకులు ఎందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదంటారు..?! జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక రిజల్ట్స్ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా టీవీ9ను పరోక్షంగా ఆక్షేపించినట్టున్నాడు..!!
Share this Article