Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

S E A D …. వెనెజులాపై దాడికి ప్రయోగించిన వార్ టెక్నిక్… (పార్ట్-2)

January 19, 2026 by M S R

.

( పొట్లూరి పార్థసారథి ) ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్ – Operation Absolute Resolve! శనివారం, జనవరి 3 అర్ధరాత్రి 2 గంటలు!

ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్ పేరుతో అమెరికన్ దళాలు వెనుజులా రాజధాని కారకస్ ( Caracus ) మీద దాడి చేసి వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ( Nicolas Maduro) అతని భార్య సిలియా ఫ్లోరెస్ ( Cilia Flores) లని కిడ్నాప్ చేసి అమెరికాకి తరలించాయి!

Ads

Well, గత మూడునెలలుగా వెనుజులా సముద్రతీరంలో అమెరికన్ నావీ మొహరించి వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మీద తీవ్ర ఒత్తిడి తెచ్చింది అమెరికా! వెనుజులా లాంటి బలహీనమైన లాటిన్ అమెరికన్ దేశం మీద అమెరికా దాడి చేసి అధ్యక్షుడు నోకోలస్ మదురో ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం పెద్ద విజయంగా చిత్రీకరిస్తున్నాయి పాశ్చాత్య మీడియా!

నిజానికి లాటిన్ అమెరికన్ దేశాలకి పెద్దగా సైనిక, ఆయుధ సంపత్తి అవసరం లేదు. చుట్టూ చిన్న చిన్న దేశాలు ఉన్నాయి తప్పితే ఒక దేశంతో ఇంకో దేశం యుద్ధం చేసే పరిస్థితులు లేవు.కాబట్టే మిలిటరీ పరంగా పెద్దగా దృష్టి పెట్టవు లాటిన్ అమెరికన్ దేశాలు. అఫ్కోర్స్! అర్జెంటినా, బ్రెజిల్ దేశాలు ఆర్ధికంగా, సైనికపరంగా మిగతా లాటిన్ అమెరికన్ దేశాల కంటే మెరుగ్గా ఉన్నాయి. 80 వ దశకంలో అర్జెంటినా బ్రిటన్ తో యుద్ధం చేసింది ఫాక్లాండ్ దీవుల విషయంలో!

వెనుజులా దేశపు మిలిటరీలో 1,09,0000 మంది యాక్టివ్ సైనికులు మాత్రమే ఉన్నారు! మరో 8 వేలమంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. మరో 2 లక్షల మంది పారా మిలిటరీ సైనికులు ఉన్నట్లు పేపర్ మీద ఉన్నా నిజానికి సింహాభాగం సైనికులు దేశం విడిచి వెళ్లిపోయారు వేరే ఉద్యోగాలు వెతుక్కుంటూ.

వెనుజులా నావీ: కేవలం పెట్రోలింగ్ బోట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా సముద్ర తీరంలో డ్రగ్స్ రవాణా మీద నిఘా పెట్టడానికి మాత్రమే పనికివస్తాయి తప్పితే యుద్ధంలో పాల్గొనడానికి పనికి రావు.

వెనుజులా ఎయిర్ ఫోర్స్: అమెరికాతో సత్సంబంధాలు ఉన్న 1982 లో 24 F-16 ఫైటింగ్ ఫాల్కన్ ఫైటర్ జెట్స్ కొన్నది వెనుజులా. క్రమంగా కమ్యూనిస్ట్ భావజాలం పెరగడంతో F-16 ఫైటింగ్ ఫాల్కన్స్ కి స్పేర్ పార్ట్స్ సరఫరా నిలిపివేసింది అమెరికా. దాంతో 2006 లో రష్యా నుండి 24 సుఖోయ్ Su-30 MK2 లని కొన్నది. అవీ బేసిక్ మోడల్ వి మాత్రమే. ఎప్పుడైతే రష్యా నుండి ఫైటర్ జెట్స్ ని కొన్నదో వెనుజులా మీద ఆంక్షలు విధించింది అమెరికా. రష్యా, చైనా తప్పితే వేరే ఏ దేశం కూడా వెనిజులా కి ఆయుధాలు అమ్మడానికి ముందుకు రాలేదు అమెరికా ఆంక్షల వల్ల.

1982 లో అమెరికా నుండి కొన్న F 16 లకి స్పేర్ పార్ట్స్ లేకపోవడంతో రెండు మాత్రమే వాడుకలో ఉన్నాయి ఎలాంటి అప్ గ్రేడ్ చేయకుండా.
మొత్తంగా చూస్తే వెనిజులా దగ్గర నామ మాత్రపు జెట్ ఫైటర్స్ మాత్రమే ఉన్నాయి. నావీ లేదు.
ఇలాంటి దేశం మీద దాడి చేసి అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ప్రపంచంలో అమెరికా సైన్యంకి తిరుగులేదని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం!

నిజంగా అమెరికన్ దళాలు టెక్నీకల్గా ప్రతిభ కలిగినవిగా ఉండి పాశ్చాత్య మీడియా చెపుతున్నట్లు విజయం సాధించాయా?
వివరంగా…….
S E A D ఆపరేషన్!

సీడ్ అంటే సప్రషన్ అఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్( Suppression of Enemy Air Defences). సీడ్ ఆపరేషన్ లో భాగంగా ముందు శత్రుదేశపు గ్రౌండ్ రాడార్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, యాంటి ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ని ధ్వంసం చేస్తారు. సీడ్ ఆపరేషన్ విజయవంతం అవ్వాలి అంటే విద్యుత్ సరఫరా చేసే పవర్ స్టేషన్స్ ని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తూ, మరో వైపు ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ ని ఉపయోగించి శత్రుదేశపు కమ్యూనికేషన్ వ్యవస్థని జామ్ చేస్తారు.

ఈ రెండూ అవగానే శత్రుదేశపు రాడార్ల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తారు. ఈ మూడు దశలు పూర్తవగానే బాంబర్లు, హెలికాప్టర్లు, ముందుగా నిర్దేశించిన లక్ష్యాల మీద ఎగురుతూ దాడి చేస్తాయి.

వియత్నాం యుద్ధ సమయంలో అమెరికన్ సైన్యం తీవ్రంగా నష్టపోయింది వియత్నాం చేతిలో. తరువాత వియత్నాంలో మనం ఎందుకు ఆయుధాలు, సైనికులని కోల్పోయాము అన్న దాని మీద అమెరికన్ యుద్ధవ్యూహకర్తలు పరిశీలన చేసి చివరికి SEAD ఆపరేషన్ కి రూపకల్పన చేశారు.

ఇదే SEAD ఆపరేషన్ ని ఇరాక్, లిబియా దేశాల మీద ప్రయోగించి విజయం సాధించింది అమెరికా, అయితే NATO భాగస్వామ్య దేశాలు అయిన జెర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలతోపాటు కెనడా కూడా యుద్ధ అనుభవం కోసం పాల్గొంది!
కానీ ఈ సారి నాటో సహాయం లేకుండా వెనుజులా మీద దాడి చేసింది అమెరికా.

1.అర్ధరాత్రి 2 గంటలకి అమెరికన్ సైబర్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ వెనుజులా పవర్ గ్రిడ్ ని తన అదుపులోకి తీసుకొని వెనుజులా రాజధాని కారకస్ కి సరఫరా అవుతున్న విద్యుత్ ని నిలిపివేసింది!

2.ఇదే సమయంలో వెనుజులాకి 13 కిలోమీటర్ల దూరంలో కరేబియన్ సముద్రంలో ఉన్న అమెరికన్ ఫ్రీగేట్లు టామ్ హాక్ క్రూయిజ్ మిస్సళ్ళ తో వెనుజులా రాజధానిలోని మిలిటరీ లక్ష్యాల మీద దాడిచేసాయి. మొత్తం 24 క్రూయిజ్ మిస్సయిళ్లు తమ లక్ష్యాలని ధ్వంసం చేశాయి.

3.అమెరికన్ నావీ కి చెందిన EA-18 గ్రాలర్ ( EA-18 Growler) మొత్తం నాలుగు విమానాలు కారకాస్ మీద ఎగురుతూ రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని జామ్ చేశాయి. EA-18 గ్రాలర్ మొబైల్ నెట్వర్క్ ని కూడా జామ్ చేశాయి. EA-18G గ్రాలర్ అమెరికన్ నావీ కోసం F/A-18 ఫైటర్ జెట్ ని మాడీఫై చేసి ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ కోసం వాడుతున్నారు. EA-18G కేవలం ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ కోసమే పనిచేస్తుంది తప్పితే దాడి చేయదు.

4.అమెరికన్ నావీకి చెందిన EA-18G వెనుజులా రాజధాని కారకాస్ లో ఉన్న రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని జామ్ చేయగానే నావీకి చెందిన F-35లైట్నింగ్ II( F-35 Lightning II) స్టెల్త్ ఫైటర్ జెట్స్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద యాంటి రేడియేషన్ మిసైల్స్ ప్రయోగించి ధ్వంసం చేశాయి.

5.నాలుగు అపాచీ ఎటాక్ హెలికాప్టర్స్ కారకాస్ మీద ఎగురుతూ పహారా కాస్తుండగా మరో నాలుగు అపాచీ హెలికాప్టర్స్ వెనుజులా అధ్యక్ష్య భవనం చుట్టూ తిరుగుతూ వెనుజులా సైన్యం నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.

6.F-22 స్టెల్త్ ఫైటర్జెట్స్ ని అమెరికా బయట మొదటిసారిగా ఉపయోగించారు వెనిజులాలో! నాలుగు F-22 స్టెల్త్ ఫైటర్ జెట్స్ వెనిజులా రాజధాని కారకాస్ గగనతలంలో ఎగురుతూ వెనుజులా దగ్గర ఉన్న SU-30 MK2 జెట్ ఫైటర్స్ గాల్లోకి ఎగిరితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ వెనుజులా ఎయిర్ ఫోర్స్ నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురవలేదు.

7. MH – 47G చినూక్ హెలికాప్టర్స్ US మేరైన్స్ ని అధ్యక్ష భవనం దగ్గర దించాయి. US మెరైన్స్ మొత్తం 160 మంది అధ్యక్ష భవనం చుట్టూ మొహరించారు.

8.డెల్టా ఫోర్స్…: ( DELTA FORCE) అనే కమాండో దళ సభ్యులు మొత్తం 200 మంది మదురో ఉన్న భవనం మీద దిగి నేరుగా మదురో నిద్రిస్తున్న గది దగ్గరికి చేరుకొని ప్రత్యేక ఛార్జ్ పరికరంతో తలుపులు పగులకొట్టి నేరుగా మదురో దగ్గరికి వెళ్లి అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పి లొంగిపొమ్మని కోరారు. ఎప్పుడైతే తలుపులు విరగ్గొడుతున్న శబ్దం వినపడిందో మదురో లేచి ప్రత్యేక రహస్యమార్గం ద్వారా తప్పించుకోవాలని చూశాడు.

కానీ డెల్టా ఫోర్స్ కమాండోలు అంత సమయం ఇవ్వలేదు. వెనుజులా అధ్యక్ష్య భవనం మిరఫ్లోరెస్ లో అధ్యక్షుడు బెడ్ రూమ్ తలుపులు రీ ఇన్ఫోర్స్డ్ స్టీల్ తో తయారుచేసినవి కాబట్టి చిన్న చిన్న ప్లాస్టిక్ ఎక్సప్లోసివ్స్ పేలుడుని తట్టుకోగలవు కానీ ఇలాంటి రీఇన్ఫోర్స్డ్ స్టీల్ డోర్స్ ని పెద్దగా శ్రమ పడకుండా తెరవడానికి లేదా పగులకొట్టడానికి ఎలక్ట్రిక్ ఛార్జ్ బౌండర్ ని ప్రత్యేకంగా తయారుచేసి తీసుకోచ్చారు.

9.మరో డెల్టా ఫోర్స్ టీమ్ అధ్యక్ష్య భవనంలోని వేరే గదిలో నిద్రిస్తున్న మదురో భార్య సిలియా ఫ్లోరెస్ ని అదుపులోకి తీసుకొని నేరుగా ముందే సిద్ధం చేసుకున్న హెలికాప్టర్ దగ్గరికి తీసుకెళ్లారు.

10.నికోలాస్ మదురో, సిలియా ఫ్లోరెస్ లని హెలికాప్టర్ ద్వారా అమెరికాకి తరలించారు.
11.మొత్తం 145 విమానాలు, హెలికాఫ్టర్లు ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్’ లో పాల్గొన్నాయి….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వెనెజులా కొంప ముంచిన చైనా… చేతులెత్తేసిన నాసి రాడార్లు… పార్ట్-3
  • S E A D …. వెనెజులాపై దాడికి ప్రయోగించిన వార్ టెక్నిక్… (పార్ట్-2)
  • 2026 జియోపాలిటిక్స్… కాలజ్ఞాని బాబ వంగ ముందే చెప్పింది… (పార్ట్-1)
  • నేలకొరిగిన తెలుగు సింహం… ఒకేరోజు మూడు సప్లిమెంట్లు ఇచ్చాం….
  • అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు… కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి…
  • రహస్య తెగ కాదు… అదృశ్యం చేయబడుతున్న ఓ అమెజాన్ తెగ…
  • ఆసక్తిని రేపుతున్న ‘యుఫోరియా’… నేటి సొసైటీకి అవసరమైన సబ్జెక్టు…
  • వరి వేస్తే ఉరే అంటివి కేసీయార్..! చూడు, నేడు వరిలో కొత్త రికార్డులు..!!
  • అన్నీ మసాలాలే… కానీ కథ అనే ఉప్పు మరిచాడు రాఘవేంద్రుడు…
  • PhotonSync… మన డిజిటల్ సైంటిస్టుల ‘సూపర్ షీల్డ్’ ఆవిష్కరణ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions