.
దిలీప్… మతం మారాక ఏఆర్ రెహమాన్… ఆస్కార్ దాకా వెళ్లిన కంపోజర్… దేశమంతా మెచ్చి, చప్పట్లు కొట్టి, అభిమానించిన పేరు… ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయాడు… జనం ఏవగించుకుంటున్నారు… కారణం, ఈ దేశం తనకు ఇంత అపారమైన పేరును, ప్రేమను, సంపదను ఇచ్చినా సరే… అకారణంగా… తనకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడానికి తన మతమే కారణమనే ఓ శుష్క వాదనను, విక్టిమ్ కార్డును ప్రయోగించడం…
నిజానికి తనది ఎంత చీప్ మెంటాలిటీయో చెప్పడానికి ఇదే ప్రబల నిదర్శనం… కేంద్రంలో పవర్ షిఫ్ట్, తన మతం వల్లే తనకు అవకాశాలు తగ్గడం లేదట… బాలీవుడ్‌లో లైట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్ నుంచి ప్రముఖ నిర్మాతలు, హీరోలు, దర్శకుల దాకా ఒక్కడూ ఈరోజుకూ ఈ కోణంలో మాట్లాడలేదు… అంతెందుకు..? దశాబ్దాలుగా హిందీ ప్రేక్షకులు ఖాన్ త్రయాన్ని ప్రేమించడం లేదా..?
Ads
పైగా నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే, మనస్తాపానికి గురయితే క్షమాపణ అని ఓ వీడియో రిలీజ్ చేశాడు… ఎవరూ బాధపడలేదు రెహమాన్, ఎవరూ మనస్తాపానికి గురి కాలేదు… ఏవగించుకున్నారు, నీ నిజతత్వం తెలిసి… అంతే… అసలు నువ్వు సారీ చెప్పాల్సిన పనేలేదు… ఎందుకంటే, నువ్వేమిటో నువ్వే ప్రేక్షకులకు చెప్పి, కళ్లు తెరిపించావు కాబట్టి..!!
సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళి పోస్టు ఓసారి చెప్పుకుని, మరిన్ని వివరాలు చెప్పుకుందాం… ‘‘ఓ రెండేళ్ల క్రితం ఆర్‌జీవీ వీడియో ఒకటి చూశా.. . రెహమాన్ వ్యవహారం ఒకటి అందులో ఉంది … రెహమాన్ కూడా ఆ వీడియో చూస్తే తనకు అవకాశాలు ఎందుకు తగ్గాయో తెలుస్తుంది …
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత / దర్శకుడు ఒకరు తన సినిమాలోని పాటలకు రెహమాన్ కు మ్యూజిక్ బాధ్యత అప్పగించారు… ఎంతకూ పని చేయకుండా తిప్పాడు … ఓ రోజు గట్టిగా నిలదీస్తే పలానా తేదీన రమ్మని చెప్పాడు . ఆ రోజు నిర్మాత వచ్చేసరికి రెహమాన్ లేడు, అసిస్టెంట్ మాత్రం నిర్మాతకు మ్యూజిక్ పెన్ డ్రైవ్ ఇచ్చాడు ,,.
అదేంటి, అంత డబ్బు తీసుకుని, రెహమాన్ కాకుండా నువ్వు మ్యూజిక్ ఇవ్వడం ఏమిటీ అని నిర్మాత నిలదీయడమే కాకుండా రెహమాన్ ను బూతులు తిట్టాడు … అక్కడికి వచ్చిన రెహమాన్ నిర్మాతతో ‘‘నువ్వు అంత భారీ రెమ్యునరేషన్ ఇచ్చింది నా బ్రాండ్ నేమ్‌కే కానీ మ్యూజిక్‌కు కాదు వెళ్ళు అని గట్టిగా బదులిచ్చాడు … ఆర్‌జివి చెప్పింది నిజమే అని నా గట్టి నమ్మకం …
బాబూ, రెహమాన్, నీ బ్రాండ్‌కు డిమాండ్ ఉన్నప్పుడు నువ్వు అడిగినంత ఇచ్చి, పడిగాపులు గాచి, నీతో పని చేయించుకున్నారు … ఇప్పుడు నీ బ్రాండ్‌కు విలువ లేదు . అందుకే నీకు విలువ లేదు . అంతే తప్ప మతం కారణం అనేది నువ్వు తగిలించుకున్న సాకు … మతం మారాకే జీవితం మారింది అని నువ్వే అనేకసార్లు చెప్పావు …
(ఇది సుభాష్ ఘాయ్ (Subhash Ghai) దర్శకత్వంలోని “Yuvvraaj” సినిమాకు సంబంధించిన సంఘటన అని ఎఐ ప్లాట్‌ఫామ్స్ చెబుతున్నాయి… సరే, రెహమాన్ వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా విమర్శలు, తిట్లు వ్యక్తం అయ్యేసరికి… నెత్తీనోరూ కొట్టుకుంటూ సారీ వీడియో రిలీజ్ చేశాడు… కానీ ఇన్నేళ్లు నెత్తిన మోసిన తమిళ ఇండస్ట్రీ, తమిళ మీడియా కూడా తనను ఏవగించుకుంది… (నిజానికి చాలా ఏళ్లుగా రెహమాన్ మార్క్ ఇంప్రెసివ్ మ్యూజిక్ ఏమీ రావడం లేదు… ఏదో 99 సాంగ్స్ అని ఏదో క్రియేట్ చేయబోయాడు గానీ అదీ క్లిక్ కాలేదు…

రెహమాన్ పతనంపై తమిళ్ మీడియా, ఇండస్ట్రీ విశ్లేషణ… రెహమాన్ తన మ్యూజిక్ స్టూడియోనే ప్రపంచంగా బతికాడు… ఒకే ఇంట్లో ఉన్నా, దశాబ్ద కాలంగా ఆయన భార్య సైరా బానుతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ… ఇంటికి కూడా వెళ్ళకుండా, ఆమెకు కనీసం సమయం ఇవ్వకపోవడమే తన విడాకులకు పునాది…
మోహిని డే అని తన బృంద సభ్యురాలు… అంతే కాదు, గత కొన్నాళ్లుగా రెహమాన్ ఆమెకు వ్యక్తిగత జీవితంలో ఇస్తున్న ప్రాధాన్యం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది… మోహిని డే తన భర్తకు విడాకులు ఇచ్చిన వెంటనే అప్పటిదాకా రెహమాన్ తిరుగుళ్ళు సహించిన సైరా బాను వెంటనే తను కూడా రెహమాన్ కి విడాకులు ఇస్తూ ప్రకటన చెయ్యడం… ఇలా వీరిద్దరూ ఒకే రోజు విడాకులు ప్రకటించడం “కాకతాళీయం కాదు “…

అవుట్ డేటెడ్ కంపోజిషన్… “రెహమాన్ ట్యూన్స్ ఇప్పుడు మొద్దుబారాయి” అని తమిళ సంగీత విమర్శకుల విశ్లేషణ… దానికి తోడు అనిరుధ్ వంటి కొత్తతరం సంగీత దర్శకులు దూసుకుపోతుంటే రెహమాన్ వాళ్లకు కనీస పోటీ ఇవ్వలేకపోతున్నాడు… పైగా ఇగో సమస్య ఉండనే ఉంది…
మ్యూజిక్ స్కూల్స్, అంతర్జాతీయ టూర్ల ద్వారా డబ్బు సంపాదించడంపైనే రెహమాన్ ఎక్కువ దృష్టి పెట్టాడు, అందుకే ఆయన పాటల్లో పూర్వపు ‘ఆత్మ’ (Soul) కనిపించడం లేదు… తమిళనాడులో డిఎంకె (DMK) వంటి పార్టీలతో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుని, మతపరమైన సమీకరణల ద్వారా పెద్ద ప్రాజెక్టులు దక్కించుకోవడానికి రెహమాన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి…
వెరసి... ఒకప్పుడు "ఇసై పుయల్" (సంగీత తుపాను) గా పిలవబడ్డ రెహమాన్, నేడు విడాకులు, అక్రమ సంబంధాల ఆరోపణలు, మతపరమైన వ్యాఖ్యల నడుమ చిక్కుకుని... గతాన్ని అమ్ముకుంటూ బతుకుతూ... భవిష్యత్తును తనే చీకటిమయం చేసుకుంటున్నాడని తమిళ మీడయా రాసుకొస్తోంది...

Share this Article