.
నిజానికి ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు… కేంద్రంలో అధికారం మారగానే తన మతం కారణంగా తనకు అవకాశలు దక్కాలనే విక్టిమ్ కార్డ్ తన ఒరిజినల్ తత్వాన్ని బయటపెడుతోంది…
సింపుల్… నిజంగా రెహమాన్ మతమే తనకు అవకాశాలు రానివ్వడం లేదు అనేది ఎంత అబద్ధమో… తనకు భారీ ఖర్చుతో నిర్మించే రామాయణ్ సినిమాకు అవకాశం రావడమే చెబుతోంది… నిజం ఏమిటంటే..? తనలో పస తగ్గింది… వస పెరిగింది… పైగా హిందీకి ఉర్దూ, అరబిక్ తల్లుల్లాంటి భాషలు అంటాడు… ఆ మనిషికి ఏమైందో తెలియదు…
Ads
ఎమర్జెన్సీ సినిమాకు మ్యూజిక్ ఇవ్వమని కంగనా అడిగితే ప్రాపగాండా సినిమా అంటూ రెఫ్యూజ్ చేశాడట.., కనీసం కంగనాను కలవడానికే ఇష్టపడలేదట… ఛావా సినిమా ‘విద్వేష సినిమా’ అట… సో, రెహమాన్‌ను ఇన్నేళ్లూ నెత్తిన మోసిన వారంతా షాక్‌కు గురయ్యే మెంటాలిటీ బయట పడుతోంది… నీ మొహం అన్నట్టుగా కంగనా రియాక్టయింది రెహమాన్ మత వ్యాఖ్యల మీద…
ఇదే కాదు… సుధామూర్తి అని ఓ కేరక్టర్… ఉద్యోగులు 12 గంటలు పనిచేయాలి అంటున్న పక్కా కమర్షియల్ సాఫ్ట్‌వేర్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య… ఆమధ్య నాకు రాముడు అంటే తెలియదు, ఎన్టీయార్‌ను చూసేదాకా అని ఏదో చెప్పింది… నిన్న పెన్సిల్‌తో గీతలు గీసి, దేశాన్ని విభజించారు, ఇండియా నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు వలస వెళ్లిన వాళ్లను చూస్తే జాలేస్తున్నదట… మరి అక్కడి నుంచి ఇండియాకు ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని వచ్చిన వాళ్ల మాటేమిటి..? సరే, అదొక పైత్యం…
ఇవి కాదు, నిజానికి తీవ్ర అభ్యంతరం ప్రకటించాల్సింది మరో వార్త…

తీర్థయాత్రకు వెళ్లలేని వాళ్లు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మహిళలపై లైంగిక దాడులు చేస్తారట, వాళ్లు అనుమతి ఇస్తారట, వాళ్లతో సంభోగం వల్ల తీర్థయాత్రల పుణ్యం దక్కుతుందట… అసలు ఆ వర్గాల్లో అందమైన మహిళలు లేకపోయినా లైంగిక దాడులు జరిగేది ఇందుకేనట…. ఇదీ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ తలతిక్క కూతలు…
తీవ్ర అభ్యంతరకరం… వాడు ఇంత కూసినా ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవ్వడూ స్పందించలేదు, ఖండించలేదు, వాడిపై చర్య లేదు… అది మరింత అభ్యంతరకరం… ఇవి కదా సొసైటీలో విద్వేషాల్ని జ్వలింపజేసేవి… ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఇవి…
నిజానికి హిందుత్వతో దీనికి లింక్ లేదు… ఇవి ఓ పర్వర్టెడ్ రాజకీయ నాయకుడి ధూర్త వ్యాఖ్యలు… వాస్తవంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే దీనిపై ఏదో ఓ యాక్షన్ ఇనీషియేట్ చేయాలి… సో, వాట్..? ఎమ్మెల్యే అయితే ఏమిటట..? డిస్‌గస్టింగ్..!! అవునూ, సొసైటీలో, ప్రపంచంలో ఏం జరిగినా గొంతు చించుకునే వాళ్లు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యంత అభ్యంతకర వ్యాఖ్యల మీద నిశ్శబ్దం దేనికి..?
Share this Article