Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏం కష్టమొచ్చిందో గానీ… అందరితోనూ కన్నీరు పెట్టిస్తున్న ఫోటో…

February 1, 2026 by M S R

.

బహుశా తెలుగు జనాన్ని అత్యంత ఎమోషన్‌కు గురిచేసిన వార్త ఇదే అనుకుంటా… నిన్నా ఈరోజు… నిజంగా చదువుతుంటే కలుక్కుమనేలా ఉంది…

ఆమె… విజయారెడ్డి… మంచి ఐటీ ఉద్యోగం… ఇద్దరు పిల్లలు… బిడ్డ చేతన రెడ్డి, కొడుకు విశాల్‌రెడ్డి… ఎక్కడో హాస్టల్‌లో ఉండి ఇంటర్ చదువుతున్నారు… సొంతిల్లు… చెంగిచర్ల ఏరియాలో… అమ్మ పుష్పలత కూడా ఆమెతోనే ఉంటోంది…

Ads

మొగుడు ఎక్కడో సౌదీలో కొలువు చేస్తున్నాడు… భర్త పేరు సురేందర్ రెడ్డి… నెల్లూరు సొంతూరు… 4 నెలలక్రితం వచ్చాడు, పిల్లలతో గడిపాడు, వెళ్లిపోయాడు… పెద్దగా కుటుంబకలహాల గురించీ ఎవరికీ తెలియదు… కానీ హఠాత్తుగా ఆమె అవాంఛనీయమైన నిర్ణయం తీసుకుంది…

పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చింది… రాత్రికిరాత్రి రైలు పట్టాల మీదుగా నడుస్తూ వెళ్లి, గూడ్స్ రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకుంది… ఇద్దరు పిల్లల్ని దగ్గరకు హత్తుకుని, తనతోపాటు వేరే లోకాలకు తీసుకుపోయింది… ఇదీ విషాదం…

suicide

కారణం..? తెలియదు… ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో కూడా వివరాలేమీ లేవు… భర్త మీద కూడా ఫిర్యాదు లేదు, తన ప్రస్తావనే లేదు… అమ్మను క్షమించమని రాసి… బతకలేకపోతున్నా, పిల్లలను కూడా తీసుకుని పోతున్నా అని రాసింది, అంతే…

కానీ, ఏదో బలమైన కారణం లేకపోతే అంత అఘాయిత్యానికి పాల్పడదు… చదువుకున్నది, టీమ్ లీడర్‌గా మంచి ఉద్యోగంలో ఉంది… భర్తతో విభేదాలా..? విడాకులు తీసుకోవచ్చు, విడిపోయి బతకొచ్చు… ఇంకేమైనా సమస్యలా..? మిస్టరీ..!

ఎవరైనా కొలీగ్స్‌తో తన విషాదాన్ని, తన ఆందోళనను పంచుకుందో లేదో తెలియదు… కానీ ఇంటర్ చదువుతున్న పిల్లల్ని కూడా తీసుకుపోవడం మరో విషాదం… ఆ పిల్లలు కూడా తల్లి వాదనతో కన్విన్స్ కావడమే ఆశ్చర్యం… ఆమె పిల్లల్ని బలవంతంగా పట్టుకుని రైలుకు ఎదురువెళ్లడానికి చిన్న పిల్లలేమీ కాదు… ఇంటర్ చదువుతున్నారు… అంటే ఆమె ఆత్మహత్యకు పిల్లల్ని కూడా కన్విన్స్ చేసింది…

సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు, పోస్టులు, సంతాపాలు… ఈరోజంతా ఇదే వైరల్ విషాదం… కారణాలు ఏమై ఉంటాయాని అంచనాలు, ఊహాగానాలు… తిరిగి రారు, మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి… ముద్దుగా ఉన్నారు పిల్లలు కూడా… పోయేది ఆమె పోవచ్చు కదా, పిల్లల్ని బలి పెట్టడం దేనికనేదే చాలామంది అడిగిన ప్రశ్న…

వినడానికి వాళ్లు లేరు, జవాబూ దొరకదు… అది ఆ దుర్బల క్షణంలో తీసుకున్న నిర్ణయం… భర్తతో విభేదాలకన్నా ఇంకేదో బలమైన కారణమే ఉండి ఉంటుంది.., భర్త మామధ్య కలతలు, కలహాలు లేవంటున్నాడు… ఆమె తల్లి అదే చెబుతోంది, ఆమె అన్న అదే అంటున్నాడు… మరేమిటి..?

ఎంత బలమైన కారణమైనా సరే, బతికి, పరిస్థితులతో పోరాడితేనే బాగుండేది... చావే సమస్యలకు పరిష్కారమైతే, అసలు ఈ లోకంలో ఒక్క మనిషి కూడా మిగలడు కదా..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏం కష్టమొచ్చిందో గానీ… అందరితోనూ కన్నీరు పెట్టిస్తున్న ఫోటో…
  • విశ్వం విస్తరిస్తోంది సరే, కానీ ఏ ఖాళీలోకి..? అసలు గురుత్వాకర్షణ నిజమేనా..?
  • ఫోన్ కెమెరా లెన్సులకు ‘రెడ్ టేప్’… ట్యాపింగు నిరోధించగలదా..?
  • ఐఐటీ జెమ్ కిడ్… బాల మేధావి… నువ్వు గ్రేట్‌రా అబ్బాయ్…
  • ‘మేడారం జాతర ఫోటోల్ని హెలికాప్టర్ నుంచి స్పెషల్‌గా తీయిద్దామా…’
  • ప్రధాని మోడీ ఇచ్చిన కానుకలను అమెరికా అధ్యక్షుడు పారేశాడా..!?
  • రేవంత్‌రెడ్డి మార్క్ ఆట… శిక్షించనంటాడు- అలాగని ఉపేక్షించడు…
  • మేడారంలో మంత్రి సీతక్కతో డాన్స్… ఎవరామె..? ఒక్కసారిగా వైరల్..!!
  • బహుపరాక్..! అత్యంత చంచలంగా వెండి- బంగారం ధరలు…!!
  • టేబుల్ టాప్ రన్ వే..! అజిత్ పవార్ ప్రమాదంతో మళ్లీ చర్చల్లోకి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions