Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫోన్ కెమెరా లెన్సులకు ‘రెడ్ టేప్’… ట్యాపింగు నిరోధించగలదా..?

February 1, 2026 by M S R

.

తెలంగాణలో ప్రస్తుతం ‘ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారం నిద్రలేకుండా చేస్తోంది… ఇంటెలిజెన్స్ వర్గాలు వాడిన ‘ఆఫ్ ది ఎయిర్’ టెక్నాలజీ ముందు ఏ ఫోన్ అయినా, ఏ కాలింగ్ ప్లాట్‌ఫామ్ అయినా ‘ట్యాప్‌కు అతీతం కాదు’ అన్నట్టుగా ఉంది…

మామూలు ఫోన్ కాల్స్ బదులు ఫేస్‌టైమ్ (ఐఫోన్), సిగ్నల్ యాప్ వంటివి వాడుతున్నా… అవీ సురక్షితం అనే నమ్మకం ప్రస్తుతం ఎవరికీ లేకుండా పోయింది… పెగాసస్ తాత వంటి హైటెక్నాలజీ ఏదో వాడుతున్నారని నాయకులు, సెలబ్రిటీలు నమ్ముతున్నారు…

Ads

ఈ స్థితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఫోన్‌కు రెడ్ టేప్ అతికించుకుని మాట్లాడుతున్న ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్… దాని మీద రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి… ఏమిటీ ఆ రెడ్ టేప్..?

నిజానికి రెడ్ టేప్ అంటే బ్యూరోక్రసీలో జాప్యం, అడ్డంకులు, చిక్కులు… కానీ ఈ రెడ్ టేప్ ప్రధాని ఫోన్ సంభాషణలకు అత్యున్నత భద్రత టెక్కినల్ చిట్కా అంటున్నారు… ఫోన్ ట్యాపింగు టెక్నాలజీలో ఇజ్రాయిల్‌దే పైచేయి కదా ప్రపంచంలో… సో, అలాంటి ఏ ట్యాపింగుకూ ఈ ఫోన్ మీద రెడ్ టేప్ లొంగదు అనే విశ్లేషణలు నడుస్తున్నాయి… కానీ..?

red tape

ఆ ఎర్రటి టేప్ ట్యాపింగ్‌ను ఆపలేదు… కానీ అంతకంటే ప్రమాదకరమైన మరో దొంగచాటు పనిని ఆపుతుంది..!

ట్యాపింగ్ vs నిఘా… తేడా ఏంటి?

మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎర్రటి టేప్ అనేది ఒక ‘సెక్యూరిటీ సీల్’ (Tamper-evident seal) మాత్రమే…

  1. మాటలు దొంగిలిస్తే (Audio Tapping)…: తెలంగాణలో జరిగినట్లుగా సాఫ్ట్‌వేర్ లేదా సిగ్నల్ హ్యాకింగ్ ద్వారా మీ మాటలు వింటుంటే, ఈ టేప్ ఏమీ చేయలేదు…. ఎందుకంటే ఇది మైక్రోఫోన్‌ను బ్లాక్ చేయదు…

  2. దృశ్యాలు దొంగిలిస్తే (Visual Surveillance)…: పెగాసస్ వంటి స్పైవేర్లు రిమోట్‌గా మీ ఫోన్ కెమెరా ఆన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో డీల్స్ మాట్లాడుతున్నారు అనేది చూస్తుంటే… అప్పుడు ఈ టేప్ హీరోలా అడ్డుకుంటుంది… ఆ టేప్ వల్ల స్పై కెమెరాలకు కటిక చీకటి తప్ప ఏమీ కనిపించదు…

ఈ సీల్ ఎలా పనిచేస్తుంది? (Technical Insight) ఈ టేప్ వెనుక ఉన్నది ‘ట్యాంపర్ ఎవిడెంట్’ టెక్నాలజీ…

  • భౌతిక రక్షణ…: ఇది కెమెరా లెన్స్, సెన్సార్లను పూర్తిగా కప్పి ఉంచుతుంది…

  • గుర్తులు మిగిలిపోతాయి…: ఒకవేళ ఎవరైనా రహస్యంగా ఆ టేప్ తీసి ఫోటోలు తీయాలని చూస్తే, ఆ టేప్ కింద ‘VOID’ లేదా ‘OPENED’ అనే అక్షరాలు పడతాయి… ఆ టేప్‌ను మళ్ళీ అంటించడం ఎవరివల్లా కాదు… అంటే మీ ఫోన్‌ను ఎవరైనా ముట్టుకున్నా సెకన్లలో తెలిసిపోతుంది…

ఇజ్రాయెల్ ప్రధాని స్థాయిలో భద్రత అంటే, నిజానికి అది ఒకే ఒక్క టేపుతో ముగిసిపోదు… ఆయన వాడే ఫోన్లు ‘హార్డెన్డ్’ (Hardened) వెర్షన్లు అయి ఉంటాయి… అంటే వాటిలో సాఫ్ట్‌వేర్ పరంగా ట్యాపింగ్‌ను అడ్డుకునే ఎన్నో ఎన్‌క్రిప్షన్ పొరలు ఉంటాయి… ఈ ఎర్రటి టేప్ అనేది ఆ భద్రతా వలయంలో ఆఖరి మెట్టు (Last line of defense)… సాఫ్ట్‌వేర్ హ్యాక్ అయినా, కనీసం ఫోన్‌లోని డేటా ఆ లెన్సులు, సెన్సార్ల నుంచి శత్రువుల చేతికి చిక్కకూడదనేది ఈ టేప్ వెనుక ఉన్న పక్కా ప్లాన్…

  • లేజర్ మైక్రోఫోన్ల ముప్పు…: ప్రస్తుతం హైటెక్ నిఘాలో ‘లేజర్ మైక్రోఫోన్లు’ వాడుతున్నారు… అంటే దూరం నుంచి లేజర్ కిరణాన్ని ఫోన్ గ్లాస్ మీద వేసి, మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చే ప్రకంపనల (Vibrations) ఆధారంగా మాటలను వినవచ్చు… నెతన్యాహు వాడే ఈ మందపాటి సెక్యూరిటీ సీల్ ఆ లేజర్ ప్రతిబింబాన్ని (Reflections) కూడా అడ్డుకుంటుంది… ఇది ఒక అదనపు రక్షణ…

  •  “పెగాసస్ వంటి ట్యాపింగ్ టెక్నాలజీ సృష్టికర్తలే తమ సొంత ప్రధాని ఫోన్‌కు రెడ్ టేప్ వేయాల్సి వచ్చిందంటే, టెక్నాలజీ ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు…”

ముగింపు…. తెలంగాణలో చర్చ జరుగుతున్న హైటెక్ ట్యాపింగ్ పరికరాల ముందు ఈ టేప్ చాలా చిన్నది కావొచ్చు… కానీ ప్రైవసీ విషయంలో ఏమాత్రం రాజీపడని నెతన్యాహు వంటి నేతలు, సాఫ్ట్‌వేర్ భద్రతతో పాటు ఇలాంటి ‘భౌతిక’ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విశ్వం విస్తరిస్తోంది సరే, కానీ ఏ ఖాళీలోకి..? అసలు గురుత్వాకర్షణ నిజమేనా..?
  • ఫోన్ కెమెరా లెన్సులకు ‘రెడ్ టేప్’… ట్యాపింగు నిరోధించగలదా..?
  • ఐఐటీ జెమ్ కిడ్… బాల మేధావి… నువ్వు గ్రేట్‌రా అబ్బాయ్…
  • ‘మేడారం జాతర ఫోటోల్ని హెలికాప్టర్ నుంచి స్పెషల్‌గా తీయిద్దామా…’
  • ప్రధాని మోడీ ఇచ్చిన కానుకలను అమెరికా అధ్యక్షుడు పారేశాడా..!?
  • రేవంత్‌రెడ్డి మార్క్ ఆట… శిక్షించనంటాడు- అలాగని ఉపేక్షించడు…
  • మేడారంలో మంత్రి సీతక్కతో డాన్స్… ఎవరామె..? ఒక్కసారిగా వైరల్..!!
  • బహుపరాక్..! అత్యంత చంచలంగా వెండి- బంగారం ధరలు…!!
  • టేబుల్ టాప్ రన్ వే..! అజిత్ పవార్ ప్రమాదంతో మళ్లీ చర్చల్లోకి..!!
  • గాంధీ టాక్స్..! మాటల్లేనితనానికి రెహమాన్ సంగీతంతో భర్తీ…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions